ETV Bharat / state

కాంగ్రెస్ ఇచ్చిన గ్యారంటీలకు, ప్రవేశపెట్టిన బడ్జెట్​కు పొంతనలేదు : కడియం శ్రీహరి

author img

By ETV Bharat Telangana Team

Published : Feb 14, 2024, 12:28 PM IST

Updated : Feb 14, 2024, 1:54 PM IST

MLA Kadiyam Srihari on Six Guarantees Budget : కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక డిసెంబర్‌ 9న రైతు రుణమాఫీ చేస్తామన్నారు కానీ ఇంతవరకూ దాని గురించి ఏం చెప్పలేదని బీఆర్ఎస్​ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ప్రశ్నించారు. కాంగ్రెస్‌ ఇచ్చిన హామీలకు ఏడాదికి లక్షా 36వేల కోట్లు అవసరమని, రుణమాఫీ సహా డిక్లరేషన్లకు అయ్యే వ్యయం అదనమని అన్నారు.

Kadiyam Srihari Assembly Speech
MLA Kadiyam Srihari on Six Guarantees

కాంగ్రెస్ ఇచ్చిన గ్యారంటీలకు, ప్రవేశపెట్టిన బడ్జెట్​కు పొంతనలేదు కడియం శ్రీహరి

MLA Kadiyam Srihari on Six Guarantees Budget : కాంగ్రెస్‌ ఆరు గ్యారెంటీల పేరిట 13 హామీలు ఇచ్చిందని బీఆర్ఎస్​ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. లోక్‌సభ ఎన్నికల కోడ్‌ రాగానే హామీల విషయంలో చేతులెత్తేసే పనిలో హస్తం పార్టీ ఉందని ఆరోపించారు. వచ్చే ఆరు మాసాల్లో కూడా ఇచ్చిన హామీలు అమలు చేసేలా లేదని మండిపడ్డారు. కాంగ్రెస్​ ఇచ్చిన గ్యారెంటీల్లో భాగంగా నిరుద్యోగ యువతకు రూ.4 వేలు ఇస్తామన్నారని కానీ దీని గురించి బడ్జెట్​లో ప్రస్తావన లేదని తెలిపారు. యువతకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని, జాబ్​ క్యాలెండర్(Telangana Job Calendar)​ ప్రకటిస్తామన్న విషయాన్ని గుర్తు చేశారు. వీటికి కూడా బడ్జెట్​లో ఎక్కడా కేటాయింపులు లేవని వెల్లడించారు.

Kadiyam Srihari Assembly Speech : ఎస్సీ, ఎస్టీలకు బీఆర్​ అంబేడ్కర్‌ అభయ హస్తం పేరుతో రూ.12 లక్షలు ఆర్థికసాయం చేస్తామన్నారని, కానీ బడ్జెట్​లో ఎక్కడా చూపించలేదని కడియం శ్రీహరి అన్నారు. తమ ప్రభుత్వం ప్రవేశపెట్టిన దళిత బంధు పథకాన్నే అంబేడ్కర్‌ అభయ హస్తంగా పేరు మార్చారని పేర్కొన్నారు. సరూర్‌నగర్‌లో ప్రియాంక గాంధీ యువత డిక్లరేషన్‌ ప్రకటించారని, అవే కాకుండా ఇంకా చాలా డిక్లరేషన్లు ప్రకటించారని కానీ వాటి గురించి ప్రస్తావన లేదని అన్నారు. బీసీలకు బడ్జెట్‌లో లక్షల కోట్లు ఖర్చు చేస్తామన్నారని లెక్కల్లో చూపించలేదని మండిపడ్డారు.

