త్వరలో మరో 2 గ్యారంటీల అమలుకు శ్రీకారం - కార్యాచరణ సిద్ధం చేయాలని అధికారులకు సీఎం ఆదేశం

author img

By ETV Bharat Telangana Team

Published : Feb 1, 2024, 7:26 PM IST

Updated : Feb 1, 2024, 9:35 PM IST

Praja Palana Programe

CM Revanth Reddy Review on Prajapalana Applications : ఆరు గ్యారంటీల్లో మరో రెండింటిని త్వరలో అమలు చేయనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. గ్యాస్ సిలిండర్, ఉచిత విద్యుత్, ఇందిరమ్మ ఇళ్ల పథకాల్లో రెండింటి అమలు కోసం అవసరమైన కార్యాచరణ సిద్ధం చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఇవాళ సచివాలయంలో ప్రజాపాలన దరఖాస్తులపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు.

CM Revanth Reddy Review on Prajapalana Applications : త్వరలో మరో రెండు గ్యారంటీల అమలుకు శ్రీకారం చుట్టనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) వెల్లడించారు. గ్యాస్ సిలిండర్, ఉచిత విద్యుత్, ఇందిరమ్మ ఇళ్ల పథకాల్లో రెండింటిని త్వరలో అమలు చేసేందుకు అవసరమైన కార్యాచరణ సిద్ధం చేయాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. ప్రజాపాలన దరఖాస్తులు, ఆరు గ్యారంటీలపై మంత్రివర్గ ఉపసంఘంతో సచివాలయంలో సీఎం సమీక్ష నిర్వహించారు.

ఏడాదిలోపు 2 లక్షల ఉద్యోగాల భర్తీ : సీఎం రేవంత్‌ రెడ్డి

CM Revanth Plan to Implement Two Guarantees : అయిదు వందల రూపాయలకు గ్యాస్ సిలిండర్, ఇందిరమ్మ ఇళ్లు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు పథకాలపై సీఎం చర్చించారు. ఒక్కో గ్యారంటీ పథకానికి అయ్యే ఖర్చు, లబ్ధిపొందే వారి సంఖ్య తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ మూడు గ్యారంటీల అమలుకు అవసరమైన కార్యాచరణ ప్రణాళికతో సిద్ధంగా ఉండాలన్న సీఎం, వీటిలో రెండింటిని మాత్రం వెంటనే అమలు చేసేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు.

వాటికి అవసరమైన నిధులను బడ్జెట్​లో కేటాయించాలని ఆర్థిక శాఖకు సీఎం తెలిపారు. అసెంబ్లీ సమావేశాల్లోగా మరోసారి కేబినేట్ సబ్ కమిటీతో సమావేశమై తుది నిర్ణయం తీసుకుంటామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. గత డిసెంబర్ 28 నుంచి జనవరి 6 వరకు జరిగిన ప్రజాపాలన సదస్సుల్లో(Praja Palana) అయిదు గ్యారంటీల కోసం వచ్చిన కోటీ 9 లక్షల దరఖాస్తుల డేటా ఎంట్రీ, జనవరి 12 నాటికే పూర్తయినట్లు సీఎంకు అధికారులు వివరించారు.

తాగునీటి కోసం ప్రతీ నియోజకవర్గానికి కోటి రూపాయల ప్రత్యేక నిధులు: సీఎం రేవంత్

కొందరు ఒకే పేరుతో రెండు మూడు దరఖాస్తు చేశారని, మరికొన్నింటిలో ఆధార్, రేషన్ కార్డు నెంబర్లు లేవని అధికారులు వివరించారు. అలాంటి దరఖాస్తులను మరోసారి పరిశీలించాలని, అవసరమైతే క్షేత్రస్థాయికి వెళ్లి చూడాలని అధికారులను ఆదేశించారు. అర్హులైన వారెవరూ నష్టపోకుండా ఒకటికి రెండుసార్లు చూడాలన్నారు. దరఖాస్తుల్లో తప్పులుంటే వాటిని సరిదిద్దుకునేందుకు ఎంపీడీవో కార్యాలయాల్లో లేదా తదుపరి ప్రజా పాలన సదస్సుల్లో అవకాశమివ్వాలని ముఖ్యమంత్రి తెలిపారు.

గ్యారంటీల అమలుకు లేని పోని నిబంధనలు పెట్టి ఎవరినీ ఇబ్బంది పెట్టవద్దని, దరఖాస్తు చేసిన వారిలో అర్హులైన వారందరూ లబ్ధి పొందేలా చూడాలని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. నిరంతర ప్రక్రియగా దరఖాస్తులు సమర్పించే అవకాశం కల్పించాలని సీఎం ఆదేశించారు. సమావేశంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీఎస్ శాంతికుమారి, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

'నంది' ఇక నుంచి గద్దర్ అవార్డు - సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం

Last Updated :Feb 1, 2024, 9:35 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.