ETV Bharat / entertainment

బాలయ్య షోకు గెస్ట్​లుగా చంద్రబాబు, లోకేశ్​! 'అన్​స్టాపబుల్'​ సర్​ప్రైజ్​!!

author img

By

Published : Oct 4, 2022, 1:26 PM IST

Updated : Oct 4, 2022, 1:53 PM IST

'అన్​స్టాపబుల్'​తో ఓటీటీ షోస్​లో చెరగని ముద్ర వేశారు నందమూరి బాలకృష్ణ. ఎంతో మంది సీనియర్లు, కుర్ర నటులతో కలిసి ప్రేక్షకులకు వినోదాల విందు వడ్డించారు. అలాంటి ఓ సూపర్ ఎంటర్​టైనింగ్​ షోకు ఒక సీరియస్ రాజకీయ నాయకుడు అతిథిగా వెళ్తే? ఆ గెస్ట్.. బాలయ్యకు బావ అయితే! ఇప్పుడు అదే నిజమయ్యేలా కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్​ మాజీ సీఎం, తెలుగుదేశం అధినేత చంద్రబాబుతో అన్​స్టాపబుల్​ సీజన్​-2 ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది.

unstoppable season 2
బాలయ్య షోకు గెస్ట్​గా చంద్రబాబు! 'అన్​స్టాపబుల్'​ సర్​ప్రైజ్​!!

నటరత్న నందమూరి బాలకృష్ణ హోస్ట్​గా చేస్తున్న అన్​స్టాపబుల్ టాక్​ షో సీజన్​-2తో మరోమారు ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది. భారీ స్థాయిలో ప్రోమో షూట్, అందుకు తగిన రేంజ్​లోనే విజయవాడలో రిలీజ్​తో అంతకంతకూ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతోంది. రెండో సీజన్​లో గెస్ట్​లుగా ఎవరు వస్తారు? తొలి ఎపిసోడ్​ అతిథి ఎవరు? అనే విషయాలపై సీజన్​-1 ముగిసినప్పటి నుంచే చర్చ సాగుతోంది. ఇలాంటి సమయంలో ఓ ఫొటో.. నెట్టింట చర్చనీయాంశమైంది.

ఆహా ఓటీటీలో ప్రసారమయ్యే అన్​స్టాపబుల్​ సెట్​ దగ్గర.. ఆంధ్రప్రదేశ్​ మాజీ సీఎం, తెలుగుదేశం అధినేత చంద్రబాబుతో బాలయ్య ఉన్న ఫొటో బయటకు వచ్చింది. దీంతో.. అన్​స్టాపబుల్ రెండో సీజన్​ చంద్రబాబు ఎపిసోడ్​తోనే ప్రారంభం కావచ్చని టాక్ వినిపిస్తోంది. అయితే ఎపిసోడ్​ చివర్లో బాలకృష్ణ పెద్ద అల్లుడు, చంద్రబాబు కుమారుడు నారా లోకేశ్​ కూడా జాయిన్​ అవ్వనున్నారని తెలుస్తోంది.

unstoppable season 2
బాలయ్య షోకు గెస్ట్​గా చంద్రబాబు! 'అన్​స్టాపబుల్'​ సర్​ప్రైజ్​!!

అన్​స్టాపబుల్​ సీజన్​-1కు తొలి గెస్ట్​గా దిగ్గజ నటుడు మోహన్ బాబును ఆహ్వానించారు. ఆ ఎపిసోడ్​లో మోహన్​ బాబుతో కలిసి బాలయ్య చేసిన హంగామా అంతా ఇంతా కాదు. ఆ తర్వాత వచ్చిన ఎపిసోడ్లలోనూ కుర్ర నటులతో కలిసి అదే స్థాయిలో హడావుడి చేశారు. పెళ్లి విషయంలో రానాను టీజ్ చేసి, నానితో కలిసి క్రికెట్ ఆడి, అల్లు అర్జున్​తో కలిసి పుష్ప స్టెప్పులేసి.. సెట్​లో దుమ్మురేపారు బాలకృష్ణ. సూపర్​స్టార్ మహేశ్​ బాబుతో సీజన్​-1కు గ్రాండ్​ ఫినిషింగ్ ఇచ్చారు.

ఇప్పుడు సీజన్​-2లో చంద్రబాబు, లోకేశ్​ను బాలయ్య హోస్ట్​ చేస్తే.. అన్​స్టాపబుల్ షో ఇంకా ఏ రేంజ్​లో ఉంటుందా అని అంతా అనుకుంటున్నారు. ఇంతకుముందు వచ్చిన గెస్ట్​లతో పోల్చితే చంద్రబాబు, లోకేశ్​ పూర్తిగా భిన్నం. సినీ పరిశ్రమతో పెద్దగా సంబంధం లేని రాజకీయ నేతలు. బాలయ్యకు చంద్రబాబు స్వయానా బావ.. లోకేశ్​ తన ఇంటి పెద్ద అల్లుడు. అయితే వీరి సంభాషణ ఎలా ఉంటుంది, చంద్రబాబు, లోకేశ్​తో బాలయ్య ఎలాంటి టాస్క్​లు చేయిస్తారు అనేది ఆసక్తికరంగా మారింది.

Last Updated :Oct 4, 2022, 1:53 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.