ETV Bharat / sports

మొహాలీలో తొలి టీ20 మ్యాచ్‌ - పిచ్ రిపోర్టు ఎలా ఉందంటే?

author img

By ETV Bharat Telugu Team

Published : Jan 11, 2024, 1:38 PM IST

Ind Vs Afg Mohali Stadium Pitch Report : భారత్​ - అఫ్గానిస్థాన్​ పోరుకు ఇంకొద్ది గంటలే మిగిలి ఉంది. ఇప్పటికే స్టేడియం చేరుకున్న ప్లేయర్లు ప్రాక్టీస్​ చేస్తూ ప్రత్యర్థులను చిత్తు చేసే ప్లాన్స్​ వేస్తున్నారు. ఈ నేపథ్యంలో తొలి టీ20 మ్యాచ్​ వేదికైన పంజాబ్​లోని మొహాలీ ఐఎస్ బింద్రా స్టేడియం పిచ్​ గురించి ఓ సారి తెలుసుకుందాం.

Ind Vs Afg Mohali Stadium Pitch Report
Ind Vs Afg Mohali Stadium Pitch Report

Ind Vs Afg Mohali Stadium Pitch Report : భారత్​, అఫ్గానిస్థాన్​ మధ్య టీ20 పోరు ప్రారంభం కానుంది. ఇందులో భాగంగా జరగనున్న మొదటి మ్యాచ్​కు పంజాబ్​లోని మొహాలీకి చెందిన ఐఎస్ బింద్రా స్టేడియం వేదిక కానుంది. గురువారం సాయంత్రం 7 గంటలకు ప్రారంభం కానున్న ఈ మ్యాచ్​కు అంతా సిద్ధమైంది. ఈ నేపథ్యంలో పిచ్ ఎలా ఉందంటే ?

మొహాలీ స్టేడియం సాధారణంగా బ్యాటింగ్ పిచ్​గా పేరొందింది. ఇక్కడ గతంలో భారీ స్కోర్లు కూడా నమోదయ్యాయి. దీంతో రానున్న మ్యాచుల్లోనూ భారీ స్కోర్లు నమోదయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మ్యాచ్ ఆరంభంలో పేసర్లకు, ఆట సాగుతున్న కొద్దీ స్పిన్నర్లకు ఈ పిచ్ అనుకూలించే అవకాశాలు మెరుగ్గా కనిపిస్తున్నాయి.అయితే ఇప్పుడు నార్త్​లో మంచు ఎక్కువగా కురుస్తున్నందున రెండో ఇన్నింగ్స్‌కు మంచు కురిసే ఛాన్స్ ఉంది. ఆ సమయంలో ఛేజింగ్ చేసిన జట్టు గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. గతంలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది.

ఇక మొహాలీలో ఇప్పటివరకు 6 అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లు జరిగింది. అందులో నాలుగు సార్లు ఛేజ్ చేసిన జట్లే గెలిచాయి. అంతే కాకుండా రెండుసార్లు 200కుపైగా లక్ష్యాలను కూడా చేధించారు. ప్రస్తుతం టీ20 క్రికెట్‌లో మరింత వేగం పెరిగిన క్రమంలో తొలుత బ్యాటింగ్ చేసిన జట్టు ఈ మ్యాచ్​లో గెలిచే అవకాశాలు తక్కువనే చెప్పుకోవాలి. దీంతో టాస్ గెలిచిన జట్టు ముందుగా బౌలింగ్ ఎంచుకునే అవకాశాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. అయితే మొదట బ్యాటింగ్ చేసిన జట్టు 200 నుంచి 220 మధ్య స్కోర్ సాధిస్తే ఎంతటి బ్యాటింగ్ పిచ్ అయినా కూడా లక్ష్యాన్ని చేధించడానికి కష్టమయ్యే అవకాశాలున్నాయి. దీంతో టీమ్ఇండియాకు మొదట బ్యాటింగ్ వస్తే వాళ్లు 200కు పైగా పరుగులు చేయడం మంచిదని విశ్లేషకుల అభిప్రాయం.

ప్రస్తుతం మొహాలీలో చలి ఎక్కువగా ఉండడం వల్ల ఈ రెండు టీమ్స్​కు క్లైమేట్​ నుంచి సవాల్ తప్పదు. మొహాలీలో ఇప్పటి వరకు టీమ్​ఇండియా నాలుగు టీ20 మ్యాచ్‌లు ఆడింది. అందులో మూడు గెలవగా, ఒకటి మాత్రం ఓటమిపాలైంది. 2022లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో భారత జట్టుకు ఆ ఓటమి ఎదురైంది.

ఏది ఏమైనప్పటికీ బ్యాటింగ్ పిచ్ కావడం వల్ల ఇక్కడ భారీ స్కోర్లు నమోదయ్యే అవకాశాలున్నాయి. ఇక మ్యాచ్‌కు వర్షం నుంచి ఎటువంటి అంతరాయం లేదు. అయితే పొట్టి ఫార్మాట్‌లో ఇప్పటివరకు ఒకసారి కూడా అఫ్గానిస్థాన్ చేతిలో టీమ్ఇండియా ఓటమిని చవి చూడలేదు. ఆడిన ఐదింటిలో నాలుగు గెలవగా ఒక మ్యాచ్‌లో మాత్రం ఫలితం తేలలేదు.

కేఎల్ రాహుల్​ టీ20 భవిష్యత్తు ఏంటో? - రెస్ట్​ ఇచ్చారా? పక్కన పెట్టేశారా?

భారత్​ x అఫ్గనిస్థాన్ - తొలి మ్యాచ్​కు విరాట్ దూరం - రోహిత్​కు జోడీ ఎవరంటే ?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.