ETV Bharat / state

ఈఈ జగజ్యోతికి 14 రోజుల రిమాండ్ - చంచల్​గూడ మహిళ జైలుకు తరలింపు

author img

By ETV Bharat Telangana Team

Published : Feb 21, 2024, 7:13 PM IST

ACB Arrested Tribal Welfare EE Jaga Jyothi : లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన గిరిజన సంక్షేమ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ జగజ్యోతికి నాంపల్లి ఏసీబీ కోర్టు 14రోజుల రిమాండ్ విధించింది. ఆమెను ఇవాళ మధ్యాహ్నం కోర్టులో హాజరుపరచగా న్యాయస్థానం రిమాండ్ విధించింది. దీంతో ఆమెను చంచల్​గూడ మహిళ జైలుకు తరలించారు.

ACB Arrested Tribal Welfare EE Jaga Jyothi
ACB Arrested Tribal Welfare EE Jaga Jyothi

ఈఈ జగజ్యోతి కేసులో 14 రోజుల రిమాండ్​ విధించిన కోర్టు - చంచల్​గూడ మహిళ జైలు తరలింపు

ACB Arrested Tribal Welfare EE Jaga Jyothi : ట్రైబల్‌ వెల్ఫేర్‌ ఈఈ జగజ్యోతి నాంపల్లి ఏసీబీ (ACB) అధికారులు కోర్టులో హాజరు పర్చారు. న్యాయస్థానం ఆమెకు 14 రోజుల రిమాండ్ విధించింది. కోర్టు ఆదేశాల మేరకు ఏసీబీ అధికారులు ఆమెను చంచల్​గూడ మహిళ జైలుకు తరలించారు. రెండురోజుల క్రితం ఓ కాంట్రాక్టర్ నుంచి రూ.84 వేలు లంచం తీసుకుంటూ జగజ్యోతి ఏసీబీకి చిక్కింది.

సోదాల సమయంలో అస్వస్థతకు గురైన జగజ్యోతిని ఉస్మానియాలో చికిత్స పొందారు. నిన్నంతా పరీక్షించిన వైద్యులు ఆమె ఆరోగ్యంగానే ఉందని ఇవాళ డిశ్చార్జ్ చేశారు. అనంతరం జగజ్యోతిని ఏసీబీ అధికారులు నాంపల్లి కోర్టులో హాజరుపర్చారు. బిల్లుల మంజూరుకు లంచం డిమాండ్ చేసిన జగజ్యోతి నివాసంలో సోదాలు నిర్వహించిన అధికారులు 3.6 కిలోల బంగారు నగలు, 65.50 లక్షల నగదు, పలు పత్రాలు స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే.

ఈఈ జగజ్యోతి అరెస్ట్​ - రూ.64 లక్షలు, రెండున్నర కిలోల బంగారం స్వాధీనం

Tribal Welfare EE Jaga Jyothi : ప్రస్తుతం ఏసీబీ అధికారులు జగజ్యోతి ఇంట్లో లభించిన డాక్యుమెంట్లను పరిశీలిస్తున్నారు. సోదాల సమయంలో ఆమె ఇంట్లో డబ్బు, నగలతో పాటు భారీగా డాక్యుమెంట్లు దొరికాయి. ఇప్పుడా డాక్యుమెంట్ల విలువను అంచనా వేస్తున్నారు. అందుకోసం ఆయా రిజిస్ట్రర్ ఆఫీసులను సంప్రదిస్తున్నారు. అక్కడే లభించే సమాాచారంతోనే ఆమె ఆస్థుల మొత్తం విలువ తెలుస్తుంది.

జగజ్యోతి ఎవరైనా బినామీలు కూడా ఉన్నారా అన్న కోణంలోనూ ఏసీబీ విచారణ జరుపుతోంది. ఆమె ఆస్తుల పూర్తి వివరాలు తెలిసినా తరువాత ఏసీబీ అధికారులు ఆమె కస్టడీ కోరుతూ పిటిషన్ వేసే అవకాశం ఉంది. హెచ్​ఎండీఏ మాజీ అధ్యక్షుడు, రెరా కార్యదర్శి శివ బాలకృష్ణ కేసులోనూ ఏసీబీ అధికారులు ఇదే వ్యూహాన్ని అనుసరించారు.

జగజ్యోతి కేసులో ఏం జరిగిందంటే నిజామాబాద్​ జిల్లాలోని అభివృద్ధి పనులకు బిల్లులు మంజూరు చేసేందుకు గాజుల రామారంలోని బాలల సంరక్షణ గృహనిర్మాణ పనులు అప్పగించేందుకు కాంట్రాక్టర్​ బోడుకం గంగాధర్​ వద్ద గిరిజన సంక్షేమశాఖ ఈఈ జగజ్యోతి(EE Jag Jyothi Bribery Case) డబ్బులు డిమాండ్​ చేసింది. ఈ విషయాన్ని బాధితుడు అవినీతి నిరోధక శాఖ అధికారులను ఆశ్రయించాడు. దీనిపై అధికారులు స్పందించారు. పథకం ప్రకారమే సోమవారం రోజున కార్యాలయానికి వెళ్లిన గంగాధర్​ రూ.84 వేలు లంచం ఇచ్చాడు. ఆ సమయంలోనే అధికారులు ఆమెను పట్టుకున్నారు.

ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్న శివబాలకృష్ణ లీలలు - అజ్ఞాతంలోకి ఆ నలుగురు!

Banjarahills CI Bribe Case Updates : బంజారాహిల్స్ పోలీసుల వసూళ్ల పర్వంపై లోతుగా విచారణ.. ముడుపులు, కమీషన్లపై అనిశా ఆరా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.