ETV Bharat / snippets

ఏపీకి చెందిన ప్రభుత్వ టీచర్‌ హైదరాబాద్‌లో మృతి - హత్యా ? ఆత్మహత్యా ?

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 26, 2024, 3:47 PM IST

govt_teacher_died_in_hyd
govt_teacher_died_in_hyd (ETV Bharat)

Government Teacher From Rayachoti Died in Hyderabad: అన్నమయ్య జిల్లాలోని రాయచోటికి చెందిన ప్రభుత్వ టీచర్‌ హైదరాబాద్‌లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. మియాపూర్‌లోని ఓయో లాడ్జిలో ఈ ఘటన చోటు చేసుకుంది. అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన టీచర్‌ జయప్రకాష్‌ విషం మాత్రలు మింగినట్లుగా లాడ్జి గదిలో ఆనవాళ్లు ఉన్నాయి. జయప్రకాష్ రాయచోటిలో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నారు. ఇది హత్యా? లేక ఆత్మహత్యా? అనే విషయం తెలియాల్సి ఉంది. ఆర్ధిక సమస్యలు ఏమైనా ఉన్నాయా లేక వేరే ఇతర కారణాలతో ఎవరైనా హత్య చేశారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.