ETV Bharat / bharat

Modi: ట్విట్టర్​లో మోదీకి మరింత పెరిగిన ఫాలోయింగ్​

author img

By

Published : Jul 29, 2021, 7:05 PM IST

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ట్విట్టర్​లో అరుదైన ఫీట్​ సాధించారు. ఆయన్ను అనుసరించేవారి సంఖ్య ఏడు కోట్ల మార్కును దాటింది. దీంతో ట్విట్టర్​లో అత్యధిక ఫాలోవర్లు ఉన్న నేతల్లో ఒకరిగా నిలిచారు.

PM Modi
పీఎం మోదీ

ప్రధాని నరేంద్రమోదీ ట్విట్టర్​లో కీలక మైలురాయిని చేరుకున్నారు. ట్విట్టర్​లో అత్యధిక ఫాలోవర్లు ఉన్న నేతల్లో ఒకరిగా నిలిచారు. ఆయన్ను అనుసరించేవారి సంఖ్య బుధవారంతో ఏడుకోట్ల(70 మిలియన్లు) మార్కును దాటింది.

pm-modis-twitter-followers
పీఎం మోదీ

గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 2009లో మోదీ ట్విట్టర్​ ఖాతాను ప్రారంభించారు. 2010 నాటికి ఆయన్ను అనుసరించేవారి సంఖ్య లక్షగా ఉంది. పది సంవత్సరాలు అంటే 2020లో ఆ సంఖ్య ఆరు కోట్ల(60 మిలియన్లు)కు చేరింది. ఇప్పుడా సంఖ్య ఏడు కోట్లను దాటింది. అదే సమయంలో కేంద్రమంత్రి అమిత్‌ షా ఖాతాను 2.63 కోట్లు, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని 1.94 కోట్ల మంది అనుసరిస్తున్నారు.

ప్రధాని మోదీ ట్విట్టర్​ ద్వారా దేశ ప్రజలకు చేరువగా ఉంటారు. దేశంలో జరుగుతోన్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల గురించి వివరిస్తుంటారు. ఆయన చూపుతున్న చొరవతో అంతర్జాతీయంగా ప్రజాదరణ చూరగొన్నారని కేంద్రమంత్రి పీయూష్​ గోయల్ అన్నారు. 'మోదీజీ విజన్, నిర్ణయాత్మక చర్యలు ఆయనకున్న ప్రజాదరణను మరింత పెంచుతున్నాయి. ఏడు కోట్ల ఫాలోవర్లను సంపాదించుకొని మరొక మైలురాయి దాటిన ప్రధానికి నా అభినందనలు. మీ నాయకత్వం పట్ల మేం గర్వంగా ఉన్నాం' అని గోయల్ ట్వీట్ చేశారు.

ఇటీవల కాలంలో కొత్త ఐటీ నిబంధనల విషయంలో ట్విట్టర్​, కేంద్రానికి మధ్య వివాదం రాజుకున్న సంగతి తెలిసిందే. అలాగే రైతుల ఆందోళనల నేపథ్యంలో ఇరువర్గాల మధ్య భేదాభిప్రాయాలు నెలకొన్నాయి. ఆ సమయంలో పలువురు కేంద్రమంత్రులు దేశీయ యాప్‌ 'కూ' లో చేరారు. ట్విట్టర్​తో పాటు ఈ యాప్‌ను కూడా వాడుతున్నారు. కేంద్ర ప్రభుత్వానికి చెందిన పలు విభాగాలు, ఇండియా పోస్ట్‌, మై గవర్నమెంట్‌, డిజిటల్ ఇండియాలు కూడా కూ యాప్‌లో అందుబాటులో ఉన్నాయి. ప్రధాని మాత్రం కూలో ఇంకా ఖాతా తెరవలేదు.

ఇదీ చూడండి: 'దేశ నిర్మాణ మహా యజ్ఞంలో ఎన్​ఈపీ కీలకం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.