ETV Bharat / technology

చాట్​జీపీటీకి పోటీగా యాపిల్ 'Ask' ఏఐ టూల్ - లాంఛ్ ఎప్పుడంటే?

author img

By ETV Bharat Telugu Team

Published : Feb 24, 2024, 2:19 PM IST

google launched Gemma
Apple AI Tool Ask

Apple AI Tool Ask : యాపిల్ కంపెనీ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) పోరులోకి దిగింది. చాట్​జీపీటీ, జెమినీలకు పోటీగా 'Ask' పేరిట ఒక ఏఐ టూల్​ను అభివృద్ధి చేసింది. ప్రస్తుతం టెస్టింగ్​ దశలో ఉన్న ఈ టూల్​ను త్వరలోనే లాంఛ్ చేసే అవకాశం ఉంది. మరోవైపు గూగుల్ కంపెనీ 'జెమ్మా', గూగుల్ క్రోమ్​లో 'హెల్ప్​ మీ రైట్'​ అనే ఏఐ టూల్స్​ను తీసుకువచ్చింది.

Apple AI Tool Ask : యాపిల్​ కంపెనీ తమ యూజర్ల కోసం ఎప్పటికప్పుడు సరికొత్త అప్​డేట్స్ తీసుకువస్తూ ఉంటుంది. అందులో భాగంగా చాట్​జీపీటీని పోలిన Ask అనే ఏఐ టూల్​ను అభివృద్ధి చేసింది. ప్రస్తుతం దీనిని తమ సపోర్ట్​ స్టాఫ్​తో టెస్ట్ చేయిస్తోంది.

ట్రైనింగ్ ఇస్తున్నారు!
యాపిల్ కంపెనీ ఈ 'ఆస్క్' ఏఐ టూల్​కు చాలా సంక్లిష్టమైన ప్రశ్నలు వేసి, సరైన సమాధాలు ఇచ్చేలా ట్రైన్ చేస్తోంది. అయితే దీనిని చాట్​జీపీటీలా అందరికీ అందుబాటులోకి తేవడం లేదు. కేవలం యాపిల్ యూజర్ల కోసం మాత్రమే దీనిని తీసుకువస్తున్నారు.

లాంఛ్ ఎప్పుడు?
యాపిల్ కంపెనీ ఈ 2024లోనే ఈ 'ఆస్క్' ఏఐ టూల్​ను లాంఛ్ చేసే అవకాశం ఉంది. బహుశా WWDC 2024లోనే దీనిపై ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

'సిరి'కి ఏఐ బూస్ట్​
యాపిల్ కంపెనీ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ అభివృద్ధిపై పూర్తి స్థాయిలో దృష్టి కేంద్రీకరించింది. అందులో భాగంగా యాపిల్ జీపీటీ అనే కొత్త ఏఐ చాట్​బాట్​ను రూపొందించింది. అలాగే వాయిస్ అసిస్టెంట్​ 'సిరి'ని కూడా ఏఐతో అనుసంధానం చేస్తోంది. అంతేకాదు ఐఓఎస్​ 18తోనూ ఏఐను అనుసంధానం చేస్తోందని తెలుస్తోంది. అయితే ఈ విషయంలో యాపిల్ కంపెనీ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు.

Google Gemma : గూగుల్ కంపెనీ Gemma పేరుతో ఒక సరికొత్త ఏఐ మోడల్​ను విడుదల చేసింది. 'జెమ్మా' అనే ఈ లాటిన్ పదానికి 'విలువైన రాయి' అనే అర్థం ఉంది.

ఈ జెమ్మా ఏఐ మోడల్​ అనేది సురక్షితమైన ఏఐ అప్లికేషన్లు రూపొందించడానికి చాలా అనువుగా ఉంటుంది. కనుక డెవలపర్లకు ఇది బాగా ఉపయోగపడుతుందని గూగుల్ కంపెనీ చెబుతోంది.

Google Chrome 'Help me write' Feature : గూగుల్ క్రోమ్​ 'హెల్ప్​ మీ రైట్​' అనే ఏఐ ఫీచర్​ను తీసుకువచ్చింది. దీనిని మ్యాక్​, విండోస్ పీసీల్లో ఉపయోగించుకోవచ్చు. దీని ద్వారా మీరు కోరుకున్న టెక్ట్స్​ను పొందవచ్చు. లేదా ఇప్పటికే రాసిన వ్యాసాన్ని మెరుగుపరుచుకోవచ్చు.

గూగుల్​కు షాక్! X-mailను తీసుకొస్తున్న ఎలాన్ మస్క్

చాట్​జీపీటీకి పోటీగా రిలయన్స్ 'హనుమాన్​' ఏఐ మోడల్​- లాంఛ్​ ఎప్పుడంటే?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.