ETV Bharat / international

'కిమ్​ ఎలా ఉన్నారో నాకు తెలుసు- కానీ చెప్పను'

author img

By

Published : Apr 28, 2020, 11:20 AM IST

ఉత్తర కొరియా అధినేత కిమ్​ జోంగ్ ఉన్​ ఆరోగ్యంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొన్న వేళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. కిమ్​ ఆరోగ్య స్థితిపై తనకు సమాచారం ఉందని తెలిపారు. కరోనా విషయంలో చైనాపై దర్యాప్తు చేస్తున్నామని.. భారీ పరిహారం డిమాండ్ చేస్తామన్నారు.

TRUMP-KIM JONG
డొనాల్డ్ ట్రంప్

ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్​ ఉన్​ ఆరోగ్య స్థితి ఎలా ఉందన్న విషయం తనకు తెలుసని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఆ విషయాన్ని వెల్లడించలేనని తెలిపారు.

"నేను కచ్చితంగా చెప్పలేను. కానీ.. ఆయన ఆరోగ్యం స్థితిపై నాకు సమాచారం ఉంది. కానీ ఇప్పుడు దాని గురించి మాట్లాడలేను. ఆయన బాగుండాలని కోరుకుంటున్నా. నాకు తెలిసి కిమ్​ బాగానే ఉన్నారు.కిమ్​తో మంచి సంబంధాలు ఉన్నాయి.

నేను అమెరికా అధ్యక్షుడిని కాకపోయి ఉంటే.. ఉత్తర కొరియాతో యుద్ధం జరిగి ఉండేది. "

- డొనాల్డ్ ట్రంప్, అమెరికా అధ్యక్షుడు

చైనాపై దర్యాప్తు..

కరోనా వైరస్‌ విషయంలో చైనాపై అమెరికా తీవ్ర స్థాయిలో దర్యాప్తు చేస్తోందని ట్రంప్‌ అన్నారు. కేసులను దాచిపెట్టి ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు నష్టం చేసిందన్న ఆరోపణలతో చైనాను జర్మనీ అడిగిన 130 బిలియన్ల యూరోల కంటే ఎక్కువ పరిహారాన్ని అమెరికా అడగునుందని సంకేతాలిచ్చారు.

వైరస్‌ వెలుగు చూసిన వెంటనే పారదర్శకతతో వ్యవహరించి సమాచారాన్ని పంచుకొని ఉంటే, ప్రపంచవ్యాప్తంగా లక్షల మరణాలు సహా ఆర్థిక వ్యవస్థల విధ్వంసం ఆగి ఉండేదని పలు దేశాలు అభిప్రాయపడుతున్నాయి.

ఈ నేపథ్యంలో వివిధ దేశాలు చైనాను పరిహారం అడగాలని భావిస్తున్నాయి.ఈ విషయంపై స్పందిస్తూ.. ఎంత మొత్తం అడగాలన్నది ఇంకా నిర్ణయించుకోలేదన్నారు ట్రంప్‌. గణనీయ పరిహారమే అడుగుతామని తెలిపారు.

ఇదీ చూడండి: 'అక్టోబర్​ నుంచి అమెరికా ప్రగతి రథం పరుగులు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.