ETV Bharat / state

AP TOP NEWS: ఏపీ ప్రధాన వార్తలు @ 7PM

author img

By

Published : Nov 27, 2022, 6:59 PM IST

Etv Bharat
Etv Bharat

.

  • దురంతో ఎక్స్​ప్రెస్​లో స్వల్ప మంటలు.. పరుగులు తీసిన ప్రయాణికులు
    బెంగళూరు నుంటి హవ్​డా వెళ్తున్న దురంతో ఎక్స్​ప్రెస్​లో స్వల్ప మంటలు చెలరేగాయి. విషయం తెలుసుకుని ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. కుప్పంలో రైలు నిలిపివేయగానే రైలు దిగి పరుగులు తీశారు. అప్రమత్తమైన సిబ్బంది మంటలు ఆర్పడంతో పెను ప్రమాదం తప్పింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • యూటిఎఫ్ ఆధ్వర్యంలో సీపీఎస్ రద్దుకు సంతకాల సేకరణ
    పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని, సీపీఎస్, జీపీఎస్ విధానాల్ని రద్దు చేయాలంటూ... పట్టభద్రుల ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు డిమాండ్ చేశారు. శ్రీకాకుళంలో యూటిఎఫ్ ఆధ్వర్యంలో.. సీపీఎస్ రద్దు చేయాలని సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. సీఎం జగన్ పాదయాత్రలో ఇచ్చిన హామీని తుంగలో తొక్కారన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • 'ఒప్పంద అధ్యాపకుల్ని క్రమబద్ధీకరించండి.. ఇచ్చిన మాట తప్పకండి'
    ఒప్పంద అధ్యాపకుల ఫెడరేషన్ సభ్యులు.. తమ పట్ల ప్రభుత్వం చూపుతున్న వైఖరిని నిరసిస్తూ విజయవాడలో సమావేశమయ్యారు. ఒప్పంద అధ్యాపకుల్ని క్రమబద్ధీకరణ చేయాలని డిమాండ్‌ చేశారు. వైసీపీ మేనిఫెస్టోలోనూ పెట్టి.. ఇప్పుడు మాట తప్పుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • 16 మంది ఎర్రచందనం స్మగ్లర్లు అరెస్ట్, మూడు వాహనాలు స్వాధీనం
    వైయస్సార్ జిల్లా నుంచి.. అక్రమంగా ఎర్రచందనం రవాణా చేస్తున్న స్మగ్లర్లను.. బ్రహ్మంగారిమఠం పోలీసులు అరెస్టు చేశారు. వీరిలో తమిళనాడుకు చెందిన కొంతమంది స్మగ్లర్లు ఉన్నారని పోలీసులు తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • 'జాతీయాంశంగా 'ఉమ్మడి పౌరస్మృతి'.. త్వరలోనే అన్ని రాష్ట్రాల్లో అమలు'
    ఉమ్మడి పౌరస్మృతి.. జాతీయాంశం అని భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. దీన్ని వీలైనన్ని ఎక్కువ రాష్ట్రాల్లో అమలు చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు ఆయన తెలిపారు. గుజరాత్​ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్​, ఆప్​ బడ్జెట్​తో సంబంధం లేకుండా ఎన్నికల హామీలను ప్రకటిస్తున్నాయని ఆరోపించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • కలియుగ 'విశ్వకర్మ'.. ఉలితో శిలలకు ప్రాణం.. కళాఖండాలకు ప్రపంచమే ఫిదా!
    మధ్యప్రదేశ్​కు చెందిన ఓ కళాకారుడు తన హస్తకళతో అందరి మన్ననలు పొందుతున్నాడు. రాళ్లపై విగ్రహాలు చెక్కుతూ.. దేశ, విదేశాల్లో తన ప్రతిభను చాటుతున్నాడు. వివిధ రకాల బొమ్మలను, ప్రముఖుల విగ్రహాలను చెక్కి విదేశాలకు ఎగుమతి చేస్తున్నాడు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • జిన్​పింగ్​కు బిగ్​ షాక్​ ఇస్తూ కొవిడ్ లాక్​డౌన్​ నిరసనలు తీవ్రం
    జీరో కొవిడ్ పాలసీని వ్యతిరేకిస్తూ చైనాలో ఆందోళనలు పెరుగుతున్నాయి. వైరస్‌ కట్టడికి ఎన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ కమ్యూనిస్టు దేశంలో కేసుల సంఖ్య భారీగా పెరుగుతూనే ఉంది. కేసుల సంఖ్య పెరిగే కొద్దీ ఆంక్షల పరిధిని అధికారులు విస్తరిస్తున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • హెల్త్‌ ఇన్సూరెన్స్‌ ప్రీమియం తగ్గాలా? ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అవ్వండి!
    కొవిడ్‌ తర్వాత అందరికీ ఆరోగ్య బీమా పాలసీపై అవగాహన పెరిగింది. అయితే, ప్రీమియం ఖర్చును చూసి కొందరు వెనకడుగు వేస్తున్నారు. కానీ, కొన్ని మార్గాల ద్వారా ప్రీమియం మొత్తాన్ని తగ్గించుకునే వెసులుబాటు ఉంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • సంజూ శాంసన్​ను జట్టులోకి తీసుకోలేదు.. కారణం ఇదే!
    భారత్​-న్యూజిలాండ్​ మధ్య రెండో వన్డే మ్యాచ్​ వర్షం కారణంగా రద్దు అయింది. ఈ మ్యాచ్​లో సంజూ శాంసన్​, శార్దూల్​ ఠాకూర్​ను తుది జట్టులోకి తీసుకోలేదు. దీంతో టీమ్ ఇండియాపై విమర్శలు వెల్లువెత్తాయి. తాజాగా ఈ విషయంపై తాత్కాలిక కెప్టెన్​ శిఖర్​ ధావన్​ స్పందించాడు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • ఎన్టీఆర్ ​ఒక్కో యాడ్​​కు ఎంత తీసుకుంటారో తెలుసా!
    'ఆర్​ఆర్​ఆర్'​ సినిమాతో దేశవ్యాప్త గుర్తింపు తెచ్చుకున్నారు ఎన్టీఆర్​. ప్రస్తుతం సినిమాలతో పాటు పలు యాడ్స్​లో​ కూడా నటిస్తున్నారు తారక్​. అయితే ఆయన చేస్తున్న యాడ్స్​కు రెమ్యునరేషన్​ ఎంత తీసుకుంటున్నారనే దానిపై ఓ చర్చ నడుస్తోంది. ఇంతకీ ఆయన పారితోషికం ఎంతంటే.. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.