ETV Bharat / state

పరీక్షల ఒత్తిడితో పరేషాన్ అవుతున్నారా? 'టెలీ-మానస్'​తో పుల్​స్టాప్​ పెట్టేయండి..

author img

By

Published : Mar 12, 2023, 1:46 PM IST

Tele Manas To Remove Exam Fear in Students: చదివిన విషయాన్ని మరిచిపోతున్నారా.. పరీక్షల సమయం దగ్గర పడుతుండటంతో ఒత్తిడిని జయించలేకపోతున్నారా.. అయితే వెంటనే 14416 టోల్​ఫ్రీ నెంబర్​కు కాల్​ చేయండి. మీ సమస్యకు చక్కని పరిష్కారం ఇట్టే పట్టేయండి.

tele
tele

Tele Manas To Remove Exam Fear in Students: ఇంకో వారం రోజుల్లో ఇంటర్మీడియెట్​ పరీక్షలు ప్రారంభం కానుండటంతో విద్యార్థుల్లో కాస్త ఒత్తిడికి గురవుతున్నారు. కొంతమంది విద్యార్థులు ఎలాంటి సందర్భంలో చదివినా సరే.. వారు ప్రశ్నకు సమాధానం ఇట్టే రాయగలరు.. చెప్పగలరు. మరికొంత మంది ఆ రెండు పనులూ చేయలేరు. ఇంకొందరు క్లాస్​లో అధ్యాపకులు ప్రశ్నలు అడిగినప్పుడు చక్కగా సమాధానం చెబుతారు.. కానీ పరీక్షలు అంటే మాత్రం ఎక్కడా లేని భయం. ఈ భయంతోనే చదివిన విషయాలు అన్నీ మరిచిపోతున్నారు. ఆ విషయాలను గుర్తుంచుకోవడానికి.. పిల్లలలో పరీక్షల భయాన్ని వదిలించడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకమైన విభాగం ఏర్పాటు చేసి.. టోల్​ ఫ్రీ నెంబర్​ను ఇచ్చింది. ఇప్పుడు ఈ విభాగానికి నిరంతరం అనేకమైన కాల్స్​ వస్తున్నాయి.

విద్యార్థులను వెంటాడుతున్న పరీక్షల భయం: ఈ నెల 15 నుంచి ఇంటర్​ విద్యార్థులకు ఫైనల్​ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ పరీక్షలకు మొత్తం 9.15 లక్షల మంది విద్యార్థులు హాజరై.. తమ భవిష్యత్తుకు బాటలు వేయాలనుకుంటున్నారు. అయితే పరీక్షలు దగ్గర పడుతున్న కొద్దీ.. విద్యార్థుల్లో వారిలో వారికే తెలియని భయం, మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. అందుకే వారిలో భయాన్ని వదిలించడానికి టెలీ-మానస్​ అనే ప్రత్యేకమైన కౌన్సెలింగ్​ విభాగాన్ని ఏర్పాటు చేశారు. ఇక్కడ విద్యార్థుల భయాన్ని పోగొట్టడానికి ఒక సైకాలజిస్ట్​ ఉంటాడు.

అందుకు 14416 టోల్​ఫ్రీ నెంబర్​కు కాల్​ చేస్తే సరిపోతుంది. వారు విద్యార్థులు ఎదుర్కొంటున్న పరీక్షల భయాన్ని తొలగించి.. వారిలో నూతన ఉత్సాహాన్ని నింపుతారు. విద్యార్థులకు ఏదైనా సమస్య ఉంటే ఈ నెంబర్​కు కాల్​ చేయాలని ఇంటర్​ బోర్డు సూచించింది. ఈ నెంబర్​ 24 గంటలూ అందుబాటులో ఉంటుందని.. సైకాలజిస్టులు కూడా అందుబాటులో ఉంటారని బోర్డు తెలిపింది.

అధిక శాతం ఎంపీసీ, బైపీసీ విద్యార్థులే: టెలీ-మానస్​కు 90 శాతానికి పైగా ఎంపీసీ, బైపీసీ విద్యార్థుల నుంచే కాల్స్​ వస్తున్నాయని ఓ కౌన్సిలర్​ వివరించారు. ఇంటర్​లో మంచి ర్యాంకు వస్తే కానీ.. జేఈఈ మెయిన్​, అడ్వాన్స్​డ్​, ఎంసెట్​, నీట్​లలో అర్హత సాధించలేమని అనుకుంటున్నారని.. అందుకే వీరిలో ఎక్కువగా ఒత్తిడి, ఆందోళన ఉంటుందని నిపుణులు పేర్కొన్నారు. ముఖ్యంగా కార్పొరేట్​ విద్యాసంస్థల్లో చదివే విద్యార్థుల్లోనే అధికంగా ఒత్తిడి ఉంటుందని తెలిపారు.

ఏమిటీ టెలీ-మానస్‌? టెలీ-మానస్​ను టెలీ మెంటల్​ హెల్త్​ అసిస్టెన్స్​ అండ్​ నెట్​వర్కింగ్​ అక్రాస్​ స్టేట్స్​ అని అంటారు. అంటే ఫోన్​ ద్వారా అవతలి వ్యక్తికి కౌన్సెలింగ్​ ఇస్తారు. ఇందుకు 14416 టోల్​ఫ్రీ నెంబర్​కు కాల్​ చేస్తే సరిపోతుంది. ఈ హెల్ప్​ లైన్​ను దేశంలో కరోనా పెరిగిపోయిన భయాలతో, మానసిక ఒత్తిళ్లకు గురవుతున్న వారి గురించి.. 2022-23 బడ్జెట్​లో కేంద్రం ప్రకటించి.. 2022 అక్టోబరు 10న ప్రపంచ మానసిక దినోత్సవం రోజు ఏర్పాటు చేశారు. అన్ని రాష్ట్రాల్లోనూ ఇది పని చేస్తుంది. హైదరాబాద్​లో వెంగళ్​రావునగర్​లో ఈ విభాగం ఉంది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.