ETV Bharat / crime

దొంగతనం చేసి కల్లు తాగారు... వింత చేష్టలతో ఆస్పత్రి పాలయ్యారు

author img

By

Published : Apr 6, 2021, 3:52 PM IST

సరదాగా... ఈత వనంలో ఉన్న కల్లు దొంగిలించారు. ఇంట్లో పిల్లల దగ్గర్నుంచి అందరూ ఆహ్లాదంగా ఆ కల్లును సేవించారు. అప్పటివరకు బాగానే ఉంది. కాసేపయ్యాక... అందరూ వింతగా ప్రవర్తించటం ప్రారంభించారు. కిందపడి దొర్లుతున్నారు. గమనించిన స్థానికులు ఆస్పత్రికి తీసుకెళ్లాగా... అసలు విషయం బయటికొచ్చింది.

hospitalized after drinking adulterous toddy in pedda kothapalli mandal
దొంగతనం చేసి కల్లు తాగారు... వింత చేష్టలతో ఆస్పత్రి పాలయ్యారు

కల్లు తాగిన కొంత మంది వింత చేష్టలు చేస్తూ... ఆస్పత్రి పాలైన ఘటన నాగర్​కర్నూల్​ జిల్లా పెద్దకొత్తపల్లి మండలం చిన్న కార్పాములలో జరిగింది. గ్రామానికి చెందిన బంగారయ్య, మల్లయ్య అనే వ్యక్తులు గ్రామ పరిసరాల్లో ఉన్న ఈత వనంలో కల్లు దొంగిలించి ఇంటికి తీసుకొచ్చారు. కుటుంబ సభ్యులందరితో కలిసి ఆ కల్లును సేవించారు. కల్లు తాగిన కొద్దిసేపటికే కుటుంబసభ్యులంతా వింతవింతగా ప్రవర్తిస్తూ... పిచ్చి చేష్టలు చేయటం మొదలుపెట్టారు.

ఈ విషయాన్ని గమనించిన చుట్టుపక్కల వ్యక్తులు... పోలీసులకు సమాచారం ఇచ్చారు. అంబులెన్స్​లో స్థానిక ఆస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం బాధితులను జిల్లా ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. వింత చేష్టలతో బాధితులు చికిత్సకు సహకరించకపోవటం వల్ల... వైద్యులు ఇబ్బంది పడాల్సివచ్చింది. ఈ ఘటనలో ఆరుగురు అస్వస్థత చెందగా... ఇందులో నాలుగురి పరిస్థితి సాధారణంగా ఉందని వైద్యులు తెలిపారు. మిగతా ఇద్దరి పరిస్థితి విషమంగా మారటం వల్ల మహబూబ్​నగర్​ జిల్లాస్పత్రికి తరలించామన్నారు. కల్లులో ఓ రకమైన మత్తు పదార్థాలు కలిసినట్లు వైద్యులు నిర్ధరించారు.

దొంగతనం చేసి కల్లు తాగారు... వింత చేష్టలతో ఆస్పత్రి పాలయ్యారు

ఇదీ చూడండి: వాటర్ బాటిల్ తెచ్చుకుంటానని చెప్పి భార్య పరార్​.!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.