ETV Bharat / technology

జీ-మెయిల్​లో జెమినీ ఫీచర్​ - ఎంత పెద్ద మెయిల్ అయినా ఇట్టే షార్ట్ అయిపోతుంది! - Gmail Summarize Feature

author img

By ETV Bharat Telugu Team

Published : Apr 8, 2024, 3:00 PM IST

Gmail's Summarize This Email Feature : ఆండ్రాయిడ్​ మొబైల్​ యూజర్లకు గుడ్​న్యూస్​. గూగుల్ కంపెనీ త్వరలో ఆండ్రాయిడ్​ జీ-మెయిల్ యాప్​ కోసం​ 'మెయిల్ సమ్మరైజ్​ ఫీచర్​'ను తీసుకురానుంది. దీనితో చాలా పెద్ద పెద్ద ఈ-మెయిల్స్​ను కూడా చాలా సింపుల్​గా సమ్మరైజ్ చేసుకుని చూసుకోవచ్చు.

Gmails Summarize This Email Feature New Feature In Gmail
Gmails Summarize This Email Feature New Feature In Gmail

Gmail's Summarize This Email Feature : మీ ఈ-మెయిల్​కు రోజూ వందలకొద్దీ మెయిల్స్​ వస్తున్నాయా? వాటిల్లో కొన్ని సందేశాలు చదవడానికి లేదా చూడటానికి చాలా పెద్దవిగా అనిపిస్తున్నాయా? అయినా ఏం ఫర్వాలేదు. ఈ సమస్యకు చెక్​ పెట్టేందుకు రెడీ అయింది టెక్​ దిగ్గజం గూగుల్​. ఆండ్రాయిడ్​ జీ-మెయిల్​ యాప్​ కోసం త్వరలో 'మెయిల్​ సమ్మరైజ్​ ఫీచర్​'ను తీసుకువస్తోంది. ఇది ఎంతటి పెద్ద మెయిల్​నైనా చాలా సింపుల్​గా సమ్మరైజ్​ చేసి మీకు చూపించనుంది.

ప్రస్తుతానికి నయా ఫీచర్​కు సంబంధించిన బటన్ జీ-మెయిల్​ వెబ్​ వెర్షన్స్​లో మాత్రమే కనిపిస్తోంది. త్వరలోనే దీనిని ఆండ్రాయిడ్​ మొబైల్​ యూజర్స్​కు కూడా అందుబాటులోకి రానుంది.​

జీ-మెయిల్​ నయా ఫీచర్​ వివరాలివి!

  • గూగుల్ కంపెనీ ఈ Summarize This Email ఫీచర్​కు ఏఐ సాంకేతికతను జోడిస్తోంది. అందువల్ల లెంగ్తీ మెయిల్స్​ను కూడా బాగా సమ్మరైజ్ చేసి ఇది చూపిస్తుంది.
  • ఈ ఫీచర్​ను జెమిని అనే చాట్​బాట్​ సాయంతో తయారు చేస్తోంది గూగుల్​. ఇది ఇప్పటికే జీమెయిల్​ వెబ్​ వెర్షన్‌లో ఉంది. అయితే ఇది Gemini for Workspace Suite వినియోగదారులకు మాత్రమే ప్రత్యేకం.
  • ఈ-మెయిల్​ థ్రెడ్స్​లోని త్రీ డాట్స్​ మెనూలో జెమిని యూజర్స్​ కోసం ప్రత్యేకంగా ఎంపిక చేసిన ఈ ఫీచర్​ కనిపిస్తుంది. అయితే ప్రస్తుతానికి ఇందులో ఎలాంటి సమ్మరైజ్డ్​ కంటెంట్​ను మనం చూడలేము.
  • ఆండ్రాయిడ్‌లోని జీమెయిల్​ యాప్​లో త్వరలో రానున్న ఈ ఏఐ ఆధారిత స్మార్ట్​ ఫీచర్​ను వాడటం వల్ల మీ సమయం ఆదా అవుతుంది. పెద్ద మెయిల్స్​ను మీ సమయం మొత్తం వెచ్చించి చదవాల్సిన పనిలేదు. కేవలం సమ్మరైజ్ చేసిన ముఖ్యమైన పాయింట్లు చదువుకుంటే సరిపోతుంది.
  • ఈ ఫీచర్‌ను జీ-మెయిల్​ వెబ్​ యాప్​ వెర్షన్ 2024.03.31.621006929లో చూడవచ్చు.
  • గూగుల్​ సపోర్ట్​ పేజ్​ ప్రకారం 'సమ్మరైజ్ దిస్ మెయిల్​' ఫీచర్​ కేవలం రెండు కంటే ఎక్కువ రిప్లైలు వచ్చిన ఇ-మెయిల్​ థ్రెడ్స్​​కు మాత్రమే వర్తిస్తుంది.
  • అయితే ఈ కొత్త ఫీచర్​ ప్రధానంగా ఎంటర్‌ప్రైజెస్​ వినియోగం కోసం తయారు చేస్తున్నట్లు సమాచారం.
  • జెమిని వర్క్​స్పేస్​ సూట్​ యూజర్స్​కు మాత్రమే ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఈ సమ్మరైజ్​ ఇ-మెయిల్స్​ ఆప్షన్​ను వాడేందుకు ఇ-మెయిల్​​లోని 'Ask Gemini Button'పై క్లిక్​ చేయాలి. అనంతరం సజెషన్స్​తో ఉన్న ఓ సైడ్​బార్​ ఓపెన్​ అవుతంది. ఆ తర్వాత తదుపరి యాక్షన్​ను కొనసాగించవచ్చు.

మీ ఫోన్ బ్యాటరీ హెల్త్ చెక్ చేయాలా? ఈ సింపుల్ టిప్స్ ఫాలో అవ్వండి! - How To Check Phone Battery Health

వీడియో ఎడిటింగ్​కు ఉపయోగపడే టాప్​-6 ఫ్రీ ఏఐ టూల్స్ ఇవే! - Free AI Tools For Video Editing

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.