ETV Bharat / state

ఎన్టీఆర్​ విగ్రహానికి నిప్పు పెట్టడం వైఎస్సార్సీపీ అరాచక పాలనకు పరాకాష్ఠ : నరేంద్ర వర్మరాజు - TDP Leaders Narendra Varmaraj

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 16, 2024, 11:57 AM IST

TDP Leaders Narendra Varmaraj Fire on YSRCP Followers : బాపట్ల జిల్లాలోని పిన్నిబోయినవారిపాలెంలో వైఎస్సార్సీపీ శ్రేణులు నిప్పు పెట్టిన ఎన్టీఆర్​ విగ్రహాన్ని కూటమి నాయకులు వెళ్లి పరిశీలించారు. ఈ దుశ్చర్యకు వారిపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్​ చేస్తున్నారు.

tdp_leader
tdp_leader (ETV Bharat)

ఎన్టీఆర్​ విగ్రహానికి నిప్పు పెట్టడం వైఎస్సార్సీపీ అరాచక పాలనకు పరాకాష్ఠ : వేగేశన నరేంద్ర వర్మరాజు (ETV Bharat)

TDP Leaders Narendra Varmaraju Fire on YSRCP Followers : బాపట్ల జిల్లాలోని పడమర పిన్నిబోయినవారిపాలెంలో మే 14న మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు విగ్రహాన్ని వైఎస్సార్సీపీ అల్లరి మూకలు నిప్పు అంటించిన విషయం అందరికి అందేల్సిందే. ఎన్టీఆర్​ విగ్రహాన్ని టీడీపీ అభ్యర్థి నరేంద్ర వర్మరాజుతో పాటు జనసేన, కూటమి నాయకులు పరిశీలించారు.

జూన్​ 4న వైఎస్సార్సీపీ ఓటమి తప్పదని భావించిన ఆ పార్టీ కార్యకర్తలు ఎన్టీఆర్​ విగ్రహానికి నిప్పు పెట్టారని నరేంద్ర వర్మరాజు ఆరోపించారు. 2 దశాబ్దాల అనంతరం బాపట్లలో టీడీపీ పార్టీ ఘన విజయం సాధించబోతుందని తట్టుకోలేక తెలుగుదేశం కార్యకర్తలపై దాడులు చేస్తున్నారని నరేంద్ర వర్మరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతటితో ఊరుకోకుండా ఎన్టీఆర్​ విగ్రహానికి నిప్పు పెట్టడం వైఎస్సార్సీపీ అరాచక పాలనకు పరాకాష్ఠగా అభివర్ణించారు. వైఎస్సార్సీపీ నేతల దాడుల్లో నర్రా ఏడుకొండలు అనే టీడీపీ కార్యకర్త తీవ్రంగా గాయపడ్డారని పేర్కొన్నారు. ఆయన ప్రస్తుతం గుంటూరు ప్రైవేట్​ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని పేర్కొన్నారు.

బాపట్లలో వైఎస్సార్సీపీ నేతల దుశ్చర్య - ఎన్టీఆర్​ విగ్రహానికి నిప్పు - NTR Statue On Fire

ఒకవైపు టీడీపీ కార్యకర్తలపై దాడులకు పాల్పడుతూ మరో వైపు వారిపై అక్రమ కేసులు బనాయించే విధంగా పన్నాగం చేస్తున్నారని నరేంద్ర వర్మరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్సార్సీపీ నాయకులు తమ కారు తామే తగలబెట్టుకొని టీడీపీ మహిళ కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టుతున్నారని మండిపడ్డారు. ఈ గొడవలు కారణమైన వైఎస్సార్సీపీ జడ్పీటీసీ సుందర్​సింగ్​పై పోలీసుల రౌడీ షీట్​ ఓపెన్​ చెయ్యాలని డిమాండ్​ చేశారు. ఎన్నికలను కేవలం ఒక మంచి నాయకుడిని, సమర్థమైన ప్రభుత్వాన్ని ఎన్నుకునే ప్రజాస్వామ్య బద్ధమైన ప్రక్రియగానే చూడాలి తప్ప ప్రశాంతమైన పల్లెల్లో అశాంతిని నెలకొల్పకూడదని వైఎస్సార్సీపీ శ్రేణులకు వేగేశన నరేంద్ర వర్మ రాజు హితవు పలికారు.

NTR Statue Controversy: ఆత్మకూరులో ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాట్లను.. అడ్డుకున్న పోలీసులు

పిన్నిబోయినవారిపాలెంలో ఎన్టీఆర్​ విగ్రహానికి సంఘటనపై గ్రామానికి చెందిన నర్రా ఆదినారాయణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు అయిదుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. పిన్నిబోయిన అంజనీకుమార్​, కె.శివయ్య, బి. నాగార్జునతో పాటు మరో ఇద్దరిపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Chandrababu Unveiled The NTR Statue In Ballari: తెలుగువారి శక్తిని ప్రపంచానికి చాటి చెప్పింది ఎన్టీఆర్: చంద్రబాబు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.