ETV Bharat / state

మరో రెండ్రోజుల్లో ఇంటర్ పరీక్షలు - ఒత్తిడికి టెలిమానస్‌తో చెక్ పెట్టేయండిలా

author img

By ETV Bharat Telangana Team

Published : Feb 26, 2024, 4:32 PM IST

Inter Exams Telangana 2024
Inter Exams Telangana 2024

Inter Exams Telangana 2024 : ఈనెల 28వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్మీడియట్ పరీక్షలు జరగనున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా 1,521 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు ఇంటర్ బోర్డు కార్యదర్శి శ్రుతి ఓజా తెలిపారు. 9,80,978 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నట్లు చెప్పారు. అన్ని పరీక్షా కేంద్రాల్లో సీసీటీవీలు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఉదయం 9 గంటల తర్వాత ఒక్క నిమిషం ఆలస్యమైనా ఎగ్జామ్ హాల్లోకి అనుమతించబోమని స్పష్టం చేశారు.

Inter Exams Telangana 2024 : రాష్ట్రంలో ఈనెల 28వ తేదీ నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలు జరగనున్నాయి. ఈ పరీక్షలకు ఇప్పటికే అధికారులు ఏర్పాట్లన్నీ పూర్తి చేశారు. విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి శ్రుతి ఓజా తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 1,521 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 9,80,978 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నట్లు వెల్లడించారు.

Telangana Inter Exams Schedule 2024 : రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పరీక్షా కేంద్రాల్లో సీసీటీవీలు ఏర్పాటు చేసినట్లు శ్రుతి ఓజా తెలిపారు. ఉదయం 9 గంటల తర్వాత ఒక్క నిమిషం ఆలస్యమైనా ఎగ్జామ్ హాల్లోకి అనుమతించబోమని స్పష్టం చేశారు. టెలిమానస్ ద్వారా విద్యార్థుల్లో ఒత్తిడి తగ్గించేందుకు చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. విద్యార్థులు మానసకింగా ఒత్తిడికి గురైనా, పరీక్షల సమయంలో ఇతర ఏ రకమైన మానసిక సమస్యలకు గురైనా టెలిమానస్‌ను సంప్రదించొచ్చని అన్నారు. రాష్ట్ర, జిల్లా స్థాయిలో కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేసినట్లు వివరించారు. విద్యార్థులు ప్రశాంతంగా పరీక్షలు రాయాలని సూచించారు.

"పరీక్షా కేంద్రాలకు గంట ముందుగానే విద్యార్థులంతా రావాలి. వేసవి కాలం కావడంతో డీహైడ్రేషన్‌కు గురి కాకుండా సరైన ఆహారం తీసుకోవాలి. సరిపడా నీళ్లు తాగాలి. ఎగ్జామ్ హాల్‌లో ఉదయం 9 గంటల లోపే ఉండాలి. 9 గంటలు దాటిన తర్వాత ఒక్క నిమిషం ఆలస్యమైనా లోపలికి అనుమతించబోం. ఇది గమనించి విద్యార్థులు ముందుగానే పరీక్షా కేంద్రాలకు వచ్చేలా ఏర్పాట్లు చేసుకోవాలి. పరీక్షా కేంద్రాల్లోకి మొబైల్ ఫోన్లకు అనుమతి లేదు." - శ్రుతి ఓజా, ఇంటర్ బోర్డు కార్యదర్శి

ఫిబ్రవరి 28 నుంచి తెలంగాణ ఇంటర్​ పరీక్షలు - షెడ్యూల్​ ఇదే

పరీక్షల సమయం కాబట్టి విద్యార్థులు ఒత్తిడికి లోనవుతారని, తల్లిదండ్రులంతా వారిని ఓ కంట కనిపెడుతూ ఉండాలని శ్రుతి ఓజా తెలిపారు. వారు ఒత్తిడికి లోనవ్వకుండా ధైర్యం చెబుతూ వెన్నుతట్టి ప్రోత్సహించాలని సూచించారు. ఎండలు మండిపోతున్నందున విద్యార్థులకు సరైన ఆహారం అందించాలని, వారు సరిపడా నీళ్లు తాగేలా చూడాలని తల్లిదండ్రులకు శ్రుతి ఓజా సలహా ఇచ్చారు.

