ETV Bharat / state

ఎమ్మెల్యే లాస్య నందిత మృతి కేసు - ముందు వెళ్తున్న వాహనాన్ని ఢీకొనడంతోనే ప్రమాదం!

author img

By ETV Bharat Telangana Team

Published : Feb 25, 2024, 7:00 AM IST

MLA Lasya Nanditha Road Accident Case Updates : రోడ్డు ప్రమాదంలో మరణించిన ఎమ్మెల్యే లాస్య నందిత కేసులో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. ప్రమాదం ఎలా జరిగిందనే అంశంపై వివరాలు సేకరించే పనిలో ఉన్నారు. ముందు వెళ్తున్న వాహనాన్ని ఢీకొనడంతోనే ఈ ఘటన జరిగినట్లు అనుమానిస్తున్నారు. ప్రమాద సమయంలో డ్రైవర్‌ మద్యం తాగి ఉన్నాడా లేదా నిర్ధారించడానికి అతడి రక్త నమూనాలను పరీక్షలకు పంపారు.

MLA Lasya Nanditha
MLA Lasya Nanditha

MLA Lasya Nanditha Road Accident Case Updates : సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ ఎమ్మెల్యే లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన కేసులో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ప్రమాదం ఎలా జరిగిందనే అంశంపై పూర్తిస్థాయి వివరాలు సేకరిస్తున్నారు. ఔటర్​పై రెండో లైనులో వెళ్తున్న కారు ముందు వెళ్తున్న వాహనాన్ని ఢీకొనడంతో అదుపు తప్పి రెయిలింగ్‌ను ఢీకొని ఆగిపోయి ఉంటుందని భావిస్తున్నారు. దాదాపు 500 మీటర్ల దూరం నుంచి వాహన భాగాలు పడి ఉండటం, కారుపై రాక్‌శాండ్‌ పౌడర్‌ కనిపించడంతో టిప్పర్‌ లేదా రెడీమిక్స్‌ వాహనాన్ని ఢీకొట్టి ఉండవచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Police Investigation MLA Lasya Nanditha Accident : ప్రమాద సమయంలో ఔటర్​ రింగ్ రోడ్డుపై ఆరు టిప్పర్లు వెళ్తున్నట్లు పోలీసులు గుర్తించారు. కారు నడిపిన ఎమ్మెల్యే డ్రైవర్, పీఏ ఆకాశ్‌ (Lasya Nanditha Car Accident) మద్యం తాగి ఉన్నాడా లేదా నిర్ధారించడానికి అతని రక్త నమూనాలను పరీక్షల కోసం పంపారు. అతడి సెల్‌ఫోన్‌ డేటాను పరిశీలిస్తున్నారు. ఇప్పటికే మెజిస్ట్రేట్‌ ముందు ఆకాశ్‌ వాంగ్మూలం తీసుకున్నామని డీఎస్పీ రవీందర్​రెడ్డి తెలిపారు. హైప్రొఫైల్‌ కేసు కావడంతో సంబంధిత నిపుణులతో దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.

కబళించిన మృత్యువు - లాస్య నందితకు కలిసి రాని 'ఎమ్మెల్యే' కాలం

బాలికకు తప్పిన ప్రాణాపాయం : ఎమ్మెల్యే లాస్య నందితతో (MLA Lasya Nanditha) పాటు అదే కారులో ప్రయాణిస్తున్న ఆమె అక్క కుమార్తె శ్లోక కొన్ని నిమిషాల ముందే మరో కారులోకి మారడంతో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ఈ విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. కొంతకాలంగా లాస్య నందిత తరచూ అనారోగ్యం పాలవుతుండటం, రెండు ప్రమాదాల నుంచి త్రుటిలో బయటపడ్డారు. దీంతో కుటుంబసభ్యులు, బంధువుల సూచన మేరకు ఎమ్మెల్యే 22న రాత్రి సమయంలో సదాశివపేట్‌ మండలం ఆరూర్‌లోని మిస్కిన్‌షా దర్గాకు వెళ్లారు. తెల్లవారుజామున పూజలు చేయించుకుని తిరుగు ప్రయాణమయ్యారు.

ఒక కారులో లాస్య నందిత, ఆకాశ్‌తోపాటు చిన్నారి శ్లోక, మరో కారులో ఇతర కుటుంబసభ్యులు ఉన్నారు. ప్రమాదం జరగడానికి కొద్ది నిమిషాల ముందు వాహనాలను రోడ్డు పక్క నిలిపిన నందిత శ్లోకను మరో కారులో ఎక్కించి పంపించారు. బాలిక పాఠశాలకు వెళ్లాల్సి ఉన్నందున ముందుగా ఇంటికి వెళ్లాలని, తాను టిఫిన్​ చేసి వస్తానని చెప్పి ఆమె కుటుంబసభ్యులను పంపారు. ఆ తరువాత కాసేపటికే పటాన్‌చెరు సమీపంలో రోడ్డు ప్రమాదానికి గురై లాస్య నందిత మరణించారు.

'లాస్య నందిత అకాల మరణం ఎంతో బాధాకరం' - సీఎం రేవంత్​ సహా ప్రముఖుల సంతాపం

Cantonment MLA Lasya Nanditha Passed Away : దివంగత నేత సాయన్న కుమార్తె లాస్య నందిత. 1987లో హైదరాబాద్‌లో ఆమె జన్మించారు. కంప్యూటర్‌ సైన్స్‌లో బీటెక్‌ పూర్తి చేసిన లాస్య నందిత 2015లో రాజకీయాల్లోకి వచ్చారు. 2015 కంటోన్మెంట్‌ బోర్డు ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2016లో తండ్రి సాయన్నతో పాటు భారత్​ రాష్ట్ర సమితిలో చేరారు. 2016-2020 మధ్య కవాడిగూడ కార్పొరేటర్‌గా పనిచేశారు. 2021 జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో కవాడిగూడ నుంచి పోటీ చేసి ఓడిపోయారు.

MLA Lasya Nanditha Died in Road Accident : గతేడాది ఫిబ్రవరి 19న లాస్య నందిత తండ్రి ఎమ్మెల్యే సాయన్న (MLA Sayanna) మరణించారు. అనంతరం 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా కంటోన్మెంట్‌ నుంచి పోటీ చేసిన లాస్య నందిత బీజేపీ అభ్యర్థి గణేశ్‌పై 17,000ల ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. కానీ ఇంతలోనే లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు. సంవత్సరం వ్యవధిలోనే తండ్రీకుమార్తె మృతితో వారి కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది.

యువనాయకురాలు లాస్య నందిత మృతిపై ప్రముఖుల సంతాపం

రాజకీయ నేతలకు అది 'మృత్యు సమయం' - ప్రాణాలు తీస్తున్న ఉదయపు ప్రయాణాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.