ETV Bharat / bharat

వ్యాపారంలో లాభాల కోసం నరబలి.. పదేళ్ల చిన్నారిని కిరాతకంగా చంపిన బంధువులు

author img

By

Published : Jul 18, 2023, 4:57 PM IST

Human Sacrifice In Panjab : సమీప బంధువువైన పదేళ్ల చిన్నారిని నరబలి ఇచ్చింది ఓ కుటుంబం. వ్యాపారంలో నష్టాలు వస్తున్నాయని ఈ దారుణానికి పాల్పడింది. పంజాబ్​లో జరిగిన ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

human-sacrifice-in-panjab-uncle-sacrificed-10-year-old-niece-for-business
పంజాబ్‌లో 10 ఏళ్ల బాలిక హత్య

Human Sacrifice In Panjab : వ్యాపారంలో నష్టాలు వస్తున్నాయని సమీప బంధువును నరబలి ఇచ్చింది ఓ కుటుంబం. ఇంటి పక్కనే ఉండే పదేళ్ల బాలికను కత్తితో పొడిచి దారుణంగా హత్య చేసింది. తాంత్రికుడి మాటలు నమ్మి ఈ ఘోరానికి పాల్పడింది. పంజాబ్​లోని​ అమృత్​సర్​ జిల్లాలో ఈ ఘటన జరిగింది. బాధితురాలిని సుఖందీప్ కౌర్​గా పోలీసులు గుర్తించారు. నిందితుల్ని అరెస్ట్​ చేసి రిమాండ్​ తరలించారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దల్బీర్​ సింగ్​.. మిఠాయి వ్యాపారి. ముధాల్ గ్రామానికి చెందిన వ్యక్తి. కొంతకాలం క్రితమే మరో వ్యక్తితో కలిసి తన ఊర్లోనే.. రూ.9.50లక్షలకు ఓ ఫంక్షన్​ హాల్​ను అద్దెకు తీసుకున్నాడు. ఈ ఫంక్షన్​ హాల్​ తీవ్ర నష్టాల్లో నడుస్తోంది. దీంతో కుటుంబ సభ్యులతో కలిసి ఓ తాంత్రికుడ్ని సంప్రదించాడు దల్బీర్​ సింగ్​. వ్యాపారంలో లాభాలు వచ్చేందుకు పూజలు చేయాలని అతడ్ని కోరాడు. అందుకోసం నరబలి ఇవ్వాలని దల్బీర్​ సింగ్​కు మాంత్రికుడు సలహా ఇచ్చాడు. అతడి మాటలు నమ్మిన దల్బీర్​ సింగ్​.. పథకం ప్రకారం కుటుంబ సభ్యులతో కలిసి చిన్నారిని హత్య చేశాడు.

బయటకు వెళ్లిన చిన్నారి ఇంకా తిరిగి ఇంటికి రాకపోవడం వల్ల కంగారుపడ్డ కుటుంబ సభ్యులు.. ఆమె కోసం తీవ్రంగా గాలించారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. శునకాల సాయంతో చిన్నారి మృతదేహాన్ని గుర్తించారు. దర్యాప్తు జరిపి నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు.
"జులై 11న పక్కింట్లో నివాసం ఉండే సుఖందీప్ కౌర్ అనే బాలిక మా ఇంటికి వచ్చింది. అప్పుడే చిన్నారిని కత్తితో పొడిచి హత్య చేశాం. అనంతరం ఆమె మృతదేహాన్ని ఓ బ్యాగ్​లో కుక్కి.. ఓ ఇంట్లో పడేశాం. హత్య అనంతరం ఊరి నుంచి పారిపోయాం." అని పోలీసులకు నిందితులు తెలిపారు.

ప్రధాన నిందితుడు దల్బీర్ సింగ్​, అతని భార్య జస్బీర్​ సింగ్​, కొడుకు సూరజ్​ సింగ్​, కోడలు పవన్‌దీప్ కౌర్​ను కోర్టులో హాజరుపరిచి రిమాండ్​కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. జస్బీర్​ సింగ్​ కూడా చాలా ఏళ్లుగా మాంత్రికుడి ఉచ్చులో పడి చేతబడి నేర్చుకుంటున్నట్లు సమాచారం. తాంత్రికుడు మాత్రం ఇంకా పరారీలో ఉన్నాడని పోలీసులు తెలిపారు. అతని వివరాలు కూడా తెలియలేదని వారు వెల్లడించారు. తాంత్రికుడి కోసం పోలీసులు గాలింపు జరుపుతున్నారని పేర్కొన్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.