"పరీక్షలు దగ్గర పడుతున్న కొద్దీ విద్యార్థుల్లో తెలియని భయం, మానసిక ఒత్తిడి ఉంటుంది. అందుకే వారిలో భయాన్ని వదిలించడానికి టెలీ-మానస్​ అనే ప్రత్యేకమైన కౌన్సెలింగ్​ విభాగాన్ని ఏర్పాటు చేశాం. ఇక్కడ విద్యార్థుల భయాన్ని పోగొట్టడానికి ఒక సైకాలజిస్ట్​ ఉంటారు. 14416 టోల్​ఫ్రీ నెంబర్​కు కాల్​ చేస్తే వారు విద్యార్థులు ఎదుర్కొంటున్న పరీక్షల భయాన్ని తొలగిస్తారు. నూతన ఉత్సాహాన్ని నింపుతారు. ఈ నెంబర్​ 24 గంటలూ అందుబాటులో ఉంటుంది." - శ్రుతి ఓజా, ఇంటర్ బోర్డు కార్యదర్శి

ఇంటర్‌ ఫస్టియర్‌ పరీక్ష తేదీలు :

  • ఫిబ్రవరి 28 - పార్ట్‌ 2 (సెకండ్‌ లాంగ్వేజి పేపర్‌-1)
  • మార్చి 4 - పార్ట్‌ 3 (మేథమేటిక్స్‌ పేపర్-1ఏ, బోటనీ పేపర్‌-1, పొలిటికల్‌ సైన్స్‌ పేపర్‌-1)
  • మార్చి 6 - మేథమేటిక్స్‌ పేపర్‌ 1బి, జువాలజీ పేపర్‌-1, హిస్టరీ పేపర్‌-1
  • మార్చి 11- ఫిజిక్స్‌ పేపర్‌-1, ఎకనామిక్స్‌ పేపర్‌-1
  • మార్చి 13 - కెమెస్ట్రీ పేపర్‌-1, కామర్స్‌ పేపర్‌-1
  • మార్చి 15 - పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌ పేపర్‌-1, బ్రిడ్జి కోర్స్‌ మ్యాథ్స్‌ పేపర్‌-1 (ఫర్ బైపీసీ స్టూడెంట్స్‌)
  • మార్చి 18 - మోడరన్‌ లాంగ్వేజ్‌ పేపర్‌-1, జియోగ్రఫీ పేపర్‌-1

ఇంటర్‌ సెకండ్‌ ఇయర్‌ పరీక్ష తేదీల :

  • ఫిబ్రవరి 29 - పార్ట్‌ 2 (సెకండ్‌ లాంగ్వేజ్‌ పేపర్‌-2)
  • మార్చి 2 - పార్ట్‌ 1 (ఇంగ్లీష్‌ పేపర్‌-2)
  • మార్చి 5 - పార్ట్‌ 3 (మేథమేటిక్స్‌ పేపర్‌ 2ఏ, బోటనీ పేపర్‌ 2, పొలిటికల్‌ సైన్స్‌ పేపర్‌ 2)
  • మార్చి 7 - మేథమేటిక్స్‌ పేపర్‌ 2బి, జూవాలజీ పేపర్‌-2, హిస్టరీ పేపర్-2
  • మార్చి 12 - ఫిజిక్స్‌ పేపర్‌-2, ఎకనామిక్స్‌ పేపర్‌-2
  • మార్చి 14 - కెమెస్ట్రీ పేపర్‌ -2, కామర్స్‌ పేపర్‌-2
  • మార్చి 16 - పబ్లిక్‌ ఆడ్మినిస్ట్రేషన్‌ పేపర్‌-2, బ్రిడ్జి కోర్స్‌ మ్యాథ్స్‌ పేపర్‌-2 (ఫర్‌ బైపీసీ స్టూడెంట్స్‌)
  • మార్చి 19 - మోడరన్‌ లాంగ్వేజ్‌ పేపర్‌-2, జియోగ్రఫీ పేపర్‌-2

పరీక్షల ఒత్తిడితో పరేషాన్ అవుతున్నారా? 'టెలీ-మానస్'​తో పుల్​స్టాప్​ పెట్టేయండి..

Students Suicides In Telangana : చావు పరిష్కారం కాదు.. బతికి సాధిద్దాం బిడ్డా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.