LIVE : పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు - ప్రత్యక్ష ప్రసారం

By ETV Bharat Telangana Team

Published : Feb 1, 2024, 11:02 AM IST

Updated : Feb 1, 2024, 11:59 AM IST

thumbnail

Union Budget 2024 Live :  సార్వత్రిక ఎన్నికల ముందు కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే సర్కార్ తాత్కాలిక బడ్జెట్‌ను ప్రవేశపెడుతోంది. మూడోసారి అధికారం చేపట్టాలన్న ఆకాంక్షల మధ్య ఈ బడ్జెట్‌ తీసుకొస్తోంది. తొలుత కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఉదయం 9 గంటలకు కేంద్ర ఆర్థిక శాఖ కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడి నుంచి ఆమె అధికారులతో కలిసి రాష్ట్రపతి భవన్‌కు వెళ్లారు. ఆ తర్వాత 9:30 గంటలకు రాష్ట్రపతిని కలిసి బడ్జెట్‌ సమర్పణకు అనుమతి తీసుకున్నారు. ఉదయం 10 గంటలకు పార్లమెంట్‌కు చేరుకున్నారు. బడ్జెట్‌ సమర్పణకు ముందు ఉదయం 10:30 గంటలకు పార్లమెంట్ ఆవరణలో కేంద్ర కేబినెట్‌ భేటీ అయింది. మధ్యంతర బడ్జెట్‌కు ఆమోదం తెలిపింది. అనంతరం ఉదయం 11 గంటల నుంచి లోక్‌సభలో బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నారు. సీతారామన్‌ బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం వరుసగా ఇది ఆరోసారి. గతేడాది మాదిరిగా ఈసారి కూడా పేపర్‌లెస్‌ బడ్జెట్‌నే ప్రవేశపెడుతున్నారు. మేక్‌ ఇన్‌ ఇండియా స్ఫూర్తితో తయారుచేసిన ట్యాబ్‌ ద్వారా మంత్రి బడ్జెట్‌ను చదివి వినిపిస్తున్నారు. 

Last Updated : Feb 1, 2024, 11:59 AM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.