ETV Bharat / state

వైఎస్సార్సీపీ నేత కుమారుడి రేవ్ పార్టీలో డ్రగ్స్ - ఎస్ఆర్ నగర్ మాదక ద్రవ్యాల కేసు దర్యాప్తులో గుర్తించిన పోలీసులు

author img

By ETV Bharat Telangana Team

Published : Dec 26, 2023, 10:12 AM IST

SR Nagar Drugs Case Latest Update : ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లా వైఎస్సార్సీపీ నాయకుడి కుమారుడు పుట్టినరోజున ఏర్పాటు చేసిన రేవ్ పార్టీ కోసమే గోవా నుంచి డ్రగ్స్ నగరానికి తీసుకొచ్చినట్టు టీఎస్ న్యాబ్ పోలీసుల దర్యాప్తులో గుర్తించారు. ఎస్ఆర్ నగర్ పరిధిలో నమోదైన డ్రగ్స్ కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. ఈ రేవ్ పార్టీలో పాల్గొన్న 10మందిలో ముగ్గురు డ్రగ్స్ వాడినట్లు పరీక్షల్లో నిర్ధారణ అయినట్లు పోలీసులు తెలిపారు. అటు ఆల్ఫాజోలంను అరికట్టేందుకు ముమ్మర దర్యాప్తు చేస్తున్నారు. హైదరాబాద్‌లో ఇప్పటివరకు 66 కేసులు నమోదు చేశారు.

Police Arrested Drug Gang in Hyderabad
SR Nagar Drugs Case

డ్రగ్స్‌ దందాలో కీలక నిందితుల అరెస్ట్ - ఆల్ఫాజోలంను అరికట్టేందుకు ముమ్మర దర్యాప్తు

SR Nagar Drugs Case Latest Update : కొత్త సంవత్సర వేడుకల నేపథ్యంలో డ్రగ్స్‌పై రాష్ట్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ పరిధిలో డ్రగ్స్ కేసులో టీఎస్ న్యాబ్‌ పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసులో ఇప్పటికే నెల్లూరికి చెందిన ఆశిక్‌, దుడ్డు రాజేష్​లను అరెస్టు చేసిన పోలీసులు నిందితుల నుంచి 34 ఎక్ట్సాసి పిల్స్ స్వాధీనం చేసుకున్నారు. ఎస్ఆర్ నగర్ పరిధిలో జరిగిన రేవ్ పార్టి కోసం 32 ఎక్ట్సాసి పిల్స్ వినియోగించినట్లు గుర్తించిన టీఎస్‌ న్యాబ్ పోలీసులు రేవ్‌ పార్టీకి హాజరైన పది మందిలో ముగ్గురికి డ్రగ్ పరీక్షలో పాజిటివ్ వచ్చినట్లు తెలిపారు.

TSNAB Police Found Drugs At YSRCP Leader's Son Rave Party : గోవాలో హనుమంత్ బాబుసో దివాకర్ అలియాస్ బాబా అనే వ్యక్తి వద్ద రూ.1000 నుంచి రూ.1200లకు ఒక్కో ఎక్స్టాసిపిల్స్ కొనుగోలు చేసిన నిందితులు రాజేష్, ఆశిక్​లు ఇక్కడ అధిక ధరకు విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. వీరిచ్చిన సమాచారంతో నాలుగు రోజుల కిందట గోవాలో బాబాను అరెస్ట్ చేసిన టీఎస్ న్యాబ్ పోలీసులు బాబానే హైదరాబాద్​కు ప్రధాన సరఫరాదారుడుగా గుర్తించారు.

అంతరాష్ట్ర గంజాయి​ ముఠా అరెస్టు - రాష్ట్రాన్ని డ్రగ్స్​ రహిత దిశగా చర్యలు

ఆశిక్‌, రాజేష్ అరెస్టు చేసి విచారిస్తున్న సమయంలో తరచూ తన వద్ద డ్రగ్స్ కొనుగోలు చేసే ఫిల్మ్ నగర్​లోని స్వదీప్ అనే డీజె ఆపరేటర్​ను బాబా అప్రమత్తం చేశాడు. విచారణలో భాగం వారం రోజుల కిందట స్వదీప్ రూ.1.4లక్షలతో 14 గ్రాముల కొకైన్ ను బాబా నుంచి కొనుగోలు చేసినట్లు తేలింది. ఈ కేసులోనే నెల్లూరు ఉడా ఛైర్మన్ కుమారుడు ప్రేమ్ చంద్ సహా 12 మందికి ఎస్ఆర్ నగర్‌ పోలీసులు నోటీసులు జారీ చేశారు. ప్రేమ్ చంద్‌ను కేసులో ఎ38గా చేర్చారు.

