ETV Bharat / state

రూ.15 లక్షల విలువైన ఆల్ఫాజోలం పట్టివేత - ముగ్గురి అరెస్ట్ - Alprazolam CASES IN TELANGANA

author img

By ETV Bharat Telangana Team

Published : Mar 25, 2024, 11:42 AM IST

Police Seized Alprazolam in Rangareddy District : రంగారెడ్డి జిల్లా కొత్తూరు వద్ద ఆల్ఫాజోలం తరలిస్తున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి రూ.15 లక్షల విలువైన కిలో ఆల్ఫాజోలంను స్వాధీనం చేసుకున్నారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Police Seized Alprazolam
Police Seized Alprazolam

Police Seized Alprazolam in Rangareddy District : రాష్ట్రంలో డ్రగ్స్‌, గంజాయి అనే మాట వినబడడానికి వీల్లేదని, మత్తు పదార్థాలపై ఉక్కుపాదం మోపాలన్న సీఎం రేవంత్​రెడ్డి ఆదేశాలతో పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. మాదకద్రవ్యాల విక్రయం, అక్రమ రవాణాపై నిఘా పెట్టి కొరడా ఝుళిపిస్తున్నారు. ఇందులో భాగంగానే తాజాగా కల్తీ కల్లు తయారీకి ఉపయోగించే ఆల్ఫాజోలం, గుల్ఫారం అక్రమ రవాణా చేస్తున్న ముఠాను సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు పట్టుకున్నారు.

Alprazolam Smuggling in Telangana : రంగారెడ్డి జిల్లా కొత్తూరు పోలీస్​స్టేషన్ పరిధిలో సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు వాహనాలను తనిఖీలు చేస్తున్నారు. ఈ క్రమంలో అటుగా వచ్చిన మారుతి స్విఫ్ట్ కారులో సోదాలు చేయగా కిలో ఆల్ఫాజోలం (Alfazolam Smuggling in TS) , గుల్ఫారం ఉన్నట్లు గుర్తించారు. ఈ ఘటనలో ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. స్వాధీనం చేసుకున్న వాటి విలువ రూ.15 లక్షలు ఉంటుందని అంచనా వేశారు. నాగర్​కర్నూల్‌కు చెందిన నర్సింహులు ఆల్ఫాజోలం తయారు చేస్తునట్లు పోలీసులు నిర్ధారించారు.

DRI Officers Seize Psychotropic Substances : రూ.3.14 కోట్ల విలువైన ఆల్ఫ్రాజోలమ్‌ స్వాధీనం

నర్సింహులు నుంచి నిందితులు ఆల్ఫాజోలం సేకరించి వివిధ జిల్లాల్లోని కల్లు దుకాణాలకు విక్రయిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ అక్రమ రవాణా ద్వారా వచ్చిన నగదుతో నిందితుడు అనిల్ గౌడ్ మారుతి స్విఫ్ట్ కారును కొనుగోలు చేసినట్లు పేర్కొన్నారు. స్వాధీనం చేసుకున్న కేజీ ఆల్ఫాజోలం 6 లక్షల లీటర్ల కల్లులో కలపడానికి సరిపోతుందని వివరించారు. సుమారు 600 లీటర్లలో దీనిని ఒక గ్రాము కలుపుతారని వెల్లడించారు. నిందితుల నుంచి 3 సెల్​ఫోన్లు, ఓ కారు స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పిన పోలీసులు మరోవైపు కల్తీ కల్లును సేవించిన రోజువారీ కూలీలు ఎన్నో రుగ్మతలకు లోనవుతున్నారని అన్నారు.

కల్తీ కల్లు కోసం వాడే 10 కిలోల సోడియం స్వాధీనం

కల్తీ కల్లు వల్ల మెదడుపై తీవ్ర ప్రభావం : మరోవైపు క్లోరో హైడ్రేట్‌(సీహెచ్‌), ఆల్ఫాజోలం, గుల్ఫారం తదితరాలతో తయారు చేసిన కల్లును సేవించినప్పుడు ఎక్కువగా మత్తు వస్తోందని వైద్యులు చెబుతున్నారు. దీనికి అలవాటైన వారు బానిసలుగా మారుతున్నారని అంటున్నారు. దీని తయారీకి వినియోగించే పదార్థాలు మెదడుపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయని తెలియజేస్తున్నారు. తద్వారా ఆరోగ్యం క్రమంగా క్షీణిస్తోందని, ఒక్కరోజు కల్లు తాగకపోయినా పిచ్చెక్కినట్లు ప్రవర్తిస్తుంటారని పేర్కొంటున్నారు. ఒక్కోసారి మత్తు పదార్థాలను మోతాదు మించి కలిపిన కల్లు తాగినవాళ్లు చనిపోతున్నారని వైద్యులు వివరిస్తున్నారు.

రూ.15 లక్షల విలువైన ఆల్ఫాజోలం పట్టివేత

ఉమ్మడి పాలమూరు జిల్లాలో క‌ల్తీ క‌ల్లు క‌ల్లోలం.. 33 మంది ఆసుపత్రి పాలు

దొంగతనం చేసి కల్లు తాగారు... వింత చేష్టలతో ఆస్పత్రి పాలయ్యారు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.