ETV Bharat / entertainment

రవితేజ కొడుకు టాలీవుడ్ ఎంట్రీ.. ఎప్పుడో తెలుసా?

author img

By

Published : Apr 1, 2023, 7:02 AM IST

టాలీవుడ్​ మాస్​ మహారాజా రవితేజ.. తన కుమారుడి టాలీవుడ్​ ఎంట్రీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏమన్నారంటే?

raviteja son tollywood entry
raviteja son tollywood entry

మాస్ మహారాజా రవితేజ ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండానే స్టార్ హీరోగా ఎదిగారు. గతేడాది చివర్లో విడుదలైన ధమాకా చిత్రంతో సూపర్​ హిట్​ అందుకున్నారు. ఆయన నటిస్తున్న తాజా చిత్రం రావణాసుర. మరికొద్ది రోజుల్లో ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది. దీంతో మూవీ టీమ్​ అంతా ప్రమోషన్లలో బిజీగా ఉంది. ఈ సందర్భంగా హీరో రవితేజ.. డైరెక్టర్​ హరీశ్​ శంకర్​తో కలిసి ఓ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ సమయంలో తన కుమారుడు మహాధన్​ టాలీవుడ్​ ఎంట్రీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అయితే మహాధన్​.. రాజా ది గ్రేట్ సినిమాలో చిన్నప్పుడు రవితేజగా నటించిన విషయం తెలిసిందే.

"ఈ విషయం నాకు తెలియదు.. అసలు ఇప్పటివరకు అలాంటి ఐడియా కూడా రాలేదు. ఆ విషయంలో నాకేలాంటి సంబంధం లేదు. ప్రస్తుతం వాడు ఎంజాయ్ చేస్తున్నాడు. వాడికి ఇంట్రెస్ట్ ఉంది.. కానీ ఎప్పుడు వస్తాడో తెలియదు. ఒకవేళ వస్తానంటే వెళ్లు అని చెప్తా. ఒక్క సలహా కూడా ఇవ్వను. వాడికి ఇవ్వాల్సిన సలహాలు ఇచ్చేశాను. కెరీర్ పట్ల ఫుల్ క్లారిటీతో ఉన్నాడు. వాడి గురించి నేను చెప్పడం కాదు. తెలుసుకోవాలి" అని రవితేజ చెప్పారు. దీంతో త్వరలోనే మహాధన్ టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ విషయం తెలుసుకున్న రవితేజ ఫ్యాన్స్​ తెగ ఖుషీ అవుతున్నారు.

రవితేజ హీరోగా తెరకెక్కిస్తున్న రావణాసుర చిత్రానికి సుధీర్ వర్మ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో రవితేజ సరసన అను ఇమ్మాన్యుయేల్, మేఘా ఆకాశ్​, ఫరియా అబ్దుల్లా నటిస్తుండగా.. హీరో సుశాంత్ కీలక పాత్రలో కనిపిస్తున్నారు. ఈ సినిమా ఏప్రిల్ 7న థియేటర్లలో సందడి చేయనుంది. రవితేజ ప్రస్తుతం.. టైగర్​ నాగేశ్వరరావు అనే మరో సినిమాలోనూ నటిస్తున్నారు.

తాజాగా రవితేజ కుటుంబం నుంచి మరో వారసుడు సినీరంగ ప్రవేశం చేశాడు. మాస్‌ మహారాజ రవితేజ తమ్ముడు రఘు కుమారుడు మాధవ్‌ హీరోగా టాలీవుడ్‌కు డెబ్యూ ఇవ్వనున్నారు. జేజేఆర్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రాణి సమర్పణలో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. 'పెళ్లి సందడి' డైరెక్టర్‌ గౌరీ రోణంకి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. రామానాయుడు స్టూడియోస్‌లో ప్రారంభమైన ఈ సినిమా పూజా కార్యక్రమంలో కే రాఘవేంద్రరావు, సురేశ్​ బాబు, నిర్మాత బెక్కెం వేణుగోపాల్, దర్శక నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు, నటుడు రఘు తదితరులు హాజరయ్యారు. అనూప్ రూబెన్స్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.