ETV Bharat / health

రాత్రి కావాల్సినంత నిద్రపోయినా - పగటిపూట మళ్లీ నిద్రపోతున్నారా? - అయితే ఇదే సమస్య కావొచ్చు! - What is Idiopathic Hypersomnia

author img

By ETV Bharat Telugu Team

Published : May 24, 2024, 5:10 PM IST

Idiopathic Hypersomnia: మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే కచ్చితంగా సరిపడా నిద్ర ఉండాలనే విషయం అందరికీ తెలిసిందే. అయితే.. మనలో కొందరు రాత్రి సరిపడా నిద్ర పోయినప్పటికీ, పగటిపూట మళ్లీ నిద్ర ముంచుకొస్తూ ఉంటుంది. మీక్కూడా ఇలాంటి సమస్య ఉంటే.. వెంటనే అలర్ట్ కావాలని నిపుణులు సూచిస్తున్నారు.

Idiopathic Hypersomnia
Idiopathic Hypersomnia (Etv Bharat)

What is Idiopathic Hypersomnia: సాధారణంగా పగటి పూట నిద్రపోతున్నారంటే.. రాత్రి సరిగా నిద్రపోలేదని అర్థం. కానీ.. రాత్రి పూట సరిపడా నిద్రపోయినప్పటికీ పగలు పడుకుంటున్నారంటే.. అది ‘ఇడియోపతిక్ హైపర్‌సోమ్నియా’ (Idiopathic Hypersomnia) అనే అరుదైన ఆరోగ్య సమస్య కావొచ్చని అంటున్నారు నిపుణులు. ఈ సమస్యను ఒక న్యూరోలాజికల్‌ డిజార్డర్‌గా చెబుతున్నారు.

ఈ వ్యాధితో బాధపడుతున్న వ్యక్తులు రాత్రంతా సరిపడా నిద్ర ఉన్నప్పటికీ.. ఉదయం మళ్లీ నిద్రవస్తున్న భావనలో ఉంటారంటున్నారు. ఈ సమస్యతో బాధపడుతున్న వారు ఉదయం చేసే రోజువారీ కార్యకలాపాలను నిర్వహించడంలో ఇబ్బందులు పడుతుంటారు. అలాగే జీవన విధానంలో ఇబ్బందులు ఏర్పడుతుంటాయి. ముఖ్యంగా టీనేజ్ వయసులో ఉన్నవారు ఎక్కువగా హైపర్ ​సోమ్నియాకు గురవుతుంటారని అంటున్నారు. కాబట్టి ఈ వ్యాధితో బాధపడుతున్నవారు వీలైనంత త్వరగా చికిత్స చేయించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

రోజులో ఎంతసేపు కూర్చోవాలో మీకు తెలుసా? - పరిశోధనలో ఆసక్తికర విషయాలు! - How Many Hours to Sleep in a Day

ఇడియోపతిక్​ హైపర్​సోమ్నియా కారణాలు: ఈ సమస్యకు కచ్చితమైన కారణం లేదని కొందరు అంటుండగా.. మరికొందరు మాత్రం హైపర్సోమ్నియాకు పలు కారణాలు చూపుతున్నారు. ఒబెసిటీ, హైపోథైరాయిడిజం, మెదడు సంబంధిత సమస్యలు, పార్కిన్సన్స్, మూర్ఛ వంటి కపాల నరాల సమస్యలు కారణం కావచ్చని అంటున్నారు.

ఇడియోపతిక్ హైపర్‌సోమ్నియా లక్షణాలు:

  • పగటిపూట నిద్రపోవాలనిపించడం
  • ఉదయం లేచినా నిద్ర మబ్బు వదలకపోవడం
  • నీరసంగా, నిస్సత్తువగా ఉండటం
  • ఆందోళన
  • చిరాకు
  • మాటల్లో, చేతల్లో చురుకుదనం లేకపోవడం,
  • జ్ఞాపక శక్తి సమస్యలు
  • తలనొప్పి
  • ఆకలి లేకపోవడం..
  • బరువు తగ్గడం.. ఇవీ ప్రాథమికంగా హైపర్ సోమ్నియా లక్షణాలు.

ఈ సమస్యపై పలు పరిశోధలు కూడా జరిగాయి. 2013లో అమెరికన్ అకాడమీ ఆఫ్ న్యూరాలజీ అధికారిక జర్నల్ "​న్యూరాలజీ ఆన్‌లైన్ మెడికల్"లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం.. ఇడియోపతిక్​ హైపర్​సోమ్నియాతో బాధపడుతున్న వ్యక్తులు నిరంతరం నిద్రలేమి, అధిక పగటి నిద్ర, మూర్ఛ వంటి లక్షణాలను కలిగి ఉంటారని కనుగొన్నారు. ఈ పరిశోధనలో యేల్ యూనివర్శిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్‌లో న్యూరాలజీ ప్రొఫెసర్​, అసోసియేట్ డైరెక్టర్ ఆఫ్ క్లినికల్ న్యూరోఫిజియాలజీ డాక్టర్​ M. Wassim Biffi పాల్గొన్నారు.

చికిత్స ఎలా : ఈ సమస్యకు కారణాలపైనే చికిత్స ఆధారపడి ఉంటుందని నిపుణులు అంటున్నారు. జీవనశైలి మార్పులు కూడా ఈ సమస్యను పరిష్కరించగలవని.. రాత్రిపూట ఎలాంటి ఆటంకాలూ లేకుండా ప్రశాంతంగా నిద్రపోవడం అలవాటు చేసుకోవాలంటున్నారు. మద్యపానం తగ్గించడం, ఆరోగ్యకరమైన ఆహారం(Healthy Food) తీసుకోవడం, ధ్యానం, యోగా కూడా ఈ సమస్య నుంచి బయటపడేందుకు ఉపయోగపడతాయని అంటున్నారు. లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలని సూచిస్తున్నారు.

NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

అలర్ట్ : రాత్రివేళ సరిగా నిద్రపోవట్లేదా? - అయితే మీకు షుగర్ ముప్పు - ఇలా చేయాల్సిందేనట! - health problems less sleep

విజయం మీ కాళ్ల దగ్గరకు రావాలా? - అయితే ఉదయం 7 గంటల్లోపు ఈ పనులు చేసేయండి! - Things To Do Before 7 AM

రాత్రిపూట నిద్ర పట్టట్లేదా? పడుకునే ఈ నీటితో స్నానం చేస్తే అంతా సెట్​! - Warm Water Shower For Sleep

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.