81.76 Poll Percentage in AP Elections 2024 : సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో రికార్డుస్థాయి పోలింగ్ నమోదైంది. ఈవీఎంల్లో నమోదైన ఓట్లు, పోస్టల్ బ్యాలెట్ ఓట్లు కలిపి 81.76 శాతం మేర పోలింగ్ జరిగింది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని శాసనసభ నియోజకవర్గాల్లో సరాసరిన 80.07 శాతం పోలింగ్ నమోదు కాగా, పోస్టల్ బ్యాలెట్ 1.10 శాతం మేర నమోదైంది. అత్యధికంగా ప్రకాశం జిల్లాలో 87.09, పల్నాడు జిల్లాలో 85.65, బాపట్ల జిల్లాలో 84.98, కృష్ణా జిల్లాలో 84.05శాతం పోలింగ్ జరిగింది. కోనసీమ జిల్లాలో 83.91, అనకాపల్లి జిల్లాలో 83.84, ఏలూరు జిల్లాలో 83.55 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం తెలిపింది.
శ్రీసత్యసాయి జిల్లాలో 82.77, పశ్చిమగోదావరి జిల్లాలో 82.70, చిత్తూరు జిల్లాలో 82.65 శాతం నమోదైనట్లు తెలిపింది. విజయనగరం జిల్లాలో 81.34, తూర్పుగోదావరి జిల్లాలో 80.94, నంద్యాల జిల్లాలో 80.92, కాకినాడ జిల్లాలో 80.31 శాతం పోలింగ్ నమోదైంది. ఎన్టీఆర్ జిల్లాలో 79.68, వైఎస్సార్ 79.40, అనంతపురం జిల్లాలో 79.25, గుంటూరు జిల్లాలో 78.81, నెల్లూరు జిల్లాలో 78.10 శాతం పోలింగ్ జరిగింది.
మూడంచెల భద్రతతో స్ట్రాంగ్‌రూంల్లోకి ఈవీఎంలు - Security At EVMs In Strong Rooms
తిరుపతి జిల్లాలో 77.82, పార్వతీపురం మన్యం జిల్లాలో 77.10, అన్నమయ్య జిల్లాలో 76.23, శ్రీకాకుళం జిల్లాలో 76.07, కర్నూలు జిల్లాలో 75.83, అల్లూరి జిల్లాలో 70.20, అత్యల్పంగా విశాఖ జిల్లాలో 68.63 శాతం పోలింగ్ నమోదైనట్లు ఈసీ వెల్లడించింది.
2019 సార్వత్రిక ఎన్నికలతో పోలిస్తే దాదాపు 1.60 శాతం మేర అదనంగా పోలింగ్ జరిగినట్టు ఎన్నికల సంఘం తెలిపింది. మొత్తం 4.13 కోట్ల మంది ఓటర్లకు గాను 3.35 కోట్ల మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకున్నట్టు స్పష్టవుతోంది. అసెంబ్లీ నియోజకవర్గాల్లో అత్యధికంగా దర్శిలో 90.91 శాతం మేర పోలింగ్ జరగ్గా, కనిష్టంగా తిరుపతిలో 59.95 శాతం నమోదైంది.
ఇప్పటికే ఈవీఎంలను స్ట్రాంగ్‌రూమ్‌లకు తరలించారు. ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా స్ట్రాంగ్ రూమ్‌ల భారీ భద్రత ఏర్పాటు చేశారు. ఈవీఎంలలో నిక్షిప్తమైన అభ్యర్థుల భవితవ్యం జూన్ 4న తెలియనుంది.