వెలుగులోకి వల్లభనేని వంశీ అరాచకాలు - అడ్డుకున్న టీడీపీ శ్రేణులు - సామాజిక మాధ్యమాల్లో వీడియో వైరల్‌ - TDP Leader kick Vallabhaneni Vamsi

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 26, 2024, 1:24 PM IST

thumbnail
ఎమ్మెల్యే అభ్యర్థి వల్లభనేని వంశీని తరిమికొట్టిన టీడీపీ శ్రేణులు - సామాజిక మాధ్యమాల్లో వీడియో వైరల్‌ (ETV Bharat)

Vallabhaneni Vamsi Fight With TDP Leaders : పోలింగ్ రోజు వైఎస్సార్సీపీ నేతలు సృష్టించిన అల్లర్లు, ప్రతిపక్ష నేతలపై దాడులు చేసిన విషయం తెలిసిందే. ఆ రోజు జరిగిన ఘటనలకు సంబంధించిన వీడియోలు రోజుకొకటి బయటకు వస్తున్నాయి. తాజాగా కృష్ణా జిల్లా గన్నవరం వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వల్లభనేని వంశీ, ఆయన వర్గీయులు తెలుగుదేశం పార్టీ నేతలపై దాడికి యత్నించారు. దీంతో ఆగ్రహానికి లోనైన టీడీపీ శ్రేణులు వల్లభనేని వంశీని వివిధ గ్రామాల్లో తరిమికొట్టారు. శనివారం కేసరపల్లిలో తరిమి కొట్టిన వీడియో బయటకు వచ్చింది. నేడు సూరంపల్లిలో తరిమి కొట్టిన వీడియో విడుదల అయ్యింది.  పూర్తి వివరాల్లోకి వెళితే

గన్నవరంలో ఎమ్మెల్యే వంశీ పోలింగ్ రోజు చేసిన అరాచకాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. సూరంపల్లి గ్రామంలో వంశీ గొడవకు ప్రయత్నిస్తూ కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. వంశీని తెలుగుదేశం శ్రేణులు ధీటుగా ప్రతిఘటించటంతో పాటు తరిమికొట్టారు. పెద్దఎత్తున తెలుగుదేశం శ్రేణులు నుంచి తిరుగుబాటు రావటంతో వంశీ వెనుతిరగక తప్పలేదు. 13వ తేదీన చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వీడియో తాజాగా సామాజిక మాధ్యమంలో  వైరల్‌గా మారింది. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.