ETV Bharat / spiritual

మీ ఒంటి మీద అక్కడ పుట్టుమచ్చ ఉంటే - మీకు తిరుగుండదట! - Mole Sign Of Good Luck

author img

By ETV Bharat Telugu Team

Published : May 27, 2024, 5:13 PM IST

Good Luck With Moles : జ్యోతిష్యాన్ని చాలా మంది నమ్ముతారు. పుట్టు మచ్చల వల్ల లాభం, నష్టం కలుగుతాయని జ్యోతిష్యులు చెబుతుంటారు. అయితే.. శరీరంపై ఒక ప్రదేశంలో పుట్టు మచ్చ ఉంటే అదృష్టం కలిసి వస్తుందని అంటున్నారు. మరి, ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.

Luck With Moles
Good Luck With Moles (ETV Bharat)

Good Luck With Moles : పుట్టుమచ్చలు అందరి ఒంటిపైనా ఉంటాయి. అయితే.. అవి ఉన్నచోటును బట్టి అదృష్టం, దురదృష్టం ఆధారపడి ఉంటాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. అంతేకాదు.. పుట్టుమచ్చలు ఉండే ప్రదేశాన్ని బట్టి ఒక వ్యక్తి వ్యక్తిత్వం, భవిష్యత్తును కూడా తెలుసుకోవచ్చని అంటున్నారు. శరీరంపైన కొన్ని చోట్ల పుట్టు మచ్చలు ఉండటం వల్ల అదృష్టం కలిసి వస్తుందని చెబుతున్నారు. మరి.. పుట్టు మచ్చలు ఎక్కడ ఉంటే అదృష్టం కలిసి వస్తుంది? అనే విషయాలను ఇప్పుడు చూద్దాం.

నుదుటిపై పుట్టుమచ్చ : ఇక్కడ పుట్టు మచ్చలు ఉన్నవారికి చాలా తెలివితేటలు ఉంటాయట. వీరు చాలా కొత్తగా ఆలోచించి.. ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారట. అలాగే భవిష్యత్తులో వారు పని చేస్తున్న రంగంలో నాయకుడిగా ఎదిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని పండితులు చెబుతున్నారు.

చెంప మీద : చెంప పైన పుట్టు మచ్చ ఉన్న వారు అందరితో కలిసి పోయే స్వభావాన్ని కలిగి ఉంటారట. వీరు ఏ పనినైనా కూడా ధైర్యంగా ఎదుర్కొంటారట. చాలా చురుకుగా ఉండి.. అన్ని పనులను సక్రమంగా నిర్వహిస్తారని జ్యోతిష్యులు చెబుతున్నారు.

శ్మశానం దగ్గర ఇల్లు కట్టుకోవచ్చా? - వాస్తు నిపుణులు ఏం చెబుతున్నారంటే? - Vastu Tips For Home

చిన్‌ మీద పుట్టుమచ్చ : గడ్డం మీద పుట్టు మచ్చ ఉన్న వారు సమాజంలో చాలా గౌరవ మర్యాదలను పొందుతారట. అలాగే.. వీరి దగ్గర చాలా డబ్బు ఉంటుందని పండితులు చెబుతున్నారు. జీవితంలో ఎదురయ్యే కష్టాలని ధైర్యంగా ఎదుర్కొని.. కొన్ని రోజుల్లోనే నాయకత్వ బాధ్యతలను నిర్వహిస్తారట.

మెడ మీద పుట్టుమచ్చ : మెడ మీద పుట్టుమచ్చలు ఉన్నవారికి ఆధ్యాత్మిక భావన ఎక్కువగా ఉంటుందిని చెబుతున్నారు. వీరు ఎల్లప్పుడూ భగవంతుడిని ఆరాధిస్తుంటారట. ఇలాంటి వారికి అదృష్టం కలిసి వస్తుందని పండితులు చెబుతున్నారు. వీరు మానసికంగా ఎల్లప్పుడూ ప్రశాంతంగా ఉంటారని అంటున్నారు.

వాస్తు​: ఉదయం నిద్ర లేచిన వెంటనే వీటిని చూస్తున్నారా? - తీవ్ర నష్టాలు తప్పవు! - Do Not See These Things by vastu

వీపు పైన పుట్టుమచ్చ : వీపు మీద పుట్టుమచ్చ ఉన్నవారికి ఆరోగ్యం పట్ల స్పృహ ఎక్కువగా ఉంటుందట. దీంతో వీరు సరైన ఆహారం తీసుకుంటూ ఆరోగ్యంగా ఉంటారట. అలాగే వీరు కుటుంబ బాధ్యతలను స్వీకరించి.. అందరికీ ఆదర్శంగా నిలుస్తారని, సమాజంలో అందరికీ వీరి పట్ల నమ్మకం ఉంటుందని పండితులు చెబుతున్నారు.

Note : పైన తెలిపిన వివరాలు కొందరు వాస్తు నిపుణులు, వాస్తు శాస్త్రంలో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతేకానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకూ విశ్వసించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

వాస్తు : ఇంట్లో ఈ మొక్కలు పెంచుతున్నట్టయితే - కష్టాలను పిలిచినట్టే! - Avoid These Plants As Per Vastu

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.