LIVE : తెలంగాణ భవన్‌లో కేటీఆర్ మీడియా సమావేశం - KTR press meet in Hyd live

By ETV Bharat Telangana Team

Published : May 15, 2024, 1:34 PM IST

Updated : May 15, 2024, 1:54 PM IST

thumbnail

KTR Live : లోక్‌సభ ఎన్నికల్లో గ్రామీణ ప్రాంతాల్లోని రైతులు భారత్ రాష్ట్ర సమితికి మద్దతుగా నిలిచారని కేటీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఇచ్చిన హామీ మేరకు రైతు భరోసా వేయనందుకు కాంగ్రెస్​పై రైతులు ఆగ్రహంతో ఉన్నారన్న ఆయన, రుణమాఫీ విషయంలో మోసం చేశారని అన్నదాతలు మండిపడుతున్నారన్నారు. అనేక హామీలు ఇచ్చి కాంగ్రెస్‌ ప్రభుత్వం మోసం చేసిందని విమర్శించిన కేటీఆర్, నెలకు రూ.2500 ఇవ్వలేదని రాష్ట్రంలోని మహిళలు సైతం కాంగ్రెస్​ ప్రభుత్వంపై కోపంతో ఉన్నారని దుయ్యబట్టారు.భారతీయ జనతా పార్టీపైనా ప్రజా వ్యతిరేకత స్పష్టంగా కనిపించిందన్న కేటీఆర్, పెట్రోల్‌, నిత్యావసరాల ధరలు పెరిగినందుకు మోదీపై కోపంతో ఉన్నారని తెలిపారు. దిల్లీలో దోస్తీ - గల్లీలో కుస్తీ అన్నట్లుగా బీజేపీ-కాంగ్రెస్‌ పార్టీల వైఖరి ఉందని దుయ్యబట్టారు. ఈ క్రమంలోనే ఈసారి కేంద్రంలో ఏ కూటమికి స్పష్టమైన ఆధిక్యం వచ్చే పరిస్థితి లేదని, ప్రాంతీయ పార్టీలతో ఏర్పడే కూటమే దిల్లీలో అధికారంలోకి వస్తుందని జోస్యం చెప్పారు. తాజాగా ఇవాళ హైదరాబాద్‌ తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేేశంలో కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అచ్చంపేటలో బీఆర్ఎస్ నేతలపై కాంగ్రెస్ నేతల దాడులపై కేటీఆర్ స్పందించారు. అధికార దుర్వినియోగంతో ప్రత్యర్థులపై దాడులు చేస్తున్నారని విమర్శించారు.

Last Updated : May 15, 2024, 1:54 PM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.