ETV Bharat / technology

హ్యాకర్స్ నుంచి Wifiను కాపాడుకోవాలా? ఈ 6 టిప్స్​ మీ కోసమే! - How To Protect Wifi From Hackers

author img

By ETV Bharat Telugu Team

Published : Apr 12, 2024, 12:12 PM IST

How To Protect Wifi From Hackers : ఈ మధ్యకాలంలో సైబర్​ నేరగాళ్ల ఆగడాలు మితిమీరిపోతున్నాయి. వైఫై రూటర్ల ద్వారా కూడా డేటాను చోరీ చేస్తున్నారు. ఇంతకీ సైబర్​ నేరగాళ్లు వైఫైను ఎలా హ్యాక్​ చేస్తారు? వైఫై హ్యాక్​కు గురికాకుండా మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
How To Secure Your Home Wi-Fi Network
How To Protect Wifi From Hackers

How To Protect Wifi From Hackers : పెరుగుతున్న సాంకేతికతను ఆధారంగా చేసుకొని మన వ్యక్తిగత డేటాను చోరీ చేసేస్తున్నారు సైబర్​ నేరగాళ్లు. మనం వాడుతున్న వైర్​లెస్​ వైఫైను కూడా హ్యాక్​ చేసి మన పర్సనల్​ డేటా మొత్తాన్ని అపహరించి దుర్వినియోగానికి పాల్పడుతున్నారు. ఇలాంటి సమయాల్లోనే మనం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ నేపథ్యంలో సైబర్​ మాయగాళ్ల వలలో పడకుండా, మన వైఫైను ఎలా కాపాడుకోవాలో ఇప్పుడు చూద్దాం.

లాగిన్​​ వివరాలను మార్చుకోవడం
వైఫై రూటర్​ ఇన్​స్టాలేషన్​తో వచ్చే డీఫాల్ట్​ లాగిన్ వివరాలను వెంటనే మార్చుకోవాలి. లేదంటే హ్యాకర్లు చాలా సులువుగా మీ రూటర్​లోని డేటాను చోరీ చేసే అవకాశం ఉంది.

తరచుగా వైఫై పాస్​వర్డ్​లు మార్చడం
మీ రూటర్​ భద్రతంతా వైఫై పాస్​వర్డ్​ మీదే ఆధారపడి ఉంటుంది. కాబట్టి తరచుగా మీ వైఫై పాస్​వర్డ్​ను మారుస్తూ ఉండాలి. స్ట్రాంగ్​ పాస్​వర్డ్​లను సెట్​ చేసుకోవాలి. ఎనిమిది అక్షరాలు లేదా అంతకంటే పెద్ద అల్ఫాన్యూమరిక్​ పాస్​వర్డ్​ను పెట్టుకోవాలి. అలాగే 'రూటర్​ పేరు' కూడా మార్చాలి. దీని వల్ల హ్యాకర్స్​కు మీ వైఫైను హ్యాక్​ చేయడం కష్టంగా మారుతుంది.

యాక్సెస్‌ను షేర్​ చేయవద్దు
మీ ఇంట్లో వైఫై ఉంటే జాగ్రత్తగా ఉండాలి. పొరుగువారికి పాస్​వర్డ్​ తెలిస్తే వారు, దానిని వాడేసుకునే అవకాశం ఉంటుంది. ఒకవేళ మీరు వైఫై పాస్​వర్డ్​ను​ పక్కింటివారికి చెబితే, ఆ పని పూర్తయిన తరువాత సదరు పాస్​వర్డ్​ను మార్చుకోడవం బెటర్​. సాధారణంగా వైఫై రూటర్లలో డిఫాల్ట్​గా రిమోట్ యాక్సెస్​ ఎనేబుల్ అయ్యుంటుంది. మీరు కనుక దానిని ఉపయోగించకపోతే, వెంటనే దానిని నిలిపివేయడం మంచిది.

ఇతరులకు తెలిస్తే?
మీ స్మార్ట్​ఫోన్​, పీసీ, ల్యాప్​టాప్​, స్మార్ట్​టీవీ, ట్యాబ్లెట్స్, స్మార్ట్​వాచ్​ల్లో ఎవరెవరు మీ వైఫై వాడుతున్నారో లిస్ట్ కనబడుతుంది. ఒకవేళ మీకు తెలియని వ్యక్తులు మీ పాస్​వర్డ్ వాడుతున్నట్లు గుర్తిస్తే, వెంటనే దానిని బ్లాక్​ లేదా డిజేబుల్ చేయాలి. వెంటనే పాత పాస్​వర్డ్​ను ఛేంజ్​ చేసి కొత్త పాస్​వర్డ్​ను​ సెట్​ చేసుకోవాలి.

స్ట్రాంగ్​ ఫైర్​వాల్​తో
ప్రస్తుతం చాలా వైఫై రూటర్‌లు ఫైర్‌వాల్‌తో ఇన్‌స్టాల్​ అవుతున్నాయి. అయితే, కొన్ని పాత మోడల్​ రూటర్లలో ఇలా లేదు. అందుకే హ్యాకింగ్​ నుంచి బయటపడాలంటే స్ట్రాంగ్​ ఫైర్​వాల్​ను మీ డివైజ్​లో ఇన్​స్టాల్ చేసుకోవాలి.​ దానిని ఎప్పటికప్పుడు అప్​డేట్ చేస్తుండాలి.

ఫ్రీ వైఫై వద్దు!
మీరు ఫ్రీ వైఫైను వాడుతున్నారా? అయితే మీరు ప్రమాదాలను ఆహ్వానిస్తున్నట్టే. మీ నెట్‌వర్క్‌లోకి సైబర్‌ నేరగాళ్లు ప్రవేశించి హాట్‌స్పాట్‌ను వినియోగిస్తున్న వారందరి డేటాను కూడా తస్కరించే ప్రమాదం ఉంది. కనుక పబ్లిక్ వైఫైను ఎప్పుడూ వాడకూడదు. ఒక వేళ అత్యవసరంగా వాడాల్సి వస్తే, వీపీఎన్​ ఉపయోగించాలి.

జీ-మెయిల్​లో జెమినీ ఫీచర్​ - ఎంత పెద్ద మెయిల్ అయినా ఇట్టే షార్ట్ అయిపోతుంది! - Gmail Summarize Feature

టీనేజర్ల రక్షణ కోసం ఇన్​స్టాగ్రామ్​ నయా ఫీచర్​​​- ఎవరైనా న్యూడ్​ ఫొటోలు పంపితే ఇక అంతే! - Instagram New Feature Sextortion

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.