టీడీపీ మహిళా నేతల అరెస్టు.. వైసీపీ పాలనకు పరాకాష్ట: లోకేశ్​

author img

By

Published : Nov 19, 2022, 5:03 PM IST

Lokesh On TDP Women Leaders Arrest

Lokesh On TDP Women Leaders Arrest : టీడీపీ మహిళా నేతలు నిర్మల, సునీతరాణి అరెస్టు.. వైసీపీ పాలనకు పరాకాష్ట అని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ మండిపడ్డారు. సీఎం జగన్, కొడాలి నాని మర్యాదలకు భంగం కలిగిందని కేసు పెట్టడం దారుణమన్నారు. కొడాలి నానికి గౌరవ మర్యాదలు ఎక్కడున్నాయి.. వాటికి భంగం కలగడానికని ఎద్దేవా చేశారు.

Lokesh On TDP Women Leaders Arrest: వైసీపీ ప్రభుత్వ తీరుపై శాంతియుతంగా నిరసన తెలిపిన టీడీపీ దళిత మహిళా నేతలు అసిలేటి నిర్మల, సునీతరాణిల అరెస్ట్.. జగన్ రెడ్డి ఫ్యాక్షన్ పాలనకి పరాకాష్ట అని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్​ ధ్వజమెత్తారు. సీఎం జగన్ రెడ్డి, మాజీ మంత్రి కొడాలి నాని గౌరవ మర్యాదలకు భంగం వాటిల్లిందని పోలీసులు కేసు నమోదు చేయడం హాస్యాస్పదమని విమర్శించారు.

32 క్రిమినల్ కేసుల్లో నిందితుడు, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన హంతకుడు, సొంత బాబాయ్​ని చంపించిన దుర్మార్గుడు జగన్ రెడ్డి అని మండిపడ్డారు. నోటితో బూతుల వాంతులు చేసుకునే క్యాసినో కేటు కొడాలి నానికి గౌరవ మర్యాదలు ఎక్కడున్నాయని నిలదీశారు. ఇదే చట్టం అందరికీ అమలైతే.. నాటీ సీఎం చంద్రబాబుని నడిరోడ్డుపై నరికేయాలన్న ప్రతిపక్షనేత జగన్​మోహన్ రెడ్డి పై ఎన్ని కేసులు పెట్టాలని ప్రశ్నించారు.

నిత్యం ప్రతిపక్షనేతలు, ప్రజాసంఘాల నేతలను దూషించే కొడాలి నానిని ఎన్నిసార్లు అరెస్టు చేయాలని మండిపడ్డారు. అక్రమంగా అరెస్టు చేసిన టీడీపీ దళిత మహిళా నేతలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అక్రమ కేసులు ఎదుర్కొంటున్న మహిళా నేతలకు తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని స్పష్టం చేశారు.

  • దళితులపై దమనకాండ సాగిస్తూ, ఎస్సీ సంక్షేమ పథకాలు రద్దు చేసిన ప్రభుత్వం తీరుపై శాంతియుతంగా నిరసన తెలిపిన టిడిపి దళిత మహిళా నేతలు అసిలేటి నిర్మల, సునీతరాణిల అరెస్ట్ జగన్ రెడ్డి ఫ్యాక్షన్ పాలనకి పరాకాష్ట.(1/4)#DalitAtrocitiesInAP pic.twitter.com/HAfmYeJBKd

    — Lokesh Nara (@naralokesh) November 19, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.