రాష్ట్రంలో మరో 2 డ్రగ్స్ గ్యాంగుల పట్టివేత, అరెస్టైన వారిలో 21 ఏళ్ల యువతి

author img

By ETV Bharat Telangana Team

Published : Jan 1, 2024, 10:14 PM IST

Young Woman Arrested for Selling Drugs

Young woman arrested for selling drugs : డ్రగ్స్​ దందా పోలీసుల నిఘా రోజురోజుకూ పెరుగుతోంది. నూతన సంవత్సర వేడుకల సందర్భంగా పోలీసులు చేపట్టిన తనిఖీల్లో డ్రగ్స్​ భారీ మొత్తంలో పట్టుబడ్డాయి. తాజాగా 2 వేర్వేరు కేసుల్లో 21 ఏళ్ల యువతితో పాటు ఆరుగురిని పోలీసులు పట్టుకున్నారు.

Young Woman Arrested for Selling Drugs : మాదక ద్రవ్యాలను కొనుగోలు చేసి విద్యార్థులకు విక్రయిస్తున్న ఓ 21ఏళ్ల యువతిని చాదర్‌ఘాట్‌ పోలీసులతో కలిసి సౌత్‌ ఈస్ట్‌టాస్క్‌ఫోర్స్‌ అధికారులు అరెస్టు చేశారు. ఈ యువతితోపాటు డ్రగ్స్‌ను కొనుగోలు చేసిన నలుగురు విద్యార్థులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి 8 గ్రాముల ఎండీఎంఏ(MDMA) డ్రగ్స్‌తో పాటు ఆరు చరవాణీలను స్వాధీనం చేసుకున్నామని మలక్‌పేట్ ఏసీపీ శ్యాంసుందర్ తెలిపారు.

సంతోష్‌నగర్​కు చెందిన అయేషా పిర్ధోస్ అనే 21 సంవత్సరాల యువతి న్యూ ఇయర్ వేడుకల(New Year celebrations) కోసం ముంబయికి వెళ్లి డ్రగ్స్‌ తీసుకొచ్చి విక్రయించిందని పోలీసులు పేర్కొన్నారు. ఈమె నుంచి డ్రగ్స్‌ కొనుగోలు చేసిన చాదర్‌ఘాట్‌కు(Chaderghat) చెందిన జాకీరుద్దీన్, సైదాబాద్ లోకాయుక్తా కాలనీ నివాసి మహ్మద్ ఆఫ్రాన్‌, కుర్మాగూడకు చెందిన ఆయాజ్‌ ఖాన్‌, సైదాబాద్ భానునగర్‌కు చెందిన షాబాజ్‌ షరీఫ్‌లను కూడా అరెస్టు చేసినట్లు ఏసీపీ వివరించారు.

న్యూ ఇయర్ వేడుకల వేళ డ్రగ్స్ స్మగ్లింగ్ - ఎక్కడికక్కడ సీజ్ చేస్తున్న పోలీసులు

Police Arrested 21 years old Men for Buying Drugs : డ్రగ్స్‌ విక్రయించిన యువతితో పాటు కొనుగోలు చేసిన యువకులు కూడా అందరూ 21 సంవత్సరాల వయస్సు ఉన్నవారేనని, ఇది ఆందోళన కలిగించే విషయమని పోలీసులు అన్నారు. ముంబయి(Mumbai) నుంచి డ్రగ్స్‌ తీసుకొచ్చిన అయేషాపై ఇంతకు ముందేమైనా కేసులు ఉన్నాయా, ఇంకా ఎవరెవరికి విక్రయించిందనే అంశాలపై దర్యాప్తు చేపడుతామని ఏసీపీ శ్యాంసుందర్ వివరించారు.

Police Seized Drugs in Nizamabad : మరోవైపు నిజామాబాద్‌ జిల్లాలో కూడా పోలీసులు డ్రగ్స్‌ స్వాధీనం చేసుకున్నారు. నిన్న రాత్రి చేపట్టిన వాహన తనిఖీల్లో డ్రగ్స్‌ పట్టుబడ్డాయి. జాతీయ రహదారి 44 పక్కన డిచ్​పల్లి(Dichipalli) మండలం నడిపల్లి తండా వద్ద లభించిన డ్రగ్స్‌ వివరాలను అదనపు డిప్యూటీ కమిషనర్‌ జయరాం వెల్లడించారు. డ్రగ్స్​ను తరలిస్తున్న ఇద్దరిని అరెస్టు చేసిన టాస్క్‌ఫోర్స్, డిచ్​పల్లి పోలీసులు 3.2 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్‌, 12.3 గ్రాముల కొకైన్‌, 3.1 గ్రాముల గాంజా పౌడర్‌ స్వాధీనం చేసుకున్నారు.

దిల్లీ నుంచి హైదరాబాద్​కు తరలిస్తుండగా పక్కా సమాచారంతో నిన్న రాత్రి నిజామాబాద్‌ టాస్క్‌ ఫోర్స్‌, డిచ్​పల్లి పోలీసులు చేపట్టిన వాహనాల తనిఖీల్లో డ్రగ్స్‌ పట్టుబడింది. స్కోడా కారు, మూడు సెల్‌ఫోన్​లతో పాటు డ్రగ్స్‌ తీసుకునేందుకు వినియోగించే వస్తువులు స్వాధీనం చేసుకున్నారు.

Drug Peddler Arrested on New Year Eve : ఆంధ్రప్రదేశ్​కు చెందిన ద్వారంపూడి విక్రం, షేక్‌ ఖాజా మోహినుద్దీన్​లు దిల్లీ నుంచి వస్తూ డ్రగ్స్‌ తీసుకు వస్తుండగా పట్టుబడ్డారు. కొత్త సంవత్సర వేడుకల సందర్భంగా ఈ డ్రగ్స్​ను స్నేహితులతో కలిసి తీసుకునేందుకు దిల్లీ(Delhi) నుంచి తెచ్చినట్టు విచారణలో వెల్లడైందని పోలీసులు వెల్లడించారు.

డ్రగ్స్​పై పోలీసుల ఉక్కుపాదం - మూడు వేర్వేరు గ్యాంగుల పట్టివేత

రాష్ట్రంలో డ్రగ్స్, నకిలీ విత్తనాలు అనే పదాలు వినిపించేందుకు వీల్లేదు - పోలీసులకు సీఎం కీలక ఆదేశాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.