ETV Bharat / state

చిన్న వయసులోనే లాస్య చనిపోవడం బాధాకరం - ఆమె కుటుంబానికి మేం అండగా ఉంటాం : కేటీఆర్

author img

By ETV Bharat Telangana Team

Published : Feb 25, 2024, 12:22 PM IST

Updated : Feb 25, 2024, 12:57 PM IST

KTR Visits Lasya Nandita House : సికింద్రాబాద్ కంటోన్మెంట్‌ ఎమ్మెల్యే లాస్య నందిత మృతి పట్ల మాజీ మంత్రి, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. లాస్య కుటుంబాన్ని ఇవాళ ఆయన పరామర్శించారు. చిన్న వయసులోనే ఆమె అకాల మరణం బాధాకరమన్న కేటీఆర్, ఏడాది వ్యవధిలోనే సాయన్న, లాస్యలు మరణించడం కంటోన్మెంట్ ప్రజానీకానికి తీరని లోటని ఆవేదన వ్యక్తం చేశారు.

Etv Bharat
Etv Bharat

చిన్న వయసులోనే లాస్య చనిపోవడం బాధాకరం - ఆమె కుటుంబానికి మేం అండగా ఉంటాం : కేటీఆర్

KTR Visits Lasya Nandita House : ఇటీవల రహదారి ప్రమాదంలో సికింద్రాబాద్ కంటోన్మెంట్‌ బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత మృతి చెందిన విషయం తెలిసిందే. ఎమ్మెల్యేగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ఆమెను వరుస ప్రమాదాలు వెంటాడాయి. మొదట లిఫ్టులో చిక్కుకున్న ఆమె, ఆ తర్వాత కొద్ది రోజులకే రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. ఇక ఆ ప్రమాదం నుంచి కోలుకున్న వెంటనే మరో ప్రమాదం ఆమెను బలి తీసుకుంది.

KTR Condolences to Lasya Nandita's Family : లాస్య నందిత మరణం యావత్ రాష్ట్రాన్ని షాక్‌కు గురి చేసింది. పార్టీలకతీతంగా రాజకీయ నేతలు లాస్య కుటుంబాన్ని పరామర్శిస్తూ ధైర్యం చెబుతున్నారు. తాజాగా దివంగత ఎమ్మెల్యే లాస్య నందిత (MLA Lasya Nandita Death) కుటుంబసభ్యులను మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల శాసనసభ్యులు కేటీఆర్ పరామర్శించారు. హైదరాబాద్ నగరంలోని లాస్య నందిత ఇంటికి వెళ్లిన కేటీఆర్, ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

కబళించిన మృత్యువు - లాస్య నందితకు కలిసి రాని 'ఎమ్మెల్యే' కాలం

KTR About Lasya Nandita Death : అనంతరం వారి కుటుంబసభ్యులను ఓదార్చి ధైర్యం చెప్పారు. కేటీఆర్‌ (KTR At Lasya Nandita Residence)ను చూడగానే లాస్య కుటుంబసభ్యులు బోరున విలపించారు. ఆయన వారికి ధైర్యం చెప్పి బీఆర్ఎస్ పార్టీ, తమ నాయకుడు కేసీఆర్, తాము ఎప్పటికీ వారి కుటుంబానికి అండగా ఉంటుందని భరోసా కల్పించారు. ఆ తర్వాత మీడియాతో కేటీఆర్ మాట్లాడారు. లాస్య నందిత మరణ వార్త తనను ఎంతో దిగ్భ్రాంతికి గురి చేసిందని అన్నారు. చిన్న వయసులోనే ఆమె అకాల మరణం తీవ్ర బాధ కలిగించిందని తెలిపారు. ఏడాది వ్యవధిలోనే కంటోన్మెంట్‌కు ఐదుసార్లు ఎమ్మెల్యేగా సేవలందించిన సాయన్న, ఆయన కుమార్తె లాస్య మరణించడం తీవ్రంగా కలచివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు.

"కంటోన్మెంట్‌కు ఎమ్మెల్యేగా ఉన్న లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో మరణించడం చాలా బాధాకరం. ఆ దుర్ఘటన జరిగిన రోజున నేను విదేశాల్లో ఉన్నాను. అందుకే ఆరోజు రాలేకపోయాను. ఇవాళ ఇక్కడికి వచ్చి లాస్యకు నివాళులు అర్పించాను. వారి కుటుంబం తీవ్ర దుఃఖంలో ఉంది. వారికి బీఆర్ఎస్ పార్టీ, మా నాయకుడు కేసీఆర్ ఎల్లప్పుడూ అండగా నిలుస్తాం. లాస్య నాకు చాలా ఏళ్ల నుంచి తెలుసు. తాను కవాడిగూడ కార్పొరేటర్‌గా ఉన్నప్పుడు మేం కలిసి పని చేశాం. తను నాకు ఓ సోదరిలా అనిపించేది. ఎన్నికల ప్రచారంలోనూ చాలా చురుకుగా పని చేసింది. నియోజకవర్గ అభివృద్ధి గురించి ఎప్పటికప్పుడు నాతో చర్చించేది. తన జిజ్ఞాస, ఆసక్తి చూసి నాకు చాలా ఆశ్చర్యమేసేది. ఎంతో గొప్ప నాయకురాలు అవుతుందని నేను అనుకునేవాడిని. కానీ ఇంతలోనే రోడ్డు ప్రమాదం ఓ మంచి నేతను కంటోన్మెంట్ ప్రజలకు దూరం చేసింది." - కేటీఆర్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్

రాజకీయ నేతలకు అది 'మృత్యు సమయం' - ప్రాణాలు తీస్తున్న ఉదయపు ప్రయాణాలు

వీఐపీల వద్ద పనిచేసే డ్రైవర్లకు ఫిట్‌నెస్‌ పరీక్షలు నిర్వహిస్తాం : మంత్రి పొన్నం

Last Updated : Feb 25, 2024, 12:57 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.