ETV Bharat / snippets

'సంయుక్త ప్లీజ్ రావొచ్చుగా'- హీరోయిన్​కు SRH ఫ్యాన్స్ రిక్వెస్ట్!

author img

By ETV Bharat Telugu Team

Published : May 26, 2024, 12:17 PM IST

Samyuktha Menon IPL
Samyuktha Menon IPL (Source: ETV Bharat)

Samyuktha Menon IPL 2024: టాలీవుడ్ బ్యూటీ సంయుక్త మేనన్ ప్రస్తుతం ఐపీఎల్ టోర్నమెంట్​ ఎంజాయ్ చేస్తోంది. ఇటీవల సన్​రైజర్స్ ఆడిన రెండు మ్యాచ్​లకు స్టేడియానికి వెళ్లి మరీ హైదరాబాద్​ను సపోర్ట్ చేసింది. ఈ ముద్దుగుమ్మ సన్​రైజర్స్​ జెండాలు పట్టుకొని స్టేడియంలో సందడి చేసింది. విశేషం ఏమిటంటే ఈమె హాజరైన రెండు మ్యాచ్​ (పంజాబ్​తో, క్వాలిఫయర్- 2)ల్లో సన్​రైజర్స్ నెగ్గింది. దీంతో ఈమె ఫైనల్ మ్యాచ్​కు వస్తే కప్పు హైదరాబాదే అని ఫ్యాన్స్ సోషల్ మీడియాలో మీమ్స్ క్రియేట్ చేస్తున్నారు. మరి ఫ్యాన్స్ కోరిక మేరకు సంయుక్త ఆదివారం మ్యాచ్​కు హాజరవుతుందో లేదో చూడాలి. కాగా, సంయుక్త ప్రస్తుతం 'స్వయంభు' సినిమాలో నటిస్తోంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.