ETV Bharat / state

తాగునీటి కోసం ప్రతీ నియోజకవర్గానికి కోటి రూపాయల ప్రత్యేక నిధులు: సీఎం రేవంత్

author img

By ETV Bharat Telangana Team

Published : Jan 30, 2024, 7:25 PM IST

CM Revanth Reddy Review on Drinking Water : రానున్న వేసవిలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ఇప్పటి నుంచి ప్రణాళికలు రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. తాగునీరు అందని గ్రామాలను గుర్తించేందుకు సర్వే చేయాలని సీఎం ఆదేశించారు. తాగునీటి అవసరాల కోసం ప్రతీ నియోజకవర్గానికి కోటి రూపాయల ప్రత్యేక నిధులు కేటాయించనున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. గ్రామాల్లో తాగునీటి నిర్వహణ బాధ్యతలు పంచాయతీలకే అప్పగించాలని స్పష్టం చేసిన సీఎం రేవంత్ రెడ్డి, రేపటితో సర్పంచుల పదవీకాలం ముగియనున్నందున ఇక అధికారులే చూడాలన్నారు.

Congress Govt Focus on Drinking Water Issues
CM Revanth Reddy Review on Drinking Water

CM Revanth Reddy Review on Drinking Water : వచ్చే వేసవిలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ఇప్పటి నుంచే ప్రణాళికలు రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. గోదావరి, కృష్ణా నదులతో పాటు, మల్లన్నసాగర్, కొండపోచమ్మసాగర్, రంగనాయక్ సాగర్ వంటి కొత్త రిజర్వాయర్లను తాగునీటి అవసరాలకు ఉపయోగించేలా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సీఎం తెలిపారు. దానివల్ల రిజర్వాయర్ల చుట్టుపక్కల గ్రామాలకు తక్కువ ఖర్చుతో తాగు నీటిని సరఫరా అవుతుందన్నారు.

మంచినీటి సరఫరా బాధ్యత మిషన్ భగీరథ విభాగానిదే: పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల బడ్జెట్ ప్రతిపాదనలపై మంత్రులు సీతక్క, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డితో కలిసి సీఎం సమీక్ష నిర్వహించారు. గ్రామాల్లో తాగునీటి నిర్వహణ విధులను సర్పంచులకు అప్పగించేలా విధివిధానాలు రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. గ్రామాలకు రక్షిత మంచి నీటిని చేర్చే బాధ్యత మిషన్ భగీరథ(Mission Bhagiratha) విభాగానిదేనని సీఎం స్పష్టం చేశారు.

Congress Govt Focus on Drinking Water Issues : గ్రామాల్లో నల్లాలు, పైపులైన్ల నిర్వహణ మాత్రమే సర్పంచులకే అప్పగించాలని చెప్పారు. గ్రామాల్లో తాగునీటి నిర్వహణ అంశం ఎవరి పరిధిలో లేదని అధికారులు తెలపగా, జవాబుదారీతనం లేకపోతే తాగునీటి సమస్య పెరిగిపోతుందని సీఎం అన్నారు. నెలాఖరుతో సర్పంచుల పదవీకాలం ముగిసిపోతుందని, ఆ తర్వాత అధికారులే తాగునీటి నిర్వహణ బాధ్యతలను నిర్వహించాలని చెప్పారు.

త్వరలో రాష్ట్రంలో కులగణన చేపడతాం : సీఎం రేవంత్

రాష్ట్రంలో ప్రతీ ఇంటికీ నల్లా నీళ్లు ఇచ్చినట్లు గత ప్రభుత్వం చెప్పుకోవటంతో, కేంద్ర జల జీవన్ మిషన్(Central Aquatic Mission) నిధులు రాలేదని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. వాస్తవాలను దాచిపెట్టి గొప్పలకు పోవాల్సిన అవసరం లేదని అధికారులను అప్రమత్తం చేశారు. రాష్ట్రంలో తాగునీరు అందని ప్రాంతాలపై సమగ్ర సర్వే చేయాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.

తాగునీటి కోసం నియోజకవర్గానికి రూ.కోటి ప్రత్యేక నిధులు : ఇప్పటికీ రాష్ట్రంలో చాలాచోట్ల తాగునీటికి ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, తండాలు, గూడెంలు, అటవీ ప్రాంతాలకు(Forest Areas) నీళ్లు అందటం లేదని సీఎం అన్నారు. ఇంజినీర్లు గ్రామాలకు వెళ్లి పరిశీలించి పక్కాగా జాబితాను సిద్ధం చేయాలన్నారు. జలజీవన్ మిషన్ నిధులు రాబట్టుకునేలా కొత్త ప్రతిపాదనలు తయారు చేసి కేంద్రానికి పంపించాలని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. తాగునీటి అవసరాల కోసం ప్రతీ నియోజకవర్గానికి కోటి రూపాయలను ఖర్చు చేయాలని సీఎం తెలిపారు.

రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ కార్డు ఉండాలి : సీఎం రేవంత్​ రెడ్డి

రాష్ట్రంలో స్వయం సహాయక సంఘాలను బలోపేతం చేసి, ఆర్థికంగా చేయాతను అందించే కార్యక్రమాలపై దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. విద్యార్థులు, పోలీసులకు అందించే యూనిఫామ్స్ కుట్టే పని స్వయం సహాయక సంఘాల(Self Help Societies) మహిళలకు అప్పగించాలని సూచించారు. రాష్ట్రంలో రోడ్డు లేని గ్రామాలకు రోడ్లను నిర్మించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా 422 పంచాయతీలు, 3177 ఆవాసాలకు ఇప్పటికీ రోడ్డు కనెక్టివిటీ లేదని అధికారులు సీఎం నివేదించారు. వీటన్నింటికీ తారు రోడ్లు వేయాలని, అవసరమైతే ఉపాధి హామీ నిధులను లింక్ చేస్తూ బడ్జెట్లో ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సీఎం చెప్పారు.

'రైతుభరోసా, పింఛన్లపై అపోహలొద్దు - పాత లబ్ధిదారులందరికీ కొనసాగిస్తాం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.