ETV Bharat / state

రాజకీయ నేతలకు అది 'మృత్యు సమయం' - ప్రాణాలు తీస్తున్న ఉదయపు ప్రయాణాలు

author img

By ETV Bharat Telangana Team

Published : Feb 24, 2024, 9:29 AM IST

Political Leaders Road Accidents in Morning : రాజకీయ నాయకులను ఉదయపు ప్రయాణాలు పొట్టనపెట్టుకుంటున్నాయి. ఇలా ఇప్పటివరకు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉదయపు ప్రయాణంలో అరడజను మంది రాజకీయ నాయకులను రోడ్డు ప్రమాదాలు పొట్టన పెట్టుకున్నాయి. తాజాగా యువ ఎమ్మెల్యే లాస్య నందిత కూడా తెల్లవారు జామున జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఇంతకీ రాజకీయ నాయకులకు ఉదయపు ప్రయాణం మృత్యు సమయంగా ఎందుకు మారిందో తెలుసుకుందామా?

Road Accidents in the Morning
Why are Politicians Dying in Road Accidents in the Morning

Political Leaders Road Accidents in Morning : ఉదయం పూట ప్రయాణం అంటే తొందరగా గమ్యస్థానాలకు చేరుకోవచ్చనే అభిప్రాయం చాలా మందిలో ఉంటుంది. ముఖ్యంగా ప్రజా జీవితంలో నిత్యం తీరిక లేకుండా గడిపే రాజకీయ నాయకులకు(Politicians) ఈ సమయమే శ్రీరామరక్ష. ఎందుకంటే చాలా తక్కువ వ్యవధిలోనే చాలా కార్యక్రమాలకు హాజరు కావాల్సి వస్తోంది. కానీ ఇదే సమయం వారికి శాపంగా మారి మృత్యు సమయంగా మారుతోంది. పలు సందర్భాల్లో ఉదయపు ప్రయాణాలు ప్రాణాంతకంగా మారి ఆ నాయకుల కుటుంబాలకు తీరని వ్యథను మిగుల్చుతుంది. ఇలాంటి సందర్భంలోనే కంటోన్మెంట్​ ఎమ్మెల్యే లాస్య నందిత(MLA Lasya Nanditha) వేకువజామునే ఓ కార్యక్రమానికి వెళ్లి చివరకు రోడ్డు ప్రమాదంలో ప్రాణాలను కోల్పోయారు. ఆమె మాత్రమే కాదు, ఇలా చాలా మంది రాజకీయ నాయకులు ఉదయపు ప్రయాణాలతో ప్రాణాలను కోల్పోయారు.

ఇలా ఉదయం ప్రమాదంలో మరణించిన రాజకీయ నాయకులు :

  • 2012 నవంబరు 2వ తేదీ తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో తెలుగుదేశం నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి కింజరాపు ఎర్రన్నాయుడు విశాఖపట్నంలో ఓ వివాహానికి హాజరై తిరిగి వస్తుండగా రోడ్డు ప్రమాదం జరిగి తీవ్ర గాయాలై కన్నుమూశారు.
  • తెలుగుదేశం నాయకుడు లాల్​జాన్​ పాషా 2013 ఆగస్టు 15న హైదరాబాద్​ నుంచి గుంటూరు వెళుతుండగా నకిరేకల్​ వద్ద ఉదయం 6 గంటల ప్రాంతంలో జరిగిన ప్రమాదంలో మరణించారు.
  • మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు తనయుడు నందమూరి హరికృష్ణ నార్కట్​పల్లి-అద్దంకి హైవేపై 2018 ఆగస్టు 29న ఉదయం 6 గంటల సమయంలో జరిగిన ప్రమాదంలో ప్రాణాలు విడిచారు.
  • అలాగే 2002 మార్చి నెలలో లోక్​సభ స్పీకర్​గా ఉన్న జీఎంసీ బాలయోగి ఉదయాన్నే హెలికాప్టర్​ ప్రమాదంలో మరణించారు.

Road Accidents on National Highway 44 : హైవేలపై ప్రమాదాలకు కారణాలు ఇవే.. ఇకనైనా పట్టించుకుంటారా..?

ఆ సమయంలో మరణాలు ఎందుకు? : రాజకీయ నాయకులు ప్రజా జీవితంలో ఉన్నందువల్ల వారి కార్యక్రమాలను ఉదయాన్నే మొదలుపెడతారు. ఈ సమయంలో నియోజకవర్గ పర్యటనలు, శుభకార్యాలు లేదా ఇతర కార్యక్రమాలకు సాధ్యమైనంత త్వరగా వెళ్లాలని అనుకుంటారు. అందుకే ఈ ఉదయం టైం అయితే వారికి సరైనదిగా భావించి ప్రయాణాలు చేస్తుంటారు. ముఖ్యంగా చూసుకుంటే వివాహాల సీజన్​లలో అయితే పది వేడుకలకు కూడా రోజులో హాజరు కావాల్సిన పరిస్థితి వస్తుంది. ఒకవేళ ఏ కార్యక్రమానికైనా వెళ్లకపోతే తనపై వ్యతిరేకత వస్తుందేమో అన్న భయం నాయకులలో కలుగుతుంది. అందుకే ఎన్ని ఇబ్బందులు పడినా, పిలిచిన వాటికి కాదనకుండా వెళుతుంటారు.

Road Accidents in Early Morning : ఒకవేళ ఎక్కువ దూరం ప్రయాణించాల్సి వస్తే, ఎక్కువ కార్యక్రమాలకు హాజరు కావాల్సి వచ్చినా తెల్లవారుజామునే లేచి బయలుదేరుతుంటారు. వీరితో పాటే వీరి డ్రైవర్లకు కూడా నిద్రభంగమే. ఎందుకంటే అర్ధరాత్రి వరకు నాయకులతోనే ఉండి మళ్లీ ఉదయాన్నే విధులకు హాజరవుతారు. ఇలా అలసిపోయిన వారు, తొందరగా వెళ్లాలనే ఉద్దేశంతో వాహనాన్ని వేగంగా నడపాలని భావిస్తారు. కొన్నిసార్లు నేతలు కూడా డ్రైవర్లను వేగంగా వెళ్లాల్సిందిగా కోరతారు. నెమ్మదిగా వెళితే అన్ని కార్యక్రమాలకు హాజరు కాలేమన్న ఉద్దేశంతో నేతలు ఉంటారు. అందుకే ఇలా వారికి సలహాలు ఇస్తుంటారు. అందుకు డ్రైవర్లు కూడా వేగంగా వెళ్లాలని నిర్ణయించుకొని మితిమీరిన వేగంతో వెళ్లి కొన్నిసార్లు ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఒక్కోసారి ఉదయపు మంచు కూడా కురవడం ప్రమాదాలకు కారణమవుతుంది.

కబళించిన మృత్యువు - లాస్య నందితకు కలిసి రాని 'ఎమ్మెల్యే' కాలం

'వాహనాలు మాట్లాడుకుంటాయ్'- రోడ్డు ప్రమాదాలు తగ్గించేలా 'ఐఐటీ' సాంకేతికత

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.