ETV Bharat / state

అతి పెద్ద డ్రగ్స్ లింక్‌ను ఛేదించిన పంజాగుట్ట పోలీసులు - ఇద్దరు అరెస్టు - Drug Smugglers Arrested

author img

By ETV Bharat Telangana Team

Published : Mar 26, 2024, 9:34 AM IST

Two Drug Dealers Arrested in Panjagutta : డ్రగ్స్ దందాపై రోజురోజుకు పోలీసుల నిఘా పెరుగుతుంది. తాజాగా డ్రగ్స్ దందాలో దేశంలోనే ఓ కీలక ముఠా పోలీసులకు చిక్కింది. గోవా నుంచి భాగ్య నగరానికి డ్రగ్స్​ సరఫరా చేస్తున్న నిందితుడి సహా మత్తు పదార్థాలు విక్రయిస్తున్న మరో వ్యక్తిని పంజాగుట్ట పోలీసులు అరెస్టు చేశారు.

Panja Gutta Police Bust Drug Rocket
Panja Gutta Police Bust Drug Rocket

మరో కీలక డ్రగ్స్​ ముఠా గుట్టురట్టు- ఇద్దరిని అరెస్ట్​ చేసిన పంజాగుట్టు పోలీసులు

Two Drug Dealers Arrested in Panjagutta : మాదక ద్రవ్యాల దందాలో దేశంలోని మరో కీలక ముఠా పోలీసులకు చిక్కింది. ముంబయి, దిల్లీ, బెంగళూరు, హైదరాబాద్‌తో ముడిపడ్డ నెట్‌వర్క్‌ను పంజాగుట్ట పోలీసులు ఛేదించారు. గోవా నుంచి భాగ్యనగరానికి తరచూ డ్రగ్స్ సరఫరా చేస్తున్న నిందితుడు సహా భారీగా మత్తుపదార్థాలు విక్రయిస్తున్న మరో పాలస్తీనా వ్యక్తిని రెండు రోజుల క్రితం అరెస్టు చేశారు. దేశవ్యాప్తంగా డ్రగ్స్‌ పంపిణీ(Drug supplying) చేసే 14మంది స్మగ్లర్లు, హైదరాబాద్‌కు చెందిన 31 మంది వినియోగదారులు పేర్లు బయటపడ్డాయి.

Drug suppliers Arrest In Hyderabad : అరేబియాకు చెందిన సయీద్‌ అలీ మహ్మద్‌ అలియాస్‌ సయీద్‌ సిరియాలో ఉండేందుకు పాలస్తీనా శరణార్థిగా ప్రత్యేక గుర్తింపు కార్డు తీసుకున్నాడు. అదే సమయంలో సౌదీ అరేబియా నుంచి విద్యార్థి వీసా తీసుకుని సోదరుడితో కలిసి 2009లో హైదరాబాద్‌ వచ్చాడు. టోలిచౌకిలో నివాసముంటూ సైఫాబాద్‌ పీజీ కళాశాలలో డిగ్రీ, సెయింట్‌ మేరి కళాశాలలో ఎంబీఏ పూర్తి చేశాడు. వీసా గడువు ముగిసినా అక్రమంగా దేశంలో ఉంటూ 2018లో ఆధార్‌ కార్డు, పాన్‌కార్డు, బ్యాంకు ఖాతా సంపాదించాడు. కొన్నాళ్లుగా బంజారాహిల్స్‌లో ఉంటూ డ్రగ్స్‌కు అలవాటుపడ్డ సయీద్‌ నగరంలో విక్రయాలు(selling) మొదలుపెట్టాడు. గోవా, బెంగళూరు, ముంబయిలో ఉండే నైజీరియన్లు, ఇతర స్మగ్లర్ల నుంచి డ్రగ్స్‌ కొనుగోలు చేసి హైదరాబాద్‌లో అమ్ముతున్నాడు.

హైదరాబాద్​లో మరో డ్రగ్స్​ ముఠా - మైనర్​ బాలుడు సహా బీఫార్మసీ విద్యార్థి అరెస్ట్

Drug peddler Arrest In Hyderabad : ముంబయికి చెందిన రోమీ ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లి డ్రగ్స్‌కు అలవాటుపడ్డాడు. భారత్‌కు తిరిగొచ్చాక గోవాలో(Goa) ఉండే నైజీరియన్‌ క్రిస్‌ ద్వారా మత్తు పదార్థాలు తెప్పిస్తూ విక్రయాలు ప్రారంభించాడు. గతేడాది నుంచి సయీద్‌కు డ్రగ్స్‌ అమ్ముతున్నాడు. గతవారం సయీద్‌ 10 ఎక్స్‌టసీ మాత్రలు, 5గ్రాముల ఎండీఎంఏ, 100 గ్రాముల గంజాయి తెప్పించాలని రోమీని కోరాడు. గోవాలోని క్రిస్‌ దగ్గర కోనుగోలు చేసిన రోమీ ఈనెల 23న హైదరాబాద్‌ చేరుకున్నాడు.

పంజాగుట్ట మెట్రోస్టేషన్‌ వద్ద సయీద్‌కు విక్రయిస్తుండగా పోలీసులు ఇద్దర్ని అదుపులోకి తీసుకున్నారు. రోమీ, సయీద్‌లను పోలీసులు విచారించడంతో 14మంది డ్రగ్స్ విక్రేతలు, 31 మంది వినియోగదారుల పేర్లు బయటపడ్డాయి. మాదకద్రవ్యాలు, రెండు ఫోన్లు స్వాధీనం చేసుకున్న పోలీసులు నిందితులు ఇచ్చిన సమాచారం ఆధారంగా మరికొందరి అరెస్టు చేసేందుకు సిద్ధమవుతున్నారు.

Drugs in Hyderabad : డ్రగ్స్ పీడ విరగడ ఎలా?

Drug Peddlers Arrested In Hyderabad : మాదక ద్రవ్యాల రవాణా కింగ్‌పిన్‌ అరెస్ట్..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.