ETV Bharat / sports

వెస్టిండీస్ స్టార్ క్రికెటర్ శామ్యూల్స్ రిటైర్మెంట్

author img

By

Published : Nov 4, 2020, 2:16 PM IST

Updated : Nov 4, 2020, 2:22 PM IST

కరీబియన్ క్రికెటర్ శామ్యూల్స్.. కెరీర్​కు రిటైర్మెంట్ ప్రకటించాడు. అన్ని ఫార్మాట్లలో కలిపి 11 వేల పైచిలుకు పరుగులు చేసి, గుర్తింపు తెచ్చుకున్నాడు.

Former West Indies batsman Marlon Samuels has retired from professional cricket
ప్రొఫెషనల్​ క్రికెట్​కు వీడ్కోలు పలికిన శామ్యూల్స్​

వెస్టిండీస్​ క్రికెటర్ మార్లోన్​ శామ్యూల్స్ అంతర్జాతీయ కెరీర్​కు వీడ్కోలు పలికాడు. ఆ దేశ క్రికెట్ బోర్డు డైరెక్టర్​​ జానీ గ్రేవ్​ ఈ విషయాన్ని ధ్రువీకరించారు. జూన్​లోనే శామ్యూల్స్​ తన నిర్ణయాన్ని బోర్డుకు తెలిపాడని చెప్పారు. 2018 డిసెంబర్​లో శామ్యూల్స్ చివరిసారిగా విండీస్ తరఫున ఆడాడు.

వెస్టిండీస్​ దిగ్గజ ఆటగాళ్లలో శామ్యూల్స్​ ఒకడు. ఆ దేశం తరఫున రెండు టీ20 వరల్డ్​ కప్​లను సాధించడంలో ప్రధాన పాత్ర పోషించాడు. 2012లో శ్రీలంకతో జరిగిన ఫైనల్స్​లో 56 బంతుల్లో 78 పరుగులు చేశాడు. నాలుగేళ్ల తర్వాత కోల్​కతా ఈడెన్​ గార్డెన్​ వేదికగా జరిగిన మ్యాచ్​లోనూ 85 పరుగులు చేసి నాటాట్​గా నిలిచాడు. ఆరోజు నాలుగు వికెట్ల తేడాతో ఇంగ్లాండ్​పై వెస్టిండీస్​ విజయం సాధించింది.

ఇప్పటివరకు 71 టెస్టులు, 207 వన్డేలు, 67 టీ20ల్లో పాల్గొన్నాడు శామ్యూల్స్. కెరీర్​లో మొత్తంగా 11,000 పరుగులు చేశాడు. 150కి పైగా వికెట్లు తీశాడు. ఐపీఎల్​లో పుణె వారియర్స్​, దిల్లీ డేర్​డెవిల్స్​ జట్లకు ప్రాతినిధ్యం వహించారు.

ఇదీ చూడండి:'ఓ ఘట్టం ముగిసింది.. ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు'

Last Updated :Nov 4, 2020, 2:22 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.