LIVE : కరీంనగర్ జిల్లా మానకొండూరులో ఎలుగుబంటి కలకలం

By ETV Bharat Telangana Team

Published : Feb 6, 2024, 12:08 PM IST

thumbnail

Bear in Karimnagar Live : కరీంనగర్ జిల్లా మానకొండూరు చెరువు వద్ద ఎలుగుబంటి చెట్టు పైకి ఎక్కడంతో స్థానికులు భయాందోళన గురవుతున్నారు. తెల్లవారుజామున ఇళ్లలోకి వస్తున్న ఎలుగుబంటిని చూసిన కుక్కలు దాన్ని తరమడంతో సమీపంలో ఉన్న చెట్టు పైకి ఎక్కింది. ఇది గమనించిన స్థానికులు పోలీసులకు, అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. 

Bear in Manakondur : కరీంనగర్, హన్మకొండ రహదారిలో ఉన్న చెరువు వద్ద ఎలుగుబంటి చెట్టుపై కూర్చోవడంతో దాన్ని చూసేందుకు స్థానికులు గుమిగూడుతున్నారు. మరోవైపు అక్కడికి చేరుకున్న పోలీసులు దాని వల్ల ఎవరికీ ప్రమాదం జరగకుండా పహారా కాస్తున్నారు. ఎలుగుబంటిని పట్టుకోడానికి అటవీ అధికారులు ప్రయత్నం చేస్తున్నారు. గతంలో కూడా ఎలుగుబంటి దాడులు చేసిన సందర్భాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో పోలీసులు ప్రజల్ని అప్రమత్తం చేశారు. కరీంనగర్ శివారు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున గ్రానైట్ క్వారీలు ఉండడంతో  విరివిగా ఆ పేలుళ్లకు భయపడి ఎలుగుబంట్లు గ్రామాల్లోకి వస్తుంటాయి. శాతవాహన యూనివర్సిటీలో పలుసార్లు భల్లూకాన్ని గమనించిన అటవీ శాఖ అధికారులు వాటిని చాకచక్యంగా పట్టుకొని అడవులకు తరలించారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.