చెట్టినాడు ఫ్యాక్టరీ ఎదుట రైతులు నిరసన - పంటలు దెబ్బతిన్నాయని ఆవేదన

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 20, 2024, 1:49 PM IST

thumbnail

Farmers Protest in Front of Chettanadu Cement Factory: ఫ్యాక్టరీ నుంచి వచ్చే దుమ్ము ధూళితో తమ పంటలు దెబ్బతిన్నాయని పల్నాడు జిల్లాలో రైతులు ఆందోళనకు (Farmers protest in Palnadu district) దిగారు. వివరాల్లోకి వెళ్తే జిల్లాలోని పెదగార్లపాడులో ఉన్న చెట్టినాడు సిమెంట్‌ ఫ్యాక్టరీ గేట్‌ ముందు తక్కెళ్లపాడు రైతులు నిరసన చేపట్టారు. ఫ్యాక్టరీ నుంచి వచ్చే దుమ్ము ధూళితో పంటలు దెబ్బతింటున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ఈ ఫ్యాక్టరీ వల్ల లక్షల రూపాయల విలువచేసే మిర్చి పంటను నష్టపోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఫ్యాక్టరీ నుంచి వచ్చే దుమ్ముతో రైతులకు పంట దిగుబడి తగ్గిపోతుందని వాపోయారు. ఫ్యాక్టరీ నుంచి వచ్చే దుమ్ముతో పాడైపోయిన మిరప మొక్కలను ఫ్యాక్టరీ వద్దకు తీసుకు వచ్చి గేట్ ముందు రైతుల బేటాయించారు.  ఫ్యాక్టరీ యాజమాన్యానికి ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి తమను ఆదుకోవాలని తక్కెళ్లపాడు రైతులు కోరుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.