ETV Bharat / business

Jio Bharat B1 4g Mobile Specifications : జియోభారత్‌ కొత్త ఫోన్​లో అదిరిపోయే ఫీచర్లు​.. యూపీఐ పేమెంట్స్ కూడా..

author img

By ETV Bharat Telugu Team

Published : Oct 13, 2023, 8:15 PM IST

Jio Bharat B1 4g Mobile Specifications : రియలన్స్‌ జియో మరో కొత్త 4జీ ఫోన్‌ను మార్కెట్​లోకి తీసుకువచ్చింది. జియో భారత్‌ బీ1 పేరిట ఈ ఫోన్​ను విడుదల చేసింది. ఈ ఫోన్‌లో జియో పే ఆప్షన్‌ కూడా ఉంది. ఈ ఫోన్​కు సంబంధించిన ఇతర వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

Jio Bharat B1 4g Mobile Specifications
jio bharat v1 4g features

Jio Bharat B1 4g Mobile Specifications : జియోభారత్‌ సిరీస్‌లో మరో కొత్త ఫోన్‌ను విడుదల చేసింది రిలయన్స్‌ జియో. జియోభారత్‌ బీ1 పేరుతో ఈ మొబైల్​ను తీసుకొచ్చింది. గతంలో ఉన్న వీ2, కే1 కార్బన్‌ మోడళ్ల కంటే కొన్ని ఎక్కవ ఫీచర్లతో ఇందులో ప్రవేశపెట్టింది. కంపెనీ వెబ్‌సైట్‌లో దీన్ని జియోభారత్‌ బీ1 సిరీస్‌ కింద ప్రత్యేకంగా లిస్ట్‌ చేసింది రిలయన్స్‌ జియో. ఇదొక 4జీ మొబైల్. క్రితం మోడల్ ఫోన్లతో పోలిస్తే స్క్రీన్‌ కొంచెం పెద్దదిగా ఉంటుంది.

Jio Bharat Phone UPI Payment : జియోభారత్‌ బీ1 ఫోన్‌ ధర 1299 రూపాయలుగా ఉంది. 2.4 అంగళాల తెర, 2,000mAh బ్యాటరీ సామర్థ్యంతో ఇది నడుస్తుంది. గత మోడళ్లతో పోలిస్తే ఈ రెండు అంశాల్లో మొబైల్​ మెరుగుపరిచారు. ఈ ఫోన్‌ వెనక భాగంలో కెమెరా కూడా ఉంది. దీనికి సంబంధించిన ఫొటోలను తన వెబసైట్​లో ఫోస్ట్ చేసింది జియో. కానీ, అది ఎన్ని మెగాపిక్సెల్‌ అనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు.

ఈ ఫోన్‌లో జియో యాప్స్‌ అన్నీ ముందే ఇన్‌స్టాల్‌ చేసి ఉంటాయని కంపెనీ వెల్లడించింది. యూపీఐ పేమెంట్స్‌ కోసం ఇందులో జియోపే కూడా ఉన్నట్లు పేర్కొంది. 23 భాషలకు ఇది సపోర్ట్‌ చేస్తుందని వివరించింది. అయితే ఇందులో జియోయేతర సిమ్‌లను ఉపయోగించడం మాత్రం కుదరదు. కేవలం నలుపు రంగులో మాత్రమే ఈ ఫోన్‌ అందుబాటులో ఉంది. ఇది జియో వెబ్‌సైట్‌తో పాటు అమెజాన్‌లో కూడా లభిస్తోంది.

జియోభారత్‌ బీ1 ఫీచర్లు..
Jio Bharat B1 Features : 0.5జీబీ ర్యామ్‌తో జియోభారత్‌ బీ1 ఫోన్‌ వస్తోంది. దీని స్టోరేజ్‌ను మైక్రో ఎస్‌డీ కార్డ్‌ ద్వారా 128జీబీ వరకు పెంచుకోవచ్చు. బ్లూటూత్‌, వైఫై, 3.5ఎంఎం హెడ్‌ఫోన్‌ జాక్‌, యూఎస్‌బీ వంటి కనెక్టివిటీ ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి.

జియో ఎయిర్​ఫైబర్​ లాంఛ్​.. ఫీచర్స్ అదుర్స్​.. ధర ఎంతంటే?
Jio AirFiber Launch : దేశంలో ప్రతి ఒక్కరికీ ఇంటర్నెట్ సౌకర్యం అందించాలనే లక్ష్యంతో.. రిలయన్స్ జియో సెప్టెంబర్​ 19న సరికొత్త జియో ఎయిర్​ఫైబర్​ సర్వీస్​ను ప్రారంభించింది. ప్రస్తుతానికి ఇది హైదరాబాద్​, అహ్మదాబాద్​, బెంగళూరు, చెన్నై, దిల్లీ, ముంబయి, పుణె నగరాల్లో మాత్రమే అందుబాటులో ఉంటుంది. అయితే త్వరలోనే దీనిని ఇతర ప్రాంతాలకు కూడా విస్తరించనున్నట్లు రిలయన్స్ జియో వెల్లడించింది. పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

Tata Upcoming Cars In India : అదిరే ఫీచర్లతో.. 500 కి.మీ రేంజ్​తో.. రానున్న టాటా 'ఈవీ' కార్స్ ఇవే!

Camera Deals October 2023 : దసరా డీల్స్​​.. కెమెరాలపై 80%.. ల్యాప్​టాప్​లపై 36% డిస్కౌంట్​!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.