ETV Bharat / bharat

Modi Meeting: కరోనా, వ్యాక్సినేషన్​పై మోదీ కీలక సమావేశం

author img

By

Published : Sep 10, 2021, 5:17 PM IST

Updated : Sep 10, 2021, 5:51 PM IST

దేశంలో కరోనా పరిస్థితి, వ్యాక్సినేషన్​​పై అధికారులతో ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు ప్రధాని నరేంద్ర మోదీ(Modi Meeting). భారత్​లో ఇంకా కరోనా రెండో దశ ముగియలేదని కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్​ చెప్పిన మరునాడే ఈ భేటీ జరిగింది.

Prime Minister Narendra Modi chairs a high-level meeting to review the COVID-19 related situation and vaccination in the country
కరోనా, వ్యాక్సినేషన్​పై మోదీ కీలక సమావేశం

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(PM Modi) అధికారులతో శుక్రవారం ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. దేశంలో కరోనా పరిస్థితి, వ్యాక్సినేషన్​పై చర్చించారు. కొవిడ్​ మూడో దశ వస్తే.. ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండేలా చర్యలు తీసుకోవడమే గాక, వ్యాక్సినేషన్(Corona Vaccination)​ వేగాన్ని మరింత పెంచాలని అధికారులకు ప్రధాని సూచించినట్లు తెలుస్తోంది.

కేంద్ర ఆరోగ్య మంత్రి సహా కీలక అధికారులు ఈ భేటీలో పాల్గొన్నారు.

భారత్​లో ఇంకా కరోనా రెండో దశ(Covid Second Wave) ముగియలేదని కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్​ చెప్పిన మరునాడే మోదీ ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. దేశంలోని 35 జిల్లాల్లో పాజిటివిటీ రేటు ఇంకా 10శాతంపైనే ఉందని రాజేశ్ పేర్కొన్నారు. మరో 30 జిల్లాలో ఇది 5-10 శాతంగా ఉందని తెలిపారు.

మరోవైపు.. దేశంలోని వయోజనులలో సగం మంది కనీసం ఒక్క డోసు టీకా తీసుకున్నారు. 18 శాతం మందికి రెండు డోసులు పూర్తయ్యాయి. మొత్తంగా 72 కోట్లకుపైగా టీకా డోసులు పంపిణీ చేశారు.

ఇదీ చదవండి: కొవిడ్ వ్యాక్సినేషన్ స్టేటస్ క్షణాల్లో తెలుసుకోండిలా..

Last Updated : Sep 10, 2021, 5:51 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.