ETV Bharat / state

ఎమ్మెల్యే లాస్య నందిత డ్రైవర్​కు ఆల్కహాల్ టెస్ట్

author img

By ETV Bharat Telangana Team

Published : Feb 24, 2024, 5:39 PM IST

MLA Lasya Nanditha Accident Investigation : సంగారెడ్డి జిల్లా పటాన్​చెరు శివారు ప్రాంతం ఔటర్ రింగ్ రోడ్​లో కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత కారుకి జరిగిన రహదారి ప్రమాదం కేసు దర్యాప్తును పోలీసులు వేగవంతం చేశారు. ఎందుకు జరిగింది? ఎలా జరిగింది? అనే దానిపై దర్యాప్తు చేపట్టారు.

MLA Lasya Nanditha Accident Investigation
MLA Lasya Nandita's car accident

MLA Lasya Nanditha Accident Investigation : సంగారెడ్డి జిల్లా రామేశ్వరం బండ ఔటర్ రింగ్ రోడ్​పై కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత కారుకు జరిగిన రహదారి ప్రమాదంపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ముందు వెళుతున్న వాహనాన్ని ఢీకొట్టడంతో ఓఆర్ఆర్ రహదారిపై (ORR) రెండో లైనులో వెళుతున్న వాహనం చివరకు రెయిలింగ్ ఢీకొని అగిపోయినట్లుగా గుర్తించారు.

కారు ప్రమాదంలో కంటోన్మెంట్​ ఎమ్మెల్యే లాస్య నందిత మృతి - దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు

ప్రమాద స్థలం ముందు దాదాపు 500 మీటర్ల దూరం నుంచి కారు స్పేర్ పార్ట్ పడి ఉండటం, కారుపై రాక్​శాండ్ పౌడర్ పడి ఉండటంతో టిప్పర్​నుగాని, రెడీమిక్స్ వాహనాన్ని కానీ ఎమ్మెల్యే కారు ఢీకొట్టినట్టు ఒక నిర్థారణకు వచ్చారు. పోలీసులు ప్రమాద సమయంలో ఓఆర్ఆర్​పై వెళ్లిన ఆరు టిప్పర్​ల వివరాలు గుర్తించారు. అయితే ప్రమాదం సమయంలో డ్రైవర్ ఆకాశ్ మద్యం తాగి (Drunk and Drive) ఉన్నాడా లేదా అనే వివరాల నిర్థారణ కోసం అతని రక్త నమూనాలను పరీక్షల కోసం పోలీసులు పంపారు.

అలాగే కారు ముత్తంగి ఔటర్ రింగ్ రహదారి దాటుతున్న సమయాలను తెలుసుకున్నారు. 22వ తేదీ రాత్రి ఇంటి నుంచి 12 గంటలకు బయలుదేరి సుజుకీ ఎక్సెల్ 6 కారులో ముందు సదాశివపేటకు వెళుతూ 12.50 గంటలకు ముత్తంగి టోల్ గేట్ క్రాస్ చేసినట్లు పోలీసులు తెలుసుకున్నారు. డ్రైవర్ ఆకాశ్ చరవాణి వివరాలు కూడా పరిశీలిస్తున్నామని తెలిపారు. ఇప్పటికే మేజిస్ట్రేట్ ముందు ఆకాశ్ నుంచి వాంగ్మూలం తీసుకున్నారు. హై ప్రొఫైల్ కేసుకావడంతో(High Profile Case) సంబంధిత డిపార్ట్​మెంట్​లో నిపుణులతో దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

Minister Ponnam on VIP Drivers Fitness Test : ఎమ్మెల్యే లాస్య నందిత యాక్సిడెంట్ కేసు నేపథ్యంలో, రాష్ట్రంలో వీఐపీల వద్ద పనిచేసే డ్రైవర్లకు ఫిట్‌నెస్‌ పరీక్షలు నిర్వహిస్తామని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. ప్రముఖ వ్యక్తులకు సంబంధించిన డైవర్లకు డ్రైవ్‌ టెస్ట్‌ చేస్తామని, దీనికి సంబంధించి రవాణాశాఖనే సుమోటోగా తీసుకుని చేస్తుందన్నారు.

Lasya Nanditha Condolence : కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం సాయంత్రం నిర్వహించింది. ఉదయం రోడ్డు ప్రమాదంలో మరణించిన కంటోన్మెంట్‌ ఎమ్మెల్యేకు సీఎం రేవంత్‌, మాజీ సీఎం కేసీఆర్‌ సహా పలువురు నివాళులు అర్పించారు. లాస్యనందిత అకాల మృతిపట్ల రాజకీయ నాయకులతో పాటు నియోజకవర్గ ప్రజలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

రాజకీయ నేతలకు అది 'మృత్యు సమయం' - ప్రాణాలు తీస్తున్న ఉదయపు ప్రయాణాలు

'లాస్య నందిత అకాల మరణం ఎంతో బాధాకరం' - సీఎం రేవంత్​ సహా ప్రముఖుల సంతాపం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.