ETV Bharat / international

ప్రజల ముందుకు కిమ్​... ఊహాగానాలకు తెర

author img

By

Published : May 2, 2020, 6:46 AM IST

Updated : May 2, 2020, 9:22 AM IST

ఉత్తరకొరియా అధినేత కింగ్‌ జోంగ్‌ ఉన్‌ ఆరోగ్యంపై ఊహాగానాలు వెలువడుతున్న వేళ ఆయన ప్రత్యక్షమయ్యారు. దాదాపు 3 వారాల తర్వాత కిమ్​పై​ ఆ దేశ మీడియా తొలిసారి స్పందించింది. ఓ ఎరువుల కర్మాగారం ప్రారంభ కార్యక్రమానికి ఆయన హాజరైనట్లు దేశ అధికారిక న్యూస్‌ ఏజెన్సీ కొరియన్‌ సెంట్రల్‌ వెల్లడించింది.

North Korea releases pictures of Kim appearance
ప్రజల ముందుకు కిమ్​... ఊహాగానాలకు తెర!

ఊహాగానాలకు తెరదించుతూ ఉత్తరకొరియా అధినేత ప్రజల ముందుకు వచ్చారు. ఈ మేరకు దేశ అధికారిక మీడియా కేసీఎన్​ఏ వెల్లడించింది. ఓ ఎరువుల కంపెనీ నిర్మాణం పూర్తయిన సందర్భంగా జరిగిన కార్యక్రమానికి కిమ్​ హాజరైనట్లు తెలిపింది. స్థానిక రోడోంగ్​ సిన్మన్​ వార్తాపత్రిక కూడా సంబంధిత ఫొటోలనూ విడుదల చేసింది. ఈ వేడుకకు కిమ్​ సోదరి.. యో జోంగ్​ కూడా హాజరైనట్లు సమాచారం.

North Korea releases pictures of Kim appearance
.
North Korea releases pictures of Kim appearance
కార్యక్రమంలో పాల్గొన్న కిమ్​

దేశాధినేత కనిపించగానే ఒక్కసారిగా అక్కడివారంతా ఆశ్చర్యానికి గురయ్యారని, హుర్రే అంటూ నినదించారని న్యూస్​ ఏజెన్సీ వెల్లడించింది.

North Korea releases pictures of Kim appearance
.

ఇదీ చూడండి: కొరియా నేతలకు 'అదృశ్యం' కొత్తేం కాదు!

అప్పటినుంచి వదంతులు...

ఏప్రిల్‌ 11 నుంచి బహిరంగంగా కనిపించక పోయేసరికి కిమ్​ ఆరోగ్యంపై రకరకాల అనుమానాలు రేకెత్తాయి. కోమాలోకి వెళ్లిపోయినందువల్లే ఏప్రిల్‌ 15న కిమ్‌ తన తాత 108 జయంతి కార్యక్రమానికి హాజరు కాలేకపోయారంటూ వార్తలు గుప్పుమన్నాయి. అయితే ఈ అపోహలన్నింటికీ తెరదించుతూ కిమ్​ ప్రజల ముందుకు వచ్చినట్లు కేసీఎన్​ఏ పేర్కొంది.

North Korea releases pictures of Kim appearance
.

కిమ్‌ ఆరోగ్యంపై కొద్దికాలంగా భిన్న వార్తలు వచ్చిన నేపథ్యంలో చైనా ఇప్పటికే ఓ వైద్య బృందాన్ని ఉత్తర కొరియాకు పంపింది. మరోవైపు తాజా పరిస్థితులను అమెరికా నిశితంగా పరిశీలిస్తోందని ఆ దేశ అధికారులు తెలిపారు. కిమ్‌ మరణించినట్లు స్పష్టమైన నిఘా సమాచారమేదీ తమకు లేదని వారు వివరించారు. కిమ్‌ గురించి తనకు తెలుసునని, కానీ చెప్పనని ట్రంప్​ చెబుతూ వస్తున్నారు.

Last Updated :May 2, 2020, 9:22 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.