ETV Bharat / state

TOP NEWS: ఏపీ ప్రధాన వార్తలు @7PM

author img

By

Published : Nov 19, 2022, 6:58 PM IST

ఏపీ ప్రధాన వార్తలు
7PM TOP NEWS

.

  • టీడీపీ మహిళా నేతల అరెస్టు.. వైసీపీ పాలనకు పరాకాష్ట: లోకేశ్
    టీడీపీ మహిళా నేతలు నిర్మల, సునీతరాణి అరెస్టు.. వైసీపీ పాలనకు పరాకాష్ట అని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ మండిపడ్డారు. సీఎం జగన్, కొడాలి నాని మర్యాదలకు భంగం కలిగిందని కేసు పెట్టడం దారుణమన్నారు. కొడాలి నానికి గౌరవ మర్యాదలు ఎక్కడున్నాయి.. వాటికి భంగం కలగడానికని ఎద్దేవా చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • "నేను సగం మీసం తీయించుకుంటా.. నువ్వు సగం గడ్డం తీయించుకుంటావా"
    ఆరు నెలల్లో తెలుగుదేశం పార్టీని భూస్థాపితం చేస్తామని మంత్రి గుమ్మనూరు జయరాం హెచ్చరించారు. గూండాయిజం అంటే ఏంటో తెలుగుదేశం నేతలకు రుచిచూపిస్తామన్నారు. 2024 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు పోటీచెయ్యలేరన్న ఆయన.. బ్యాలెట్ పేపర్‌లో పేరే ఉండదని వ్యాఖ్యానించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • పేదల ఇళ్లను కూల్చిన అధికారులు..
    కడప నగరంలో మళ్లీ కట్టడాల కూల్చివేత మొదలైంది. ఇప్పటికే ఎంతోమంది ఇళ్లను కోల్పోయి రోడ్డున పడ్డారు. తాజాగా కడపలో రోడ్ల విస్తరణ కార్యక్రమం పేరిట సుమారు 100 ఇళ్లకుపైగా కూల్చివేశారు. కూల్చివేసిన ఇళ్లలోని ప్రజలు మొండి గోడల మధ్య, చెట్ల కింద ఉంటున్నారు. ఏ ఒక్కరిని పలకరించిన కన్నీటి గాథలు వినిపిస్తున్నాయి. ఎన్నో కుటుంబాలు వీధిన పడ్డాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • ఆక్వా రంగాన్ని ఆదుకోవాలని.. సీఎం జగన్​కు లేఖ రాసిన నారా లోకేశ్...
    ఆక్వా రంగాన్ని ఆదుకోవాలని టీడీపీ జాతీయ ప్రధానకార్యదర్శి నారా లోకేశ్ ఏపీ సీఎం జగన్​కు లేఖ రాశారు. ప్రభుత్వం యుద్ధప్రాతిపదికపై స్పందించి ఆక్వా రైతులందరికీ యూనిట్ విద్యుత్తును 1.50 చొప్పున ఇవ్వాలని సుచించారు. నాణ్యమైన రొయ్య పిల్లలను సరఫరా చేయాలని, దాణా రేట్లు తగ్గేలా చర్యలు తీసుకోవాలని కోరారు. పెరిగిన ఉత్పత్తి వ్యయానికి 50 శాతం కలిపి రొయ్యలకి మద్దతు ధర ప్రకటించాలని నారా లోకేశ్ లేఖలో డిమాండ్ చేసారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • ప్రాచీన సంస్కృతి పునరుద్ధరనే లక్ష్యంగా.. కాశీ తమిళ సంగమ కార్యక్రమం
    వారణాసిలో ఏర్పాటు చేసిన కాశీ తమిళ సంగమం అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు ప్రధానమంత్రి నరేంద్రమోదీ. దేశంలో మధ్య ప్రాచీన కాలంలో సాంస్కృతిక కేంద్రాలుగా తమిళనాడు, కాశీలు గుర్తింపుపొందాయని.. ఆనాటి సంబంధాలను పునరుద్ధరించడం కోసం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • భార్యాపిల్లలు నిద్రిస్తున్న ఇంటికి నిప్పు పెట్టిన భర్త.. రైలు ఢీకొని ఇద్దరు లోకో పైలట్లు మృతి!
    తన పిల్లల్ని చూడనివ్వట్లేదని భార్య ఇంటికి నిప్పు పెట్టాడు ఓ భర్త. భార్యాపిల్లలను రక్షించిన స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన కర్ణాటకలోని హసన్​ జిల్లాలో జరిగింది. ఝార్ఖండ్​లోని జరిగిన మరో ఘటనలో రైలు ఢీకొని ఇద్దరు లోకో పైలట్లు మరణించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • పేలిన గ్యాస్ సిలిండర్.. నలుగురు చిన్నారులు సహా 9 మంది మృతి
    రష్యాలో ఓ అపార్టుమెంటులో గ్యాస్ సిలిండర్ పేలి తొమ్మిది మంది మృతి చెందారు. మరణించిన వారిలో నలుగురు చిన్నారులు ఉన్నారు.
    పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • మీ పెట్టుబడులకు నామినీ ఉన్నారా? లేకపోతే ఈ కష్టాలు తప్పవు!
    సంపదను సృష్టించడమే కాదు.. దాన్ని వారసులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా బదిలీ చేయడమూ ఎంతో కీలకం. ఒక వ్యక్తి మరణించినప్పుడు తాను పెట్టిన పెట్టుబడులన్నీ కుటుంబ సభ్యులకు చేరాలంటే ఉన్న మార్గం నామినేషన్‌. ఒకరు లేదా అంతకంటే ఎక్కువ మందిని నామినీలుగా నియమించేందుకు అవకాశం ఉంటుంది. జీవిత బీమా పాలసీలు, బ్యాంకులో ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు, డీమ్యాట్‌లో ఉన్న షేర్లు, మ్యూచువల్‌ ఫండ్లు ఇలా ఒకటేమిటి.. ఆర్థిక పెట్టుబడులన్నింటికీ నామినీ పేరు పేర్కొనడం తప్పనిసరి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • మనికా బాత్రా రికార్డు.. ఆసియా కప్​ టేబుల్‌ టెన్నిస్‌లో కాంస్యం
    భారత టేబుల్ టెన్నిస్ స్టార్ మనిక బాత్రా సరికొత్త చరిత్ర సృష్టించింది. కామన్వెల్త్ గేమ్స్ 2022 టోర్నీలో తీవ్రంగా నిరాశపరిచిన మానికా బత్రా... ఆసియా కప్ టేబుల్ టెన్నిస్ టోర్నీలో కాంస్య పతకం గెలిచింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • ఈ క్యూట్ స్మైల్​ చిన్నారి ఒకప్పుడు స్టార్ హీరోయిన్​.. ఇప్పుడు నిర్మాత
    పై ఫొటోలో ఉన్న చిన్నారి తెలుగు చిత్రసీమలో స్టార్ ఎదిగింది. ఆ తర్వాత ఛాన్సులు తగ్గిపోవడంతో నిర్మాతగా కొత్త అవతారం ఎత్తి చిత్రాలను రూపొందిస్తోంది. ఇటీవలే ఈమె నిర్మించిన ఓ సినిమా ఫ్లాప్​ అయింది. ఆమెను గుర్తుపట్టగలరా? పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.