ETV Bharat / state

హైదరాబాద్​లో మరో డ్రగ్స్​ ముఠా - మైనర్​ బాలుడు సహా బీఫార్మసీ విద్యార్థి అరెస్ట్

author img

By ETV Bharat Telangana Team

Published : Jan 10, 2024, 6:26 PM IST

Hayathnagar Police Arrested Drug Gang : రాజస్థాన్​ నుంచి రాష్ట్రానికి మాదకద్రవ్యాలను తరిలిస్తున్న ముఠా అరెస్ట్​. ఇవాళ హయత్‌నగర్‌ పోలీసులు, ఎల్బీనగర్‌ ఎస్​వోటీ అధికారులు మాదకద్రవ్యాలను విక్రయిస్తున్న ఇద్దరిని అరెస్టు చేశారు. ఈ ముఠాలో ఒక మైనర్​ కాగా ఓ విద్యార్థి ఉన్నారు.

Hayathnagar Police Arrested Drug Gang
నగరంలో డ్రగ్స్​ ముఠా అరెస్ట్​ - పట్టుబడిన వారిలో ఓ మైనర్​ బాలుడు మరొకరు బీఫార్మసీ విద్యార్థి

Hayathnagar Police Arrested Drug Gang : మాదకద్రవ్యాలను ఇతర రాష్ట్రాల నుంచి హైదరాబాద్‌కు రవాణా చేస్తున్న ఇద్దరు సభ్యుల ముఠాను హయత్‌నగర్‌ పోలీసులు, ఎల్బీనగర్‌ ఎస్​వోటీ బృంద పోలీసులు అరెస్టు చేశారు. ముఠాలోని ఇద్దరిలో ఒకరు మైనర్‌ కాగా మరొకరు బీఫార్మసీ విద్యార్ధి. వీరిద్దరు రాజస్థాన్‌ రాష్ట్రానికి చెందిన వారు. రాజస్థాన్‌లోని జాలోర్‌ జిల్లాకు చెందిన అశోక్‌ కుమార్‌, జాలోర్‌ జిల్లా సర్వన గ్రామానికి చెందిన మైనర్‌ బాలుడు ఇద్దరు హెరాయిన్‌ సేవించడానికి అలవాటుపడ్డారు.

CP Sudheer Babu on Drug Gang : ఆ తర్వాత వారిద్దరు విక్రేతలుగా మారారు. హెరాయిన్‌ను(Heroin) రాజస్థాన్‌ నుంచి తీసుకువచ్చి నగరంలోని లారీ డ్రైవర్లు, విద్యార్థులకు విక్రయిస్తున్నట్టు రాచకొండ సీపీ సుధీర్‌బాబు తెలిపారు. రాజస్థాన్‌లో ఒక గ్రాము హెరాయిన్‌ 5 వేల రూపాయలకు కొనుగోలు చేసి హైదరాబాద్‌లో ఒక గ్రాము 10 నుంచి 12 వేల రూపాయలకు విక్రయిస్తున్నట్టు దర్యాప్తులో తేలింది. వీరిద్దరిని హయత్‌నగర్‌లో పోలీసులు అరెస్టు చేశారు. ఇద్దరు నిందితులు నగరంలో ఎవరెవరికి హెరాయిన్‌ మత్తు పదార్ధాలు విక్రయించారని, ఇంకా వీరి వెనుక ఎవరున్నారనే కోణంలో విచారణ జరుపుతున్నట్టు సీపీ సుధీర్‌బాబు చెప్పారు.

'మాదకద్రవ్యాలపై పోలీసులు చేపడుతున్న చెకింగ్​లో ఇవాళ ఇద్దరిని పట్టుకున్నాం. వారి నుంచి 80గ్రాముల హెరాయిున్​ను స్వాధీనం చేసుకున్నాం. వీటిని రాజస్థాన్​ నుంచి తరలిస్తున్నారు. దీనిపై పూర్తిస్థాయిలో విచారణ చేస్తున్నాం. వీరిద్దరిలో ఒకరు బీఫార్మసీ రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థి ఉన్నాడు. అతను రాజస్థాన్​ వాసి, ప్రస్తుతం నగరంలోని లంగర్​హౌస్​ ఉంటున్నాడు. పట్టుబడ్డ రెండో వ్యక్తి మైనర్​ బాలుడు కావడంతో పేరును ప్రకటించడం లేదు. వీరిద్దరు రాజస్థాన్​ నుంచి డ్రగ్స్​ను తీసుకుని రాష్ట్రంలో వివిధ రకాలుగా లారీ డ్రైవర్లుకు, విద్యార్థులకు సరఫరా చేస్తున్నారు. వీరి నుంచి ఎంత మంది డ్రగ్స్​ను తీసుకున్నారనే కోణంలో విచారణ చేస్తున్నాం' - సుధీర్‌బాబు, రాచకొండ సీపీ

నగరంలో డ్రగ్స్​ ముఠా అరెస్ట్​ - పట్టుబడిన వారిలో ఓ మైనర్​ బాలుడు మరొకరు బీఫార్మసీ విద్యార్థి

రాష్ట్రంలో మరో 2 డ్రగ్స్ గ్యాంగుల పట్టివేత, అరెస్టైన వారిలో 21 ఏళ్ల యువతి

డ్రగ్స్​పై పోలీసుల ఉక్కుపాదం - మూడు వేర్వేరు గ్యాంగుల పట్టివేత

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.