అద్దెకు ఉండే వారికీ 'గృహజ్యోతి' వర్తింపు - ముమ్మరంగా వినియోగదారుల వివరాల సేకరణ

'చేయూత పథకానికి ఏడాదికి రూ.30వేల కోట్లు కావాలి. బీఆర్ఎస్​ పాలనలో పరిశ్రమలు, ఐటీ నుంచి 26లక్షల ఉద్యోగాలు ఇచ్చాం. డిసెంబర్‌ 9న రుణమాఫీ చేస్తామన్నారు. ఇప్పటికీ చేయలేదు. రైతు రుణమాఫీని ఏ విధంగా ఎప్పటిలోగా చేస్తారో స్పష్టత ఇవ్వాలి. కాళేశ్వరం ద్వారా కొత్త ఆయకట్టతో పాటు స్థిరీకరణ జరిగింది. ఈ విషయంలో గోరంతను కొండంత చేసి ప్రజలను తప్పుదోవ పట్టించవద్దు. ఈ ప్రాజెక్ట్​ ద్వారా అనేక రిజర్వాయర్లు వచ్చాయి. నీటి నిల్వ సామర్థ్యం పెంచుకున్నాం'- కడియం శ్రీహరి, బీఆర్ఎస్​ ఎమ్మెల్యే

Telangana Budget Sessions 2024 : కాంగ్రెస్​ ప్రభుత్వం వంద రోజుల్లో హామీలు అమలు చేస్తామన్నారని కడియం శ్రీహరి గుర్తు చేశారు. హామీలకు ఏడాదికి రూ.1.36 లక్షల కోట్లు అవసరమవుతాయని అన్నారు. రుణమాఫీ సహా కాంగ్రెస్‌ ప్రకటించిన డిక్లరేషన్లకు అయ్యే వ్యయం అదనమని పేర్కొన్నారు. నియోజకవర్గానికి 3,500 ఇళ్ల మంజూరు చేస్తామని బడ్జెట్‌లో చెప్పారని, 119 నియోజకవర్గాల్లో 4.16 లక్షల ఇళ్లకు రూ.24 వేల కోట్లు అవసరమవుతాయని కానీ ఇళ్ల కోసం కేవలం రూ.7 వేల కోట్లు మాత్రమే కేటాయించారని తెలిపారు. మహాలక్ష్మి పథకం(Mahalaxmi Scheme) కింద ప్రతి మహిళకు రూ.2500 ఇస్తామన్నారని, కేవలం ఇంటికి ఒక్కరికే రూ.2500 ఇచ్చినా రూ.20 వేల కోట్లు అవసరమవుతాయన్న కడియం, రూ.2500 ఇచ్చే అంశాన్ని బడ్జెట్‌లో చూపించలేదన్నారు.

Minister Sridhar Babu Reaction on Kadiyam Speech : కడియం వ్యాఖ్యలపై స్పందించిన మంత్రి శ్రీధర్ బాబు వంద రోజుల్లో తమ పార్టీ ఇచ్చిన హామీలు అమలు చేస్తామని చెప్పామని తెలిపారు. తాము అధికారంలోకి వచ్చిన మూడో రోజు నుంచే అమలు చేయడం లేదని బీఆర్ఎస్(BRS)​ విమర్శిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్​ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందని కచ్చితంగా హామీలు అమలు చేసితీరుతామని స్పష్టం చేశారు. హామీలు అమలు చేయవద్దన్న అభిప్రాయంతో బీఆర్ఎస్​ ఉందని ఆరోపించారు. కడియం శ్రీహరి విమర్శలకు కాకుండా సూచనలు ఇస్తే స్వీకరిస్తామని శ్రీధర్ బాబు బదులిచ్చారు.

త్వరలో మరో 2 గ్యారంటీల అమలుకు శ్రీకారం - కార్యాచరణ సిద్ధం చేయాలని అధికారులకు సీఎం ఆదేశం

ఆరు గ్యారంటీలకే బడ్జెట్​లో పెద్దపీట - మొత్తం ఎన్ని నిధులు కేటాయించారో తెలుసా?

Last Updated :Feb 14, 2024, 1:54 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.