ETV Bharat / sports

చాహల్​ అందుకే నవ్వుతూ ఉంటాడు.. నేనతడి ఫస్ట్​ లవ్​ కాదు: ధనశ్రీ

author img

By

Published : Jun 7, 2022, 7:23 PM IST

Yuzvendra Chahal Dhanashree Verma: మైదానంలో అయినా డ్రెస్సింగ్​ రూమ్​లో అయినా ఎప్పుడూ సరదాగా నవ్వుతూ, అందరినీ నవ్విస్తూ ఉంటాడు టీమ్​ఇండియా స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్​. ఆ నవ్వు వెనకాల సీక్రెట్ చెప్పేసింది అతడి భార్య ధనశ్రీ. దాంతో పాటే చాహల్​ ఫస్ట్​ లవ్​ గురించీ ఆసక్తికర విషయాలు వెల్లడించింది.

Yuzvendra Chahal Dhanashree Verma
Yuzvendra Chahal Dhanashree Verma

చాహల్​ అందుకే నవ్వుతూ ఉంటాడు.. నేనతడి ఫస్ట్​ లవ్​ కాదు: ధనశ్రీ

Yuzvendra Chahal Dhanashree Verma: ఇటీవలే ముగిసిన ఐపీఎల్​ 15వ సీజన్​లో అదరగొట్టాడు టీమ్​ఇండియా స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్. రాజస్థాన్​ రాయల్స్​ తరఫున ఆడిన అతడు.. అత్యధిక వికెట్లు పడగొట్టి పర్పుల్​ క్యాప్​ను కూడా అందుకున్నాడు. అయితే చాహల్​.. ఏడాదిన్నర క్రితం తన ప్రేయసి ధనశ్రీ వర్మను వివాహం చేసుకున్నాడు. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట.. సామాజిక మాధ్యమాల్లో రీల్స్​తో చేసే సందడి అంతా ఇంతా కాదు. ఎప్పుడూ అందరినీ నవ్విస్తూ నవ్వుతూ సంతోషంగా ఉంటారు. తాజాగా ధనశ్రీ రాజస్థాన్​ రాయల్స్​ పాడ్​కాస్ట్​లో.. చాహల్​ గురించి కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించింది.

Yuzvendra Chahal Dhanashree Verma
యుజ్వేంద్ర చాహల్​, ధనశ్రీ

"యుజీ ఎప్పుడూ సంతోషంగా ఉంటాడు. నిజం చెప్పాలంటే అతడికి క్రికెట్ అంటే చాలా ఇష్టం. క్రికెట్​ను పిచ్చిపిచ్చిగా ప్రేమిస్తాడు. అతడి ఫస్ట్ లవ్ కూడా అదే. అందుకే అతడు ఎప్పుడూ అందంగా నవ్వుతూ ఉంటాడు. చాహల్ ఎక్కడుంటే అక్కడ నవ్వులే. తన తోటి వాళ్లతో కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంటాడు. సాధారణంగా డ్రెస్సింగ్ రూమ్​లో వాతావరణం కొంచెం ఒత్తిడికి గురిచేస్తుంది. ఆ సమయంలోనూ యుజీ తన ముఖంపై చిరునవ్వు చెదరనివ్వడు." అని చాహల్​ భార్య ధనశ్రీ తెలిపింది.

Yuzvendra Chahal Dhanashree Verma
యుజ్వేంద్ర చాహల్​, ధనశ్రీ

అయితే తాను మాత్రం అందుకు విరుద్ధంగా ఉంటానని.. భావోద్వేగాలను అదుపు చేసుకోలేనని తెలిపింది ధనశ్రీ. అందుకే మ్యాచులు చూసేటప్పుడు బిగ్గరగా అరవడం.. ఓవర్​గా ఎక్స్​ప్రెస్​ అవ్వడం వంటివి చేస్తుంటానని వెల్లడించింది. ఐపీఎల్ 2022 సీజన్​లో రాజస్థాన్​ రాయల్స్ తరఫున ఆడిన చాహల్.. 17 మ్యాచుల్లో 27 వికెట్లు తీశాడు. కోల్​కతా జట్టుతో జరిగిన మ్యాచ్​లో హ్యాట్రిక్​తో పాటు ఐదు వికెట్ల ప్రదర్శనతో అదరగొట్టాడు.

ఇవీ చదవండి: చరిత్ర సృష్టించిన సర్ఫరాజ్‌.. బ్రాడ్​మన్​ తర్వాత అతడే.. భారత్​లో టాప్!

భారత అథ్లెట్​ అద్భుతం.. ఎనిమిదోసారి జాతీయ రికార్డు బద్దలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.