ETV Bharat / sports

ఒలింపిక్ పసిడి పతక విజేత మృతి

author img

By

Published : Jun 28, 2022, 1:02 PM IST

Hockey Player Varinder Singh Died: ధ్యాన్​చంద్​ అవార్డు గ్రహీత, భారత మాజీ హాకీ ప్లేయర్ వరీందర్​ సింగ్​ మృతి చెందారు. ఆయన మరణంపై పలువురు క్రీడాకారులు, ప్రముఖులు సంతాపం వ్యక్తంచేస్తున్నారు.

Olympic hockey player Varinder Singh passes away
Olympic hockey player Varinder Singh passes away

Hockey Player Varinder Singh Died: ఒలింపిక్ పతక విజేత, భారత మాజీ హాకీ ప్లేయర్ వరీందర్ సింగ్(75) తుదిశ్వాస విడిచారు. 1970లలో భారత్​ సాధించిన అనేక చిరస్మరణీయ విజయాలలో ఆయన భాగస్వామ్యం ఉంది. తన స్వగ్రామమైన పంజాబ్​లోని జలంధర్​లో మంగళవారం కన్నుమూశారు వరీందర్. ఆయన అంత్యక్రియలు ఈ సాయంత్రం జలంధర్​లోని శంషాన్​ ఘాట్​లో జరగనున్నాయి.

1947 మే 16న జన్మించిన వరిందర్​ సింగ్.. 1975లో కౌలాలంపుర్‌లో జరిగిన 1975 పురుషుల హాకీ ప్రపంచ కప్‌లో బంగారు పతకం సాధించిన భారత జట్టులో సభ్యుడు. ఆ టోర్నమెంట్​లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్​ను 2-1 తేడాతో ఓడించింది భారత్​. 1972 సమ్మర్ ఒలింపిక్స్​లో కాంస్య పతకాన్ని సాధించారు వరీందర్. 1973లో ఆమ్​స్టర్​డామ్​లో జరిగిన ప్రపంచకప్​లో రజత పతకాన్ని గెలుచుకున్నారు. 2007లో వరిందర్‌కు ధ్యాన్‌చంద్ జీవిత సాఫల్య పురస్కారం లభించింది. సింగ్ మృతి పట్ల హాకీ సహా పలువురు క్రీడాకారులు, ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

ఇవీ చదవండి: మూడున్నర దశాబ్దాల్లో తొలిసారి.. కపిల్​ దేవ్​ తర్వాత బుమ్రానే!

తెలుపు దుస్తులు.. 23 టన్నుల స్ట్రాబెర్రీలు.. వింబుల్డన్​ క్రేజీ విశేషాలివే..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.