ETV Bharat / sports

వందో టెస్టులో వార్నర్​ రికార్డు సెంచరీ.. దిగ్గజాల సరసన చోటు

author img

By

Published : Dec 27, 2022, 10:37 AM IST

Updated : Dec 27, 2022, 2:13 PM IST

దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టులో ఆస్ట్రేలియా ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ సెంచరీతో మెరిశాడు. ఈ శతకంతో పలు రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు.

Australia opener David warner century in 100th test
వందో టెస్టులో వార్నర్​ రికార్డు సెంచరీ.. దిగ్గజాల సరసన చోటు

ఆస్ట్రేలియా స్టార్ డేవిడ్ వార్నర్ తన వందో టెస్టును మధుర జ్ఞాపకంగా మార్చుకున్నాడు. సొంతగడ్డపై దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టులో డబుల్​ సెంచరీతో సత్తా చాటాడు. ఈ మార్క్​తో తనను విమర్శించిన వారికి బ్యాట్​తోనే సమాధానమిచ్చాడు.

దిగ్గజాల సరసచన చోటు.. సౌతాఫిక్రాతో రెండో రోజు ఆటలో భాగంగా స్టార్‌ బౌలర్‌ కగిసో రబడ బౌలింగ్‌లో ఫోర్‌ బాది 100 పరుగుల మార్కు అందుకున్నాడు వార్నర్‌. అలా తన కెరీర్‌లో 26వ టెస్టు సెంచరీ నమోదు చేసిన వార్నర్‌.. దిగ్గజాల సరసన చోటు సంపాదించాడు. టెస్ట్‌ల్లో వార్నర్ ఓపెనర్ బ్యాట్స్‌మెన్‌గా వచ్చి అత్యధిక సెంచరీలు సాధించిన ఐదో ఆటగాడిగా నిలిచాడు. ఓపెనర్ బ్యాట్స్‌మెన్‌గా వచ్చి సునీల్ గవాస్కర్ (33), అలెస్టర్ కుక్(31), మాథ్యూహెడేన్(30), గ్రీమ్ స్మిత్ (27) సెంచరీలు చేయగా డేవిడ్ వార్నర్ 26 సెంచరీలతో జాబితాలో ఐదో స్థానంలో నిలిచాడు.

ఇకపోతే ఈ ఫీట్​తో తమ 100వ టెస్ట్‌లో సెంచరీ చేసిన రెండో ఆస్ట్రేలియా బ్యాటర్​గానూ నిలిచాడు. అంతకుముందు రిక్కీ పాంటింగ్‌ ఈ ఫీట్‌ నమోదు చేశాడు. మొత్తంగా తమ 100వ టెస్టులో శతకం సాధించిన 10వ బ్యాటర్‌గానూ చరిత్రకెక్కాడు. అదే విధంగా టెస్టుల్లో 8 వేల పరుగులు పూర్తి చేసుకున్న ఎనిమిదో ఆసీస్‌ ప్లేయర్‌గా వార్నర్‌ ఘనత వహించాడు. దీంతో పాటు అంతర్జాతీయ క్రికెట్​లో 17వేల పరుగులు పూర్తి చేసుకున్న ఆటగాడిగా నిలిచాడు.

100వ టెస్టులో సెంచరీ సాధించిన బ్యాటర్లు

  • కోలిన్‌ కౌడ్రే- 104- ఇంగ్లాండ్ వర్సెస్‌ ఆస్ట్రేలియా- 1968
  • జావేద్‌ మియాందాద్‌- 145- పాకిస్తాన్‌ వర్సెస్‌ ఇండియా- 1989
  • గోర్డాన్‌ గ్రీనిడ్జ్‌- 149- వెస్టిండీస్‌ వర్సెస్‌ ఇంగ్లండ్‌- 1990
  • అలెక్స్‌ స్టెవార్ట్‌- 105- ఇంగ్లాండ్​ వర్సెస్‌ వెస్టిండీస్‌-2000
  • ఇంజమాముల్‌ హక్‌ - 184- పాకిస్తాన్‌ వర్సెస్‌ ఇండియా- 2005
  • రిక్కీ పాంటింగ్‌- 120 , 143 నాటౌట్‌- ఆస్ట్రేలియా వర్సెస్‌ సౌతాఫ్రికా- 2006
  • గ్రేమ్‌ స్మిత్‌- 131- సౌతాఫ్రికా వర్సెస్‌ ఇం‍గ్లండ్‌- 2012
  • హషీం ఆమ్లా- 134- సౌతాఫ్రికా వర్సెస్‌ శ్రీలంక- 2017
  • జో రూట్‌- 218- ఇంగ్లాండ్​ వర్సెస్‌ ఇండియా- 2021
  • డేవిడ్‌ వార్నర్‌- 100 నాటౌట్‌- ఆస్ట్రేలియా వర్సెస్‌ సౌతాఫ్రికా, 2022

ఇదీ చూడండి: నడిపించింది వాళ్లిద్దరే : సూర్య కుమార్‌ యాదవ్‌

Last Updated :Dec 27, 2022, 2:13 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.