''మాదకద్రవ్యాల ముఖ్య సరఫదారు గోవాలో ఉన్నట్లు గుర్తించాం. అతని పేరు హనుమత్‌ బాబుసోదివకర్‌. గోవాలో పెద్ద మద్యం దుకాణదారుడు. మూడేళ్ల నుంచి డ్రగ్స్‌ దందా చేస్తున్నాడు. హైదరాబాద్‌లో 25 మందికి సరుకు చేరవేస్తున్నాడు. వారు మరో 25 మంది వినియోగదారులకు డ్రగ్స్‌ సరఫరా చేస్తున్నట్లు గుర్తించాం. నాలుగు రోజుల పరిశీలన తర్వాత దివకర్‌ను అరెస్టు చేశాం. దేశం మొత్తంలో ఆరుగురు బడా డ్రగ్స్‌ సరఫదారులున్నట్లు గుర్తించాం. ఆ ఆరుగురు పెద్ద వ్యాపారులపైనా ప్రత్యేక దృష్టిసారించాం.'' - సందీప్ శాండిల్య టీఎస్‌ న్యాబ్‌, డైరెక్టర్‌

రాష్ట్రంలో డ్రగ్స్‌ కట్టడిపై టీఎస్‌న్యాబ్‌ ఫోకస్ - బ్రీత్ ఎనలైజర్ తరహా కిట్లతో తనిఖీలకు సమాయత్తం

TSNAB Focus on Drugs Control in Telangana : మాదకద్రవ్యాల్లో ఆల్ఫాజోలం కొకైన్ కంటే ప్రమాదకరమని అక్రమంగా విక్రయిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని టీఎస్ న్యాబ్ డైరెక్టర్ సందీప్ శాండిల్య తెలిపారు. రాష్ట్రంలో అల్ఫాజోలం తలనొప్పిగా మారిందన్నారు. అల్ఫాజోలం రవాణా, పలువురి చేతులు మారటంపై ప్రత్యేక దృష్టి పెట్టామని ఆయన తెలిపారు. ఇటీవల రూ.3.14 కోట్ల రూపాయలు విలువ చేసే 31.42 కిలోల ఆల్ఫాజోలంను నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లిలో పట్టుకున్నారు. ఈ సమాచారం ఆధారంగా టీఎస్ న్యాబ్ పోలీసులు రెండు రోజుల కిందట సంగారెడ్డి జిన్నారంలోని మూతపడిన పరిశ్రమలో 14కిలోల నార్డజెపమ్ డ్రగ్ పట్టుబడిందని తెలిపారు. ఈ కేసులో నలుగురుని అరెస్టు చేసినట్లు వివరించారు.

Sandeep Shandilya on Drugs Control in Telangana : మరో కేసులో సూరారం పరిధిలో నరేందర్ అనే వ్యక్తి నుంచి పది కిలోల ఆల్ఫాజోలం స్వాధీనం చేసుకున్నామని ఇతను విజయవాడ పరమేశ్వరా కెమికల్స్ ఎండి చెందిన కిరణ్ కుమార్ అనే వ్యక్తి నుంచి కొనుగోలు చేసినట్లు గుర్తించామన్నారు. చర్లపల్లిలో ఓ పరిశ్రమను లీజ్​కు తీసుకుని లింగయ్య గౌడ్​తో కలిసి కిరణ్‌ ఆల్ఫాజోలం తయారు చేస్తున్నారన్నారు. మరో కేసులో విధుల నుంచి తొలగించబడిన ఏఆర్‌ కానిస్టేబుల్‌ కూడా ఈ దందాలో ఉన్నట్లు గుర్తించాంమని తెలిపారు. హైదరాబాద్ లో ఇప్పటి వరకూ 66కేసులు నమోదు చేసినట్లు ఆయన వివరించారు.

హైదరాబాద్​లో పెరిగిన నేరాలు - డ్రగ్స్, భూదందాలపై ఉక్కుపాదం మోపుతాం : సీపీ శ్రీనివాస్​ రెడ్డి

భాగ్యనగరంలోకి న్యూ ఇయర్ డ్రగ్స్ - అడుగడుగునా నిఘాతో పోలీసుల స్పెషల్ డ్రైవ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.