ETV Bharat / business

మారుతి సరికొత్త బాలెనో బుకింగ్స్​ ఓపెన్​.. మార్కెట్లోకి అప్పుడే..

author img

By

Published : Feb 7, 2022, 7:11 PM IST

New Baleno: మారుతి సుజుకీ బాలెనో న్యూ వెర్షన్​ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. అత్యాధునిక సదుపాయాలతో ఈ ప్రీమియ్​ హ్యాచ్​బ్యాక్​ వాహనాన్ని తీర్చిదిద్దినట్లు సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది.

maruti-suzuki-opens-bookings
మారుతి సరికొత్త బాలెనో బుకింగ్స్​ ఒపెన్​.. మార్కెట్లోకి అప్పుడే..

Maruti Suzuki New Baleno: ప్రీమియం హ్యాచ్​బాక్​ బాలెనో కొత్త వెర్షన్​ బుకింగ్స్​ను సోమవారం ప్రారంభించినట్లు మారుతీ సుజుకీ వెల్లడించింది. రూ.11,000 చెల్లించి ఈ లగ్జరీ వాహనాన్ని బుక్ చేసుకోవచ్చని తెలిపింది. ఈ నెలలోనే దీన్ని మార్కెట్లోకి అందుబాటులోకి తీసుకురానున్నట్లు పేర్కొంది.

ప్రీమియం హ్యాచ్​బ్యాక్ సెగ్మెంట్​ విక్రయాల్లో మరుతీ సుజుకీ 23శాతం వాటాలో ఉన్నత స్థితిలో ఉందని, బాలెనో కొత్త వెర్షన్​ దాన్ని మరింత పెంచుతుందని సంస్థ ఆశాభావం వ్యక్తం చేసింది. హ్యూండాయ్​ ఐ20, టాటా అల్ట్రోజ్​, ఫోక్స్​వాగన్ పోలోకు గట్టి పోటీ ఇస్తుందని పేర్కొంది.

'ఈ మోడల్ అనేక అత్యాధునిక ఫీచర్లతో వస్తోంది. గతంలో తక్కువ ఫీచర్లు ఉన్నందుకు విమర్శలు వచ్చాయి. న్యూ బాలెనోలో అన్ని సదుపాయాలు ఉంటాయి. ఈ సెగ్మెంట్​లో ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఫీచర్ల కంటే ఇంకా ఎక్కువగానే జత చేశాం. ఈ మార్పులతో కొత్త బాలెనోకు మరింత ఆదరణ లభిస్తుందని నమ్మకంగా ఉన్నాం' అని మారుతీ సుజుకీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్​ శశాంక్ శ్రీవాత్సవ తెలిపారు.

కొత్త బాలెనో అప్​డేటెడ్​ ప్లాట్​ఫాం, కొత్త ఎక్స్​టీరియర్​, ఇంటీరియర్​, కొత్త పెట్రోల్ ఇంజిన్​, 22కి.మీకుపైగా మైలేజ్​తో వస్తుందని సంస్థ తెలిపింది.

బాలెనో 2015లో విడుదలైంది. 2021 నవంబర్​ నాటికి 10 లక్షల విక్రయాలు జరిగాయి. కారు విక్రయాల్లో ఇదే రికార్డు అని సంస్థ చెప్పింది. ఇప్పుడు దీన్ని కొత్త హంగులతో మార్కెట్లోకి తీసుకొస్తోంది.

ఇదీ చదవండి: వడ్డీ రేట్ల పెంపు ఖాయమా? నిపుణుల మాటేంటి?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.