ETV Bharat / sports

భారత అథ్లెట్​ అద్భుతం.. ఎనిమిదోసారి జాతీయ రికార్డు బద్దలు

author img

By

Published : Jun 7, 2022, 9:18 AM IST

భారత అథ్లెట్​ అవినాశ్​ సబ్లే.. ప్రతిష్టాత్మకమైన డైమండ్​ లీగ్​లో మంచి ప్రదర్శన చేశాడు. 3వేల మీటర్ల స్టీప్లేచేస్​లో 8నిమిషాల 12.48సెకన్లలో గమ్యం చేరాడు. ఇది భారత్​ తరఫున కొత్త జాతీయ రికార్డు.

Diamond League Avinash Sable set the record
డైమండ్​ లీగ్​ అవినాశ్​ స

వరుసగా జాతీయ రికార్డులతో అదరగొడుతున్న భారత అథ్లెట్​ అవినాశ్​ సబ్లే మరో అరుదైన ఘనత సాధించాడు. ప్రతిష్టాత్మకమైన డైమండ్​ లీగ్​లో ఐదో స్థానంలో నిలిచాడు. 3వేల మీటర్ల స్టీప్లేచేస్​లో 8నిమిషాల 12.48సెకన్లలో గమ్యం చేరాడు. ఇది భారత్​ తరఫున కొత్త జాతీయ రికార్డు.

గత మార్చిలో తానే నమోదు చేసిన 8నిమిషాల 16.21సెకన్ల టైమింగ్​ను దాదాపు మూడు సెకన్లతో తేడాతో అధిగమించాడు. మొత్తంగా ఇప్పటివరకు 8 సార్లు తన జాతీయ రికార్డును తానే బద్దలుకొట్టడం విశేషం. కాగా, ఈ రేసులో టోక్యో ఒలింపిక్​ ఛాంపియన్​ సౌఫి(soufiane EI Bakkali) 7నిమిషాల 58సెకన్లలో గమ్యాన్ని పూర్తి విజేతగా నిలిచాడు.

ఇదీ చూడండి: ఆయనే నా స్ఫూర్తి.. అందుకే వికెట్​కీపర్​ అయ్యా: పంత్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.