ETV Bharat / sports

'అటువంటి అనవసర విషయాలను ఆలోచించను - అలానే ఉండాలనుకుంటున్నాను'

author img

By ETV Bharat Telugu Team

Published : Jan 16, 2024, 7:24 AM IST

Shreyas Iyer Afghanistan Series : అఫ్గానిస్థాన్​తో జరుగుతున్న టీ20ల్లో భారత జట్టులో తనకు స్థానం దక్కకపోవడం పట్ల టీమ్ఇండియా మిడిలార్డర్​ క్రికెటర్ శ్రేయస్ అయ్యర్ స్పందించాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈ విషయంపై తన అభిప్రాయాన్ని తెలిపాడు.

Shreyas Iyer Afghanistan Series
Shreyas Iyer Afghanistan Series

Shreyas Iyer Afghanistan Series : ప్రస్తుతం అఫ్గ‌ానిస్థాన్​తో జరుగుతున్న టీ20 సిరీస్​లో తనకు స్థానం దక్కకపోవడం పట్ల టీమ్ఇండియా స్టార్ క్రికెటర్ శ్రేయస్ అయ్యర్ తాజాగా స్పందించాడు. త‌న ఆధీనంలోలేని విష‌యాల గురించి అస్సలు ప‌ట్టించుకోన‌ని, త‌న‌కు ఇచ్చిన బాధ్య‌త‌ను స‌క్ర‌మంగా నిర్వ‌ర్తించ‌డంపైనే దృష్టి సారిస్తానంటూ తాజాగా ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు. ప్ర‌స్తుతం త‌ను అదే ప‌నిలో ఉన్నాన‌ంటూ చెప్పుకొచ్చాడు.

ఇటీవలే శ్రేయ‌స్ అయ్య‌ర్‌కు దేశ‌వాళీ క్రికెట్​లో ఆడాల‌ంటూ బీసీసీఐ నుంచి ఆదేశాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఇంగ్లాండ్‌తో జరగనున్న టెస్టు సిరీస్‌న‌కు స‌న్న‌ద్ధం కావాలంటూ మేనేజ్‌మెంట్ అతడికి సూచించింది. దీంతో ఈ టీమ్ఇండియా మిడిలార్డర్ ప్లేయర్ రంజీలో ఆడటం మొదలెట్టాడు. అలా ముంబయి జట్టు త‌ర‌ఫున రంజీ బ‌రిలో దిగాడు. తాజాగా ఆంధ్ర‌తో జ‌రిగిన మ్యాచ్‌లో 48 ప‌రుగుల‌ు స్కోర్ చేశాడు. 145కు పైగా ఓవ‌ర్ల‌ పాటు ఫీల్డింగ్ కూడా చేశాడు. అలా ఈ మ్యాచ్‌లో ఆంధ్ర జ‌ట్టుపై ముంబయి 10 వికెట్ల తేడాతో విజయాన్ని తమ ఖాతాలో వేసుకుంది. దీంతో మ్యాచ్ తర్వాత శ్రేయస్ మీడియాతో మాట్లాడాడు.

"గ‌తం గురించి నేను అస్సలు ఆలోచించ‌ను. వ‌ర్త‌మానంలోనే జీవించాల‌ని అనుకుంటున్నాను. నాకు ఏ ప‌నినైతే అప్ప‌గించారో దాన్ని నేను విజ‌య‌వంతంగా పూర్తి చేశాను. రంజీ ఆడ‌మ‌న్నారు. వ‌చ్చాను, ఆడాను నా ప్లాన్స్​ను సరిగ్గా అమ‌లు చేశాను. నా ఫామ్ ప‌ట్ల సంతోషంగా ఉన్నాను. కొన్ని విష‌యాలు ఎప్పటికీ మ‌న ఆధీనంలో ఉండ‌వు. అలాంటి వాటి గురించి ఆలోచించ‌క‌పోవ‌డ‌మే బెటర్. ఇంగ్లాండ్‌తో జరగనున్న టెస్టు సిరీస్ సంద‌ర్భంగా బాల్ బాగా ట‌ర్న్ అయ్యే వికెట్లు అందుబాటులో ఉండ‌టం స‌హ‌జమే. ఇది నాకు సానుకూలాంశంగా మారనుంది. ఏదేమైనప్పటికీ ఈ రంజీ మ్యాచ్ ద్వారా నాకు కావాల్సినంత ప్రాక్టీస్​ కూడా ల‌భించింది. ఫిట్‌నెస్ సాధించాను. ఇంగ్లాంతో మొద‌టి రెండు టెస్టుల్లో ఎలా ఆడాల‌న్న‌దాని గురించి ఆలోచిస్తున్నాను. నా ధ్యాసంతా ఇప్పుడు ఆ రెండు మ్యాచ్‌ల‌పైనే ఉంది" అంటూ శ్రేయస్​ తన అభిప్రాయాన్ని వెల్లడించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.