ETV Bharat / sports

దంచేసిన దూబే- తొలి టీ20లో భారత్ గ్రాండ్ విక్టరీ

author img

By ETV Bharat Telugu Team

Published : Jan 11, 2024, 10:27 PM IST

Updated : Jan 11, 2024, 10:49 PM IST

Ind vs Afg 1st T20: భారత్- అఫ్గానిస్థాన్ టీ20 సిరీస్​ తొలి మ్యాచ్​లో టీమ్ఇండియా 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఇరు జట్ల మధ్య రెండో మ్యాచ్ జనవరి 14న జరగనుంది.

ind vs afg 1st t20
ind vs afg 1st t20

Ind vs Afg 1st T20: మూడు టీ20ల సిరీస్​ తొలి మ్యాచ్​లో అఫ్గానిస్థాన్​పై టీమ్ఇండియా 6 వికెట్ల తేడాతో నెగ్గింది. అఫ్గానిస్థాన్ నిర్దేశించిన 159 పరుగుల లక్ష్యాన్ని భారత్ 17.3 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. శివమ్ దూబే (60 పరుగులు, 40 బంతుల్లో: 5x4, 2x6) హాఫ్ సెంచరీతో అదరగొట్టాగా, జితేశ్ శర్మ (31 పరుగులు, 20 బంతుల్లో: 5x4) రాణించాడు. అఫ్గాన్ బౌలర్లలో ముజీబ్ రెహ్మాన్ 2, అజ్మతుల్లా ఒమర్జాయ్ 1 వికెట్ దక్కించుకున్నాడు. ఆల్​రౌండ్​ ప్రదర్శనతో అదరగొట్టిన దూబేకు 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు లభించింది. ఈ విజయంతో టీమ్ఇండియా 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఇరు జట్ల మధ్య రెండో మ్యాచ్ జనవరి 14న జరగనుంది.

స్పల్ప లక్ష్య ఛేదనలో తొలి ఓవర్లోనే భారత్​కు ఎదురుదెబ్బ తగిలింది. ఇన్నింగ్స్ రెండో బంతికే కెప్టెన్ రోహిత్ శర్మ రనౌటయ్యాడు. నాన్​ స్ట్రైక్​ ఎండ్​లో ఉన్న శుభ్​మన్ గిల్​తో సమన్వయం కోల్పోయిన రోహిత్ (0) డకౌట్​గా పెవిలియన్ చేరాడు. వన్​డౌన్​లో వచ్చిన తిలక్ వర్మ (26 పరుగులు)తో కలిసి గిల్ (23 పరుగులు) కాసేపు స్కోర్​ బోర్డును పరుగులు పెట్టించాడు. కానీ, ముజీబ్​ వేసిన బంతికి స్టంపౌటయ్యాడు గిల్. అప్పుడు క్రీజులోకి వచ్చిన దూబే బౌండరీలతో చెలరేగిపోయాడు. తిలక్ ఔటైనా జితేశ్​తో కలిసి దూబే ఎటాకింగ్ కొనసాగించాడు. ముజీబ్​ బౌలింగ్​లో, జితేశ్ ఇబ్రహీమ్​కు దొరికిపోయాడు. ఆఖర్లో క్రీజులోకి వచ్చిన రింకూ సింగ్​ (16* పరుగులు)తో కలిసి దూబే పని పూర్తి చేశాడు.

అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్​కు దిగిన ఆఫ్గాన్​ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. ఓపెనర్లు రహ్మానుల్లా గుర్బాజ్ (23 పరుగులు), ఇబ్రహీమ్ జోర్డాన్ (25 పరుగులు),అజ్మతుల్లా (29 పరుగులు) ఫర్వాలేదనిపించారు. ఇక చివర్లో మహ్మద్ నబీ (42 పరుగులు) రాణించడం వల్ల అఫ్గాన్ గౌరవప్రదమైన స్కోర్ చేయగలిగింది. టీమ్ఇండియా బౌలర్లలో ముకేశ్ కుమార్ 2, అక్షర్ పటేల్ 2, శివమ్ దూబేకు 1 వికెట్ దక్కింది.

మొహాలీలో తొలి టీ20 మ్యాచ్‌ - పిచ్ రిపోర్టు ఎలా ఉందంటే?

భారత్​ x అఫ్గనిస్థాన్ - తొలి మ్యాచ్​కు విరాట్ దూరం - రోహిత్​కు జోడీ ఎవరంటే ?

Last Updated :Jan 11, 2024, 10:49